News April 1, 2024

ధోనీ ధనాధన్.. పదేళ్ల క్రితం ట్వీట్ వైరల్

image

నిన్నటి ఢిల్లీ, చెన్నై మ్యాచ్‌లో ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ ప్రత్యేకంగా నిలిచింది. CSK ఓడినా మునపటి ధోనీని చూశాం, అది చాలు అని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ పదేళ్ల క్రితం చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ఏ జట్టు గెలుస్తుందనేది అనవసరం, నేను ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడానికే ఉన్నా’ అని 2014, మార్చి 24న ట్వీట్ చేశారు. అన్నట్టుగానే ధోనీ ఎంటర్‌టైన్ చేశారంటూ ఫ్యాన్స్ ఆ పాత పోస్ట్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

News April 1, 2024

టీడీపీకి షాక్.. రెబల్‌గా మీసాల గీత పోటీ

image

AP: విజయనగరం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత మీసాల గీత రెబల్‌గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈసారి టికెట్‌ను అదితి గజపతిరాజుకు ఇవ్వడంతో ఆమె అసంతృప్తిగా ఉన్నారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి ఆమె ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి విజయనగరం మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

News April 1, 2024

BREAKING: విచారణ వాయిదా

image

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో MLC కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. మార్చి 15న అరెస్టు అయిన కవిత.. ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

News April 1, 2024

భారత్ రికార్డును బ్రేక్ చేసిన శ్రీలంక

image

టెస్టుల్లో శ్రీలంక అరుదైన రికార్డు నెలకొల్పింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 531 పరుగులు చేసింది. ఇందులో ఆరుగురు ప్లేయర్లు అర్ధసెంచరీలు చేయగా.. ఏ ఒక్కరూ సెంచరీ చేయకపోవడం గమనార్హం. 1976లో న్యూజిలాండ్‌పై భారత్ ఇదే తరహాలో 524 పరుగులు చేసింది. తాజాగా శ్రీలంక ఆ రికార్డును అధిగమించి భారీ స్కోరు సాధించింది.

News April 1, 2024

తిహార్ జైలులో సెల్ కేటాయింపు

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌కు తిహార్ జైలులో అధికారులు సెల్ కేటాయించారు. జైలు నంబర్ 2 కాంప్లెక్స్‌లో ఆయనకు సెల్ కేటాయించగా.. అందులో కేజ్రీవాల్ ఒక్కరే ఉండనున్నారు. ఇదివరకు ఈ సెల్‌లో ఉన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను కొద్ది రోజుల క్రితం జైలు నంబర్ 5 కాంప్లెక్స్‌కి మార్చారు. ఇదే కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మహిళా ఖైదీలు ఉండే జైలు నంబర్ 6 కాంప్లెక్స్‌లో ఉంచారు.

News April 1, 2024

భోజ్‌శాల సర్వేపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు

image

మధ్యప్రదేశ్‌ ధార్ జిల్లాలోని వివాదాస్పద భోజ్‌‌శాల/కమల్ మౌలా మసీదుపై జరుగుతున్న శాస్త్రీయ సర్వేపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సర్వే ఫలితాలు వెల్లడయ్యాక తమ అనుమతి లేనిదే ఎలాంటి చర్యలు చేపట్టొద్దని ధర్మాసనం ఆదేశించింది. దీనిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం, పురావస్తు శాఖ, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కాగా ఈ ప్రదేశంలో మంగళవారం హిందువులు, శుక్రవారం ముస్లిములు ప్రార్థనలు చేస్తారు.

News April 1, 2024

ఏఐతో మానవాళి అంతానికి 20శాతం ఛాన్స్: మస్క్

image

ఏఐతో మానవాళి పూర్తిగా అంతమయ్యేందుకు 20శాతం వరకు ఛాన్స్ ఉందని టెస్లా వ్యవస్థాపకుడు మస్క్ అభిప్రాయపడ్డారు. ‘దానితో ఉన్న ఉపయోగాల దృష్ట్యా ఆమాత్రం రిస్క్ తీసుకోవడం తప్పదు. ఏఐను అభివృద్ధి చేయడమంటే పిల్లాడిని పెంచినట్లే. ఆ పెంపకం ఎలా ఉంటుందన్నదానిపై తుది ఫలితం ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ నిజమే చెప్పేలా శిక్షణనివ్వడం కీలకం. ఒకసారి అబద్ధాలు మొదలుపెడితే, దానికి అంతు ఉండదు’ అని హెచ్చరించారు.

News April 1, 2024

CSK ఓటమి.. సాక్షి పోస్ట్ వైరల్

image

నిన్నటి వైజాగ్‌ మ్యాచులో CSK ఓటమిపై ధోనీ భార్య సాక్షి సింగ్ ఆసక్తికర పోస్ట్ చేశారు. విజయాల ఖాతా తెరిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్‌‌ను ప్రశంసించారు. మరోవైపు పరోక్షంగా ధోనీ ఇన్నింగ్స్‌ను కొనియాడుతూనే.. CSK మ్యాచ్ ఓడిపోయిందని గుర్తించలేదని టీజ్ చేశారు. నిన్నటి మ్యాచులో ధోనీ ఆఖర్లో వచ్చి 37 పరుగులు చేశారు.

News April 1, 2024

బలవంతంగా మోసం చేస్తున్నారు!

image

సుమారు 5000మంది భారతీయులు కంబోడియాలోని సైబర్ నేరగాళ్ల చేతుల్లో చిక్కుకుపోయారు. నేరస్థులు బలవంతంగా వారితో ఇండియాలోని పౌరులను ఆన్‌లైన్ ద్వారా మోసం చేయిస్తున్నారు. గత 6నెలల్లో రూ.500కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఇక్కడి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రూ.67లక్షలు నష్టపోవడంతో స్కామ్ వెలుగు చూసింది. స్పందించిన కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం దాదాపు 250 మంది భారతీయులను స్వదేశానికి పంపించింది.

News April 1, 2024

ఒక్క మ్యాచుతో ధోనీ సరికొత్త రికార్డులు

image

నిన్న ఢిల్లీతో మ్యాచులో సీఎస్కే మాజీ కెప్టెన్ ధోనీ ఖాతాలో పలు రికార్డులు చేరాయి. ఐపీఎల్ ఒకే ఓవర్లో 20 అంతకన్నా ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో మొదటి స్థానంలో నిలిచారు. ధోనీ 9 సార్లు ఈ ఫీట్ అందుకోగా.. ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ(8) ఉన్నారు. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో 19, 20వ ఓవర్లలో 100 సిక్సర్లు బాదిన తొలి ప్లేయర్‌గా ధోనీ రికార్డులకెక్కారు.