News March 25, 2024

HOLI: గాయాలున్నాయా? ఇలా చేయండి

image

రేపు హోలీ. సంబరాలకు అంతా సిద్ధమయ్యారు. అయితే రంగులు పూసుకునేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మరవొద్దు. ముఖ్యంగా శరీరంపై గాయాలున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. మీకు శరీరంపై గాయాలు ఉంటే వాటిపై బ్యాండేజ్ వేసుకోండి. దీనివల్ల రంగులు గాయాన్ని చేరకుండా ఉంటాయి. సహజమైన రంగులతో హోలీ ఆడినా ఈ జాగ్రత్త తీసుకోవడం మంచిది. ముఖంపై దద్దుర్లు, తామర వంటివి ఉంటే మొదట ఆయింట్మెంట్, ఆ తర్వాత నూనె రాసుకోండి.

News March 25, 2024

ఏ భాషలోనైనా ఉగ్రవాది ఉగ్రవాదే: జైశంకర్

image

ఉగ్రవాదుల్ని అంతర్జాతీయంగా స్తంభింపచేసేందుకు భారత్ యత్నిస్తుండగా, UNSCలో చైనా వీటో అధికారంతో అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ పరోక్ష విమర్శలు చేశారు. ‘వేరే భాష వాడుతున్నారనో లేక వేరే కారణం ఉందనో ఉగ్రవాదుల్ని ఎన్నడూ క్షమించకూడదు. ఏదైనా కారణం చెప్పి వారిని కాపాడితే, కచ్చితంగా సమస్యలు తలెత్తుతాయి’ అని వ్యాఖ్యానించారు.

News March 25, 2024

సొంత గ్రౌండ్స్‌లో ఐపీఎల్ టీమ్స్ ఆధిపత్యం

image

ఈ ఏడాది ఐపీఎల్‌లో 5 మ్యాచులు పూర్తయ్యాయి. అన్నింటిలోనూ విజయం హోం గ్రౌండ్‌ జట్లకే దక్కింది. చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే, పంజాబ్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్, రాజస్థాన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్, అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలుపొందాయి. ఇక నేడు బెంగళూరులో ఆర్సీబీ, పంజాబ్‌ మధ్య జరిగే మ్యాచ్‌లో ఇది కొనసాగుతుందో లేదో చూడాలి.

News March 25, 2024

తమన్నాతో డేటింగ్ అప్పుడు స్టార్ట్ అయింది: విజయ్ వర్మ

image

నటుడు విజయ్ వర్మతో రిలేషన్‌లో ఉన్నట్లు తమన్నా గత ఏడాది వెల్లడించిన సంగతి తెలిసిందే. లస్ట్ స్టోరీస్-2 సినిమాలో వీరు కలిసి నటించారు. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. దానిపై వర్మ స్పష్టతనిచ్చారు. ‘మేం ప్రేమించుకుంది లస్ట్ స్టోరీస్‌-2లో కాదు. ఓ పార్టీలో కలిసినప్పుడు తనతో ఎక్కువ సమయం ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాను. మరో 25 రోజుల తర్వాత మా రిలేషన్ ప్రారంభమైంది’ అని వెల్లడించారు.

News March 25, 2024

ఈ అవార్డు అతనికే: సంజూ

image

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తన మంచి మనసు చాటుకున్నారు. ఇవాళ LSGతో మ్యాచులో అర్ధసెంచరీ చేసిన సంజూను POTM వరించింది. అయితే ఈ అవార్డుకు బౌలర్ సందీప్ అర్హుడని, అతనికే దీన్ని ఇవ్వాలనుకుంటున్నానని సంజూ చెప్పారు. సందీప్ సరిగ్గా బౌలింగ్ చేయకుంటే తనకు ఈ అవార్డు దక్కేది కాదని తెలిపారు. దీంతో సంజూ కెప్టెన్‌గా హృదయాలు గెలుచుకున్నాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

News March 25, 2024

అర్వింద్ కేజ్రీవాల్ ఫోన్ మిస్సింగ్: ఈడీ

image

రెండేళ్ల క్రితం లిక్కర్ స్కామ్ జరిగిన సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వాడిన ఫోన్ కనిపించడం లేదని ఈడీ తాజాగా తెలిపింది. అది ఆయన వాడిన 171వ ఫోన్ అని, స్కామ్‌కు సంబంధించిన సమాచారం దానిలో ఉందని స్పష్టం చేసింది. విచారణలోనూ దాని గురించి తనకు తెలియదని కేజ్రీవాల్ చెప్పారని ఈడీ పేర్కొంది. మొత్తంగా కేసులో 36మంది నిందితులకు చెందిన 170 ఫోన్లు మిస్ కావడం గమనార్హం.

News March 25, 2024

100 మైళ్లు నడిచి.. రికార్డు బద్దలు కొట్టి..

image

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన బార్క్‌లీ మారథాన్‌ను పూర్తి చేసిన మొదటి మహిళగా జాస్మిన్ పారిస్(ఇంగ్లండ్) చరిత్ర సృష్టించారు. ఫినిషింగ్ లైన్ వద్ద ఆమె కూలబడిపోయిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 60గంటల్లో పూర్తి చేయాల్సిన మారథాన్‌ను 99 సెకన్లు మిగిలి ఉండగానే ఆమె పూర్తి చేశారు. 1989లో ఈ 100 మైళ్ల మారథాన్‌ మొదలవగా.. ఇప్పటి వరకు 20మంది పురుషులు మాత్రమే దీన్ని పూర్తి చేయగలిగారు.

News March 25, 2024

బీజేపీ తెలంగాణ ఎంపీ అభ్యర్థులు వీరే..(2/2)

image

✒ ఆదిలాబాద్- గోడం నగేశ్
✒ పెద్దపల్లి- గోమాస శ్రీనివాస్
✒ మెదక్- రఘునందన్ రావు
✒ మహబూబ్ నగర్- డీకే అరుణ
✒ నల్గొండ- సైదారెడ్డి
✒ మహబూబాబాద్ – అజ్మీరా సీతారాంనాయక్
✒ వరంగల్- ఆరూరి రమేశ్
✒ ఖమ్మం- వినోద్ రావు

News March 25, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 25, 2024

మార్చి 25: చరిత్రలో ఈ రోజు

image

క్రీ.పూ 421: ఇటలీలో వెనిస్ నగర స్థాపన
1655: శనిగ్రహ ఉపగ్రహం టైటాన్‌ను కనుగొన్న క్రిస్టియన్ హైగెన్స్
1927: పాండిచ్చేరి 13వ సీఎం పి. షణ్ముగం జననం
1933: శాస్త్రవేత్త, పద్మభూషణ్ వసంత్ గోవారికర్ జననం
1954: దేశంలోనే తొలి హెలికాప్టర్ ఎస్-55 సేవలు ప్రారంభం
1957: చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ జననం
1983: సాహితీవేత్త మానికొండ చలపతిరావు మరణం
2001: నటుడు కన్నడ ప్రభాకర్ మరణం