News March 29, 2024

పృథ్వీ షాను డగౌట్‌లో కూర్చోబెట్టడం ఏంటీ?: టామ్ మూడీ

image

ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసకర ఓపెనర్ పృథ్వీషాను డగౌట్‌లో కూర్చోబెట్టడం ఏంటని ఆసీస్ మాజీ క్రికెటర్ టామ్ మూడీ ప్రశ్నించారు. ‘పృథ్వీషా ఓ అద్భుత ఆటగాడు. అతడో డేంజరస్ క్రికెటర్. గత సీజన్‌లో అతడు రాణించకపోయి ఉండొచ్చు. అంతమాత్రాన బెంచ్‌కే పరిమితం చేస్తారా? అతడు డగౌట్ నుంచే పరుగులు చేయలేడు కదా’ అని ఆయన పేర్కొన్నారు. కాగా పృథ్వీ షా స్థానంలో తెలుగు కుర్రాడు రికీ భుయ్ జట్టులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

News March 29, 2024

దర్శి టీడీపీ అభ్యర్థిగా మహిళా డాక్టర్

image

AP: ప్రకాశం(D) దర్శి నియోజకవర్గంలో అనూహ్యంగా గొట్టిపాటి లక్ష్మి పేరుని TDP ప్రకటించింది. వృత్తిపరంగా ఆమె గైనకాలజిస్ట్. మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనుమరాలు. అద్దంకి MLA గొట్టిపాటి రవికుమార్ ఆమెకు బాబాయ్ అవుతారు. లక్ష్మీకి టికెట్ ఇప్పించడంలో రవికుమార్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కాగా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు తిరిగి టీడీపీలో చేరి దర్శి నుంచి పోటీ చేస్తారని భావించినా అలా జరగలేదు.

News March 29, 2024

ఆ టిప్పర్ డ్రైవర్ చంద్రబాబు కంటే ఎక్కువే చదివాడు: CM

image

AP: శింగనమల ఎమ్మెల్యే టికెట్ ఓ టిప్పర్ డ్రైవర్‌కు ఇచ్చామంటూ చంద్రబాబు తూలనాడాడని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ‘అవునయ్యా.. చంద్రబాబు. మేం పేదవాళ్లకు టికెట్లు ఇచ్చాం. ఆ టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు MA ఎకనామిక్స్, ఆపై బీఈడీ చదివాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు రాక డ్రైవర్ అయ్యారు. మడకశిరలోనూ ఉపాధి హామీ కూలీ లక్కప్పకు టికెట్ ఇచ్చామని గర్వంగా చెప్తా’ అని అన్నారు.

News March 29, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధా కిషన్‌రావుకు రిమాండ్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధా కిషన్‌రావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాసేపట్లో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. ఇప్పటికే మాజీ అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న అరెస్టు అయిన విషయం తెలిసిందే.

News March 29, 2024

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న KKR

image

RCBతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన KKR బౌలింగ్ ఎంచుకుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(C), రింకూసింగ్, నరైన్, రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్(C), కోహ్లీ, పాటిదార్, మాక్స్‌వెల్, గ్రీన్, దినేశ్ కార్తీక్, అనుజ్ రావత్, అల్జారీ జోసెఫ్, దగర్, సిరాజ్, యశ్ దయాల్.

News March 29, 2024

మరోసారి పెరిగిన ఫారెక్స్ నిల్వలు

image

దేశంలో విదేశీ మారకపు నిల్వలు వరుసగా ఐదో వారం వృద్ధిని నమోదు చేశాయి. ఈనెల 22 నాటికి $140 మిలియన్లు పెరగడంతో ఆ మొత్తం $642.63 బిలియన్లకు చేరినట్లు RBI వెల్లడించింది. అంతకుముందు వారం సైతం ఫారెక్స్ నిల్వలు $6.4 బిలియన్ల వృద్ధిని నమోదు చేశాయి. మరోవైపు బంగారం నిల్వలు $347 మిలియన్లు పెరిగి $51.49 బిలియన్లకు చేరాయి. కాగా ఫారిన్ కరెన్సీ అసెట్స్ $123 మిలియన్లు క్షీణించి $568.26 బిలియన్లకు పరిమితమయ్యాయి.

News March 29, 2024

మా ప్రభుత్వానికి రాఖీ కట్టండి: సీఎం జగన్

image

AP: చంద్రబాబు పేరు చెప్తే వెన్నుపోట్లు, మోసాలు తప్ప ఏమీ గుర్తు రావని సీఎం జగన్ మండిపడ్డారు. ‘అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందిస్తున్నాం. పేదలు, మహిళల కష్టాల్లో నుంచే పథకాలు పుట్టుకొచ్చాయి. సోదరుడిగా అక్కాచెల్లెమ్మలను అడుగుతున్నా.. ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి. బీసీల తోక కత్తిరిస్తానన్న బాబు తోక కత్తిరించండి. పేదల వ్యతిరేకులైన విపక్ష పార్టీలకు రాజకీయ సమాధి కట్టండి’ అని పిలుపునిచ్చారు.

News March 29, 2024

తొలిసారి కలిసికట్టుగా కదం తొక్కనున్న ఇండియా కూటమి – 1/2

image

NDAని పడగొట్టేందుకు ఇండియా కూటమి ఏర్పడినా, నేతలు తమ ఐక్యత చాటుకున్న సందర్భం ఒక్కటీ లేదు. గత ఏడాది మధ్యప్రదేశ్ ఎన్నికలకు ముందు అధిక ధరలు, నిరుద్యోగం, అవినీతిపై భోపాల్‌లో ర్యాలీ చేపట్టాలని కూటమి నిర్ణయించింది. కానీ కాంగ్రెస్ నేత కమల్‌‌నాథ్ దానిని క్యాన్సిల్ చేయడంతో కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఢిల్లీ CM కేజ్రీవాల్ అరెస్ట్‌పై నిరసనకు ఆదివారం కదం తొక్కాలని కూటమి నిర్ణయించింది.
<<-se>>#Elections2024<<>>

News March 29, 2024

తొలిసారి కలిసికట్టుగా కదం తొక్కనున్న ఇండియా కూటమి – 2/2

image

ప్రస్తుతం ఇండియా కూటమిని అసంతృప్తి జ్వాలలు వెంటాడుతున్నాయి. సీట్ల పంపిణీలో ఏకాభిప్రాయం కుదరక బెంగాల్‌లో తృణమూల్, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ ఒంటరిగా బరిలోకి దిగుతున్నాయి. సీట్ల పంపిణీపై క్లారిటీ రాకముందే మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం తమ లిస్టును ప్రకటించుకుంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో చేపట్టనున్న నిరసన కూటమి శ్రేణులపై ఎంతవరకు ప్రభావితం చేయగలదనేది ఆసక్తికరంగా మారింది.
<<-se>>#Elections2024<<>>

News March 29, 2024

స్వల్పంగా పెరగనున్న ఔషధాల ధరలు!

image

పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి అత్యవసర మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అత్యవసర ఔషధాల జాబితాలోని మందుల ధరలు 0.0055% పెంచనున్నట్లు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ వెల్లడించింది. అయితే ఇది గత ఏడాది, అంతకుముందు ఏడాది వచ్చిన హైక్స్‌తో పోలిస్తే చాలా తక్కువ. ఔషధాల ధరలు 2022లో 10%, 2023లో 12% పెరిగాయి.