News March 28, 2024

ఎంపీ, పంజాబ్‌లో ఫిరాయింపుల పర్వం – 2/2

image

పంజాబ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ‘పంజాబ్‌లో ఇప్పటి BJP ఒకప్పటి కాంగ్రెస్’ అని బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 2021లో మాజీ CM కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌ను వీడినప్పటి నుంచి చేరికలు మొదలయ్యాయి. 2022లో నాటి కాంగ్రెస్ చీఫ్ సునీల్ జాఖర్ BJPలో చేరి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఫిరాయింపులు జోరందుకున్నాయి. త్వరలో అకాలీ దళ్, AAP నుంచి కూడా చేరికలు ఉంటాయంటోంది బీజేపీ.
<<-se>>#Elections2024<<>>

News March 28, 2024

BREAKING: ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటన

image

మార్చి 31 నుంచి ఇంటర్ విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. 2024 మార్చి 31 నుంచి 2024 మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని ప్రకటన విడుదల చేసింది. మళ్లీ బోర్డు నుంచి ప్రకటన వచ్చిన తర్వాతే అడ్మిషన్లు తీసుకోవాలని ఇంటర్ కాలేజీలను ఆదేశించింది.

News March 28, 2024

తలైవా171.. మాస్ లుక్‌లో రజనీకాంత్

image

సూపర్ స్టార్ రజనీకాంత్.. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ‘తలైవా171’. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ఏప్రిల్ 22న రివీల్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌‌ను విడుదల చేశారు. చేతి వాచ్‌లను చైన్‌లా పట్టుకుని ఉన్న రజనీకాంత్ మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనుండగా.. శివకార్తికేయన్ కీలక పాత్రలో నటించనున్నారు.

News March 28, 2024

లంచాలు, వివక్ష లేని పాలన అందించాం: జగన్

image

AP: గడిచిన 58నెలల్లో ప్రతి ఇంటి తలుపు తట్టి సంక్షేమం అందించామని CM జగన్ తెలిపారు. ‘లంచాలు, వివక్ష లేని పాలన అందించాం. గతంలో పిల్లల చదువు కోసం ఎవరూ పట్టించుకోలేదు. నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాం. విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం బోధన ప్రవేశపెట్టాం. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా రూ.25లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఎక్కడ చూసినా విలేజ్ హెల్త్ క్లినిక్స్ కనిపిస్తున్నాయి’ అని వివరించారు.

News March 28, 2024

‘ప్రతినిధి-2’ టీజర్‌ రిలీజ్‌ టైమ్ ఫిక్స్‌

image

యంగ్ హీరో నారా రోహిత్‌ నటిస్తున్న ‘ప్రతినిధి-2’ మూవీ నుంచి అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా టీజర్‌‌‌ రేపు విడుదల కానుంది. శుక్రవారం ఉదయం 10.08 గంటలకు మెగాస్టార్ చిరంజీవి టీజర్‌ను విడుదల చేస్తారని మేకర్స్ తెలిపారు. ప్రముఖ జర్నలిస్ట్‌ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్‌ చేసిన కాన్సెప్ట్‌ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

News March 28, 2024

సామాన్యులకు గుడ్‌న్యూస్

image

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. దినసరి వేతనాలను 4-10శాతం పెంచింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.28 పెరిగి రూ.300కి చేరింది. హరియాణాలో అత్యధికంగా రూ.374 పొందుతుండగా.. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లో అత్యల్పంగా రూ.234 అందుకుంటున్నారు. పెంచిన వేతనాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

News March 28, 2024

నన్ను తిట్టుకోవద్దు.. లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు

image

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ నుంచి నిన్న ‘జరగండి’ పాట రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌‌లో చూసింది కొంతేనని.. థియేటర్‌లో పాటకు ప్రేక్షకులు స్టెప్పులేస్తారని నిర్మాత దిల్‌రాజు అన్నారు. ఫ్యాన్స్ తిట్టుకోవద్దని.. ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి లీకులు ఇవ్వలేనని అన్నారు. డైరెక్టర్ శంకర్ ఇవ్వమంటేనే ఇస్తానని చెప్పారు. RRR స్థాయికి రీచ్ అయ్యేలా మూవీని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

News March 28, 2024

యూఎన్ రిపోర్టును తప్పుబట్టిన కేంద్రమంత్రి

image

భారత్‌లో నిరుద్యోగ పరిస్థితి అధ్వానంగా ఉందన్న UN రిపోర్టును కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తప్పుబట్టారు. భారతీయ సంస్థల సర్వేల్లో భిన్నమైన గణాంకాలు ఉన్నాయన్నారు. ‘EPFOలో 6.4కోట్ల మంది రిజిస్టర్ అయ్యారు. ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల జనాభా కంటే ఎక్కువ. 34 కోట్ల ముద్రా లోన్లు మంజూరు కాగా వీటితో చాలా మంది ఉపాధిని సృష్టిస్తున్నారు. మనం విదేశీ రేటింగ్ సంస్థలపై ఆధారపడటం మానుకోవాలి’ అని పేర్కొన్నారు.

News March 28, 2024

‘విలేజ్ కుకింగ్ ఛానల్’ తాతకు గుండె వ్యాధి

image

యూట్యూబ్‌లో ‘విలేజ్ కుకింగ్ ఛానల్’తో దేశవ్యాప్త గుర్తింపు పొందిన పెరియతంబి గుండె సంబంధిత వ్యాధితో ఆస్పత్రి పాలయ్యారు. శస్త్రచికిత్స తర్వాత ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు టీమ్ సభ్యుడొకరు తెలిపారు. తాత ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఈ ఛానల్‌కు 2.42 కోట్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఛానల్ టీమ్‌తో కలిసి భోజనం చేశారు. విక్రమ్ సినిమాలోనూ వీరు నటించారు.

News March 28, 2024

ఉద్యోగ నియామక పరీక్ష వాయిదా

image

తెలంగాణ జెన్‌కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ నియామకాల పరీక్ష వాయిదా పడింది. ఎన్నికల కోడ్ కారణంగా ఈనెల 31న జరగాల్సిన పరీక్షను జెన్‌కో వాయిదా వేసింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పరీక్ష తేదీని ప్రకటిస్తామని తెలిపింది.