India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చాలా మంది పాడి రైతులు పశువులను రోజంతా అలా కట్టేసి ఉంచుతారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు వెటర్నరీ నిపుణులు. దీని వల్ల వాటికి గాయాలు కావడంతో పాటు మానసిక ఒత్తిడికి గురవడంతో పాటు క్రమంగా దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతుందని అంటున్నారు. వాటిని కచ్చితంగా ఉదయం, సాయంత్రం కాసేపు నడిపించాలని సలహా ఇస్తున్నారు. వాటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, పశువులకు రోజూ స్నానం చేయించాలని సూచిస్తున్నారు.

ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్‌లో 250 అప్రెంటిస్ పోస్టులకు NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవడానికి ఇవాళే ఆఖరు తేదీ. TG ట్రాన్స్‌కోలో రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. BE/BTech(EEE, ECE, CSE, మెకానికల్, సివిల్, IT), డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు స్టైపెండ్ రూ.17,500, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.15,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://tgtransco.com

ఏదైనా నెలలో శుక్ల పక్షంలో(అమావాస్య తర్వాత వచ్చే కాలం) వచ్చే మొదటి గురువారం నాడు ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. అయితే ‘పుష్య మాసం’లో మాత్రం ఈ వ్రతాన్ని ప్రారంభించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. కోరుకున్న ఫలితం సిద్ధించాలంటే వరుసగా 16 గురువారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు. 17వ గురువారం నాడు ఉద్యాపన చేయాలి. కొంతమంది తమ జీవితకాలమంతా, 3 సంవత్సరాల పాటు కూడా ఈ వ్రతాన్ని కొనసాగిస్తారు.

ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్లు ఇకపై నేరుగా US స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టొచ్చు. ఇంటర్నేషనల్ ఎక్స్‌ఛేంజ్ (NSE IX) గ్లోబల్ యాక్సెస్ యాప్‌ను NSE లాంచ్ చేసింది. దీని ద్వారా యాపిల్, టెస్లా వంటి దిగ్గజ కంపెనీల షేర్లను నేరుగా కొనుగోలు చేయొచ్చు. GIFT City ద్వారా పనిచేసే ఈ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడికి ప్రత్యేక డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. పాన్, ఆధార్ ఆధారిత డిజిటల్ KYC నిమిషంలోనే పూర్తవుతుంది.

ఉదయాన్నే 10 నిమిషాలు కేటాయించి డైజెషన్, నాడీ వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. తొలుత 3 నిమిషాలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. తర్వాత 3 నిమిషాల పాటు స్ట్రెచింగ్స్ లేదా నడకతో గట్ మొబిలిటీ మెరుగుపడుతుంది. 2 నిమిషాల పాటు గోరువెచ్చని నీరు తాగితే బాడీ రీహైడ్రేట్ అవుతుంది. మరో 2 ని.లు ఎలాంటి స్ట్రెస్ లేకుండా టిఫిన్ చేయడానికి ముందు ప్రశాంతంగా ఉండాలి.

దోమల వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి మార్కెట్లో దొరికే కాయిల్స్, క్రీమ్స్, మస్కిటో మ్యాట్ ప్రొడక్ట్స్ వాడతాం. వీటి ప్రభావం మనపై కూడా పడుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుకోవాలంటున్నారు నిపుణులు. బంతి, తులసి, లావెండర్, రోజ్మేరీ, కలబంద మొక్కలు దోమలను తరిమేయడంలో సహకరిస్తాయి. అలాగే ఇంటి బయట వేప, యూకలిప్టస్ చెట్లను పెంచినా దోమల బెడద తగ్గుతుందంటున్నారు నిపుణులు.

మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన వెంటనే ఇరాన్‌పై అమెరికా దాడి చేసే అవకాశం ఉందని అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు గాజా మారణహోమానికి నెతన్యాహునే కారణమని ఆరోపించారు. ఆయన్ని ‘యుద్ధ నేరస్థుడి’గా అభివర్ణించారు. అలాంటి వ్యక్తిని మోదీ కౌగిలించుకోవడమేంటి అని ప్రశ్నించారు. ఇది పాలస్తీనాకు భారత్ అందించే చిరకాల మద్దతును దెబ్బతీయడమేనని విమర్శించారు.

పంట పండే సమయంలో ప్రతి మొక్కకు (కట్టకు) ఉండే కంకి గట్టిపడకుండా, పాలు పోసుకునే దశలో లేదా లేతగా ఉంటే, గింజ బరువు తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో పంటను అమ్మితే ఆశించిన బరువు రాకపోవడం వల్ల ఆదాయం తగ్గుతుంది. అంటే పంట కేవలం సంఖ్యలో (కంకులు) ఎక్కువగా ఉంటే సరిపోదు, గింజ ముదిరి గట్టిగా ఉంటేనే రైతుకు సరైన బరువు, తద్వారా లాభం వస్తుందని ఈ సామెత తెలియజేస్తుంది.

వ్రత సమయంలో మనసును దైవచింతనలో ఉంచాలి. అందుకోసం కొన్ని మంత్రాలను సూచిస్తున్నారు పండితులు. వీటిని పఠిస్తే గురు గ్రహ అనుగ్రహం కలిగి, ప్రతికూల శక్తులు తొలగిపోతాయని అంటున్నారు.
* బృహస్పతి బీజ మంత్రం: “ఓం బృం బృహస్పతయే నమః”
* గురు గాయత్రీ మంత్రం: “ఓం వృషభధ్వజాయ విద్మహే ఘృణిహస్తాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్”
* మహావిష్ణువు శ్లోకం: “శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం…”

నాగచైతన్య హీరోగా వస్తున్న మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ ఫస్ట్ గ్లింప్స్ మార్చి 5న విడుదల కానుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో చైతూ ట్రెజర్ హంటర్‌గా కనిపిస్తున్నారు. బ్రహ్మగిరి పర్వతాల్లో నిధి అన్వేషణ, అక్కడి మార్మిక ప్రపంచం చుట్టూ ఈ కథ సాగుతుంది. తాజా పోస్టర్‌లో చైతూ సీరియస్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.