News April 3, 2024

మన్మోహన్‌ 33 ఏళ్ల పార్లమెంట్ ప్రస్థానానికి తెర!

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(91) రాజ్యసభ పదవీ కాలం నేటితో ముగియనుంది. 1991లో తొలిసారి ఆయన పెద్దల సభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు PV నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక స్థితిని గాడిలో పెట్టారు. 2004-2014 వరకు ప్రధానిగా సేవలు అందించారు. కాగా మన్మోహన్ ప్రాతినిధ్యం వహించిన రాజస్థాన్ నుంచి ఈసారి సోనియా గాంధీ రాజ్యసభలో అడుగుపెడుతున్నారు.

News April 3, 2024

సీఎం ఎందుకు రాజీనామా చేయాలి?: ఆతిశీ

image

లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలుకు వెళ్లిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా? అనే ప్రశ్నపై ఆప్ మంత్రి ఆతిశీ స్పందించారు. ఆయన రాజీనామా చేసేందుకు ఒక్క కారణం కూడా లేదని ఆమె అన్నారు. లిక్కర్ స్కాం కేసు ఛార్జిషీట్‌లో కేజ్రీవాల్ పేరు లేదని, ఆయన దోషిగానూ తేలలేదని ఆమె చెప్పుకొచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆయనకు ఢిల్లీ అసెంబ్లీలో భారీ మెజార్టీ ఉందని పేర్కొన్నారు.

News April 3, 2024

నేడు కోల్‌కతాతో ఢిల్లీ ఢీ

image

నేడు విశాఖ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఆడిన 2 మ్యాచుల్లోనూ గెలిచి పాయింట్స్‌ టేబుల్‌లో 2వ స్థానంలో ఉన్న కోల్‌కతాను ఢీకొనడం 7వ స్థానంలో ఉన్న ఢిల్లీకి సవాల్‌తో కూడుకున్నదే. అయితే.. తొలి 2మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ.. CSKతో జరిగిన చివరి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు పృథ్వీషా, వార్నర్ ఫామ్‌లోకి వచ్చారు. మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

News April 3, 2024

రాజానగరం రాజు ఎవరో?

image

AP: పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గం తూ.గో(D) రాజానగరం. 2009,14లో ఇక్కడ TDP గెలువగా 2019లో YCP అభ్యర్థి జక్కంపూడి రాజా నెగ్గారు. మరోసారి రాజా YCP నుంచి బరిలో నిలువగా.. జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ పోటీ చేస్తున్నారు. పథకాలు, ఇళ్ల పట్టాల పంపిణీ కలిసొస్తుందని MLA రాజా భావిస్తున్నారు. TDP క్యాడర్ సపోర్ట్‌, పవన్ ఇమేజ్‌తో గెలుపు ఖాయమని బలరామకృష్ణ ధీమాగా ఉన్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 3, 2024

వీరికి ఇళ్ల వద్దే పెన్షన్.. GOOD NEWS చెప్పిన ప్రభుత్వం

image

AP: సచివాలయాల ఖాతాల్లో నిన్న పెన్షన్ల నిధులు జమ కాగా.. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఈ నెల 6 వరకు పంపిణీ చేయనున్నారు. విభిన్న దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యాల పాలైనవారు, మంచం/వీల్ ఛైర్లకే పరిమితమైన వారు, సైనిక పెన్షన్లు పొందే వృద్ధ వితంతువులకు ఇళ్ల వద్దే డబ్బులు ఇస్తారు. మిగతా వారు ఉ.9 నుంచి రాత్రి 7 గంటలలోపు సచివాలయాలకు వెళ్లి పెన్షన్లు తీసుకోవాలి. నగదు పంపిణీ టైంలో ప్రచారాలు, ఫొటోలు, వీడియోలు తీయకూడదు.

News April 3, 2024

ఉమ్మడి చిత్తూరులో నేడు సీఎం జగన్ బస్సు యాత్ర

image

AP: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 7వ రోజు సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం 9గంటలకు అమ్మగారిపల్లె నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. తేనెపల్లి, రంగంపేట క్రాస్ మీదుగా మధ్యాహ్నానికి జగన్ పూతలపట్టు చేరుకుంటారు. మ.3గంటలకు పూతలపట్టులో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం పి.కొత్తకోట, పాకాల, గదంకి, పనపాకం, చంద్రగిరి, రేణిగుంట మీదుగా గురువరాజుపల్లె చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

News April 3, 2024

జగన్, అవినాశ్‌లను ఓడించాలి: సునీత

image

AP: ఈ ఎన్నికల్లో ఎంపీ అవినాశ్ రెడ్డి, CM జగన్‌లను ఓడించాలని వివేకా కుమార్తె సునీత పిలుపునిచ్చారు. ‘మా నాన్న హత్య కేసులో శిక్ష పడితే ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు. కేసు విచారణకు రానీయకుండా జాప్యం చేస్తుంటే దోషులకు ఎప్పుడు శిక్ష పడుతుంది? ఇది వ్యవస్థలతో ఆడుకోవడమే. నేరగాళ్లు మళ్లీ మళ్లీ గెలుస్తుంటే.. వ్యవస్థలను స్వప్రయోజనాలకు వాడుకుంటారు. గత ఎన్నికల్లో జగన్‌ను గుడ్డిగా నమ్మా’ అని ఆమె వెల్లడించారు.

News April 3, 2024

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసనలు: మంద కృష్ణ

image

TG: కాంగ్రెస్ పార్టీ MP అభ్యర్థుల ఎంపిక తీరును నిరసిస్తూ నేటి నుంచి మాదిగలు నిరసనలు చేపట్టనున్నట్లు MRPS అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. ‘రాష్ట్రంలో 3 SC రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉంటే పెద్దపల్లి, నాగర్‌కర్నూల్ సీట్లు మాలలకు కేటాయించారు. మిగిలిన WGL కోసం ఐదారుగురు మాదిగలు చూస్తుంటే.. మాదిగ ఉపకులమైన బైండ్లకు చెందిన కడియం కావ్యకు ఇచ్చారు’ అని ఆయన అన్నారు.

News April 3, 2024

నేటి నుంచి ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు శిక్షణ

image

TG: ఎక్సైజ్ శాఖ కానిస్టేబుళ్లకు నేటి నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. హైదరాబాద్ అప్పాజంక్షన్ వద్ద ఉన్న ట్రైనింగ్ అకాడమీలో మొదటి బ్యాచ్‌లో భాగంగా 125 మంది ట్రైనీలకు శిక్షణ ఇవ్వనున్నారు. 475 మంది కానిస్టేబుళ్లు ట్రైనింగ్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. కాగా రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ఎక్సైజ్ కానిస్టేబుళ్ల శిక్షణకు ఇటీవల సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

News April 3, 2024

స్కూళ్లకు సెలవులు.. మరో కీలక ఆదేశం

image

AP: ఈ నెల 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించిన విద్యాశాఖ.. ఫైనల్ పరీక్షలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. రెండు రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేసి ఏప్రిల్ 23న ఫలితాలను ప్రకటించి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. జూన్ 11 వరకు సెలవులు ఉంటాయి.