India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిన్న RRపై విరాట్ చేసిన సెంచరీపై విమర్శలు వస్తున్నాయి. సెంచరీకి కోహ్లీ 67 బంతులు తీసుకున్నారని, చివరి ఓవర్లలో సింగిల్స్ తీయడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కోహ్లీ వేగంగా ఆడి ఉంటే స్కోర్ 200 దాటేదని, అతడిది స్వార్థపూరిత ఇన్నింగ్స్ అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే జట్టులో మిగతా ప్లేయర్లు ఏమాత్రం సపోర్ట్ చేయకపోయినా కోహ్లీ సూపర్ సెంచరీ చేశారని కొందరు మద్దతుగా నిలుస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

67 బంతులు- విరాట్ కోహ్లీ (2024)
67- మనీశ్ పాండే (2009)
66- జోస్ బట్లర్ (2022)
66- సచిన్ (2011)
66- డేవిడ్ వార్నర్ (2010)

ఉదయాన్నే బ్రష్ సరిగ్గా చేయకపోతే పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని US పరిశోధకులు హెచ్చరించారు. ఫ్రెడ్‌హట్చిన్‌సన్ క్యాన్సర్ కేంద్రానికి చెందిన పరిశోధకులు 200 మంది క్యాన్సర్ బాధితులపై రీసెర్చ్ చేశారు. బాధితుల్లోని సగం కణతుల్లో దంతాల్లో ఉండే సూక్ష్మజీవులున్నట్లు గుర్తించారు. ఇవి క్యాన్సర్‌కు కారణమవుతాయని నిర్ధారించారు. 20-49 ఏళ్ల వయస్సు వారు దీని బారిన పడటం ఏడాదికి 1.5% పెరుగుతోందని తెలిపారు.

ఐపీఎల్‌లో అత్యధిక క్యాచులు (110) అందుకున్న ఫీల్డర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. అతని తర్వాత వరుసగా సురేశ్ రైనా (109), కీరన్ పొలార్డ్ (103), రోహిత్ శర్మ (99), శిఖర్ ధవన్ (98), రవీంద్ర జడేజా (98) ఉన్నారు. అలాగే ఓడిన మ్యాచుల్లో అత్యధిక సెంచరీలు(3) చేసిన ఆటగాడిగానూ కోహ్లీ నిలిచారు.

AP: రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఈనెల 2 వరకు కొత్తగా 1,26,549 ఓటర్లు నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. మహిళా ఓటర్ల సంఖ్య 2,08,49,730 నుంచి 2,09,16,389కి పెరిగిందని, పురుష ఓటర్ల సంఖ్య 2,00,84,276 నుంచి 2,01,44,166కి పెరిగినట్లు తెలిపింది. కొత్త ఓటర్ల నమోదుకు ఇంకా అవకాశం ఉండడంతో ఓటర్ల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.

IPL-2024లో ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. తొలి మ్యాచ్ మ.3:30 నుంచి వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. ఇప్పటివరకు ఢిల్లీ ఆడిన నాలుగింట్లో 1 గెలవగా, ముంబై ఇంకా ఖాతా తెరవలేదు. రెండో మ్యాచ్ రాత్రి 7:30 నుంచి LSG, GT మధ్య లక్నో వేదికగా జరగనుంది. GT 4 ఆడి 2 గెలవగా, LSG మూడింట్లో 2 గెలిచి పాయింట్స్ టేబుల్‌లో 4వ స్థానంలో ఉంది. నేడు ఏ జట్టు గెలుస్తుందో కామెంట్ చేయండి.

AP: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు చేరుకున్నాయి. నిన్న 7 జిల్లాల్లో దాదాపు 45 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. సగానికి పైగా మండలాల్లో వడగాడ్పులు వీచాయని పేర్కొంది. అనకాపల్లి(D) రావికమతం, నంద్యాల(D) బ్రాహ్మణ కొట్కూరు, పల్నాడు(D) రావిపాడు, ప్రకాశం (D) తోకపల్లె, 44.9 డిగ్రీలు నమోదైందని వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో 40-44 డిగ్రీల మధ్య నమోదైనట్లు తెలిపింది.

TS EAPCET దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. ఆలస్య రుసుముతో మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు 3.41 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే 21వేల దరఖాస్తులు పెరిగాయి. దీంతో ఇంజినీరింగ్‌కు మళ్లీ డిమాండ్ పెరుగుతోందా? అనే చర్చ మొదలైంది. EAPCETకు మొత్తంగా ఈసారి 3.60 లక్షల అప్లికేషన్లు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీ నుంచి ఇప్పటివరకు 57,978 మంది అప్లై చేశారని వెల్లడించారు.

ఎంతో ఆలోచించిన తర్వాతే ఆమిర్‌ఖాన్ నుంచి విడాకులు తీసుకున్నట్లు అతని మాజీ భార్య కిరణ్‌రావు తెలిపారు. ‘విడాకుల విషయంలో నేను భయపడలేదు. ఏకాంతం కావాలని, స్వతంత్రంగా జీవించాలని అనుకున్నా. స్వతహాగా ఎదగాలని భావించా. నా ఆలోచనలను ఆమిర్ గౌరవించి సపోర్ట్ చేశాడు. మా మధ్య ప్రేమాభిమానాలు ఇప్పటికీ మారలేదు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2005లో వీరికి పెళ్లి కాగా, 2021లో విడిపోయారు. వీరికి ఒక బాబు ఉన్నాడు.

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఇవాళ అనకాపల్లి రానున్నారు. సా.3:30 గంటలకు హెలికాప్టర్‌లో అనకాపల్లికి చేరుకుంటారు. హెలీప్యాడ్ వద్ద నుంచి పలు కూడళ్ల మీదుగా నెహ్రు చౌక్ జంక్షన్ వరకూ రోడ్డు షో నిర్వహిస్తారు. అనంతరం సా.4 గంటలకు వారాహి వాహనం మీద నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
Sorry, no posts matched your criteria.