India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సెటైర్లు వేశారు. గ్యారంటీలు అమలు చేసేందుకు కాంగ్రెస్ తమ పార్టీ కార్యాలయాల్లో డబ్బు ముద్రిస్తుందేమో అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించాలన్నారు.

రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నుంచి ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్లను విడుదల చేశారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తామని మూవీ టీమ్ తెలిపింది.

టాటా గ్రూప్‌కు చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్‌లో సంక్షోభం నెలకొంది. విస్తారాను ఎయిర్‌ఇండియాలోకి విలీనం చేయడం, జీతాల చెల్లింపు, విధుల కేటాయింపుపై పైలట్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కొరతతో విస్తారా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. పైలట్ల నిరసనకు ఎయిర్ ఇండియాకు చెందిన యూనియన్లు మద్దతు తెలిపాయి. పైలట్లను బందీ కార్మికులుగా చూస్తున్నారని, వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ అరుదైన రికార్డు నెలకొల్పింది. 200 లేదా అంతకన్నా ఎక్కువ పరుగులను అత్యధిక సార్లు ఛేజ్ చేసిన జట్టుగా నిలిచింది. ఇప్పటివరకు పంజాబ్ 6 సార్లు ఈ ఘనత అందుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై ఇండియన్స్(5), KKR(3), CSK(3) ఉన్నాయి.

నటి, మండ్య ఇండిపెండెంట్ ఎంపీ సుమలత బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అయితే.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని వెల్లడించారు. ఆమె 2019 జనరల్ ఎలక్షన్స్‌లో HD కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామిని ఓడించి ఎంపీ అయ్యారు. అప్పుడు ఆమెకు బీజేపీ మద్దతు తెలిపింది. కాగా బీజేపీ పెద్దల సమక్షంలో ఆమె ఈరోజు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఢిల్లీ మంత్రి ఆతిశీకి ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. బీజేపీపై చేసిన ఆరోపణలకు ఈనెల 8న మ.12 గంటలలోపు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. బీజేపీలో చేరాలంటూ ఆ పార్టీ నేతలు తమను సంప్రదించారని, పార్టీలో చేరకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరించినట్లు ఆమెతో పాటు నలుగురు ఆప్ సీనియర్ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కీలక హామీలు ఇచ్చింది. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల ప్రకారం ఏటా పంటకు కనీస మద్దతు ధర ఇస్తామని పేర్కొంది. దాదాపు 30 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపింది. అంతేకాకుండా రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.25 లక్షల క్యాష్ లెస్ ఇన్సూరెన్స్‌ను దేశవ్యాప్తంగా తీసుకొస్తామని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంది.

లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. అందులో భాగంగా.. మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు ఏడాదికి రూ.లక్ష ఇస్తామని ప్రకటించింది. విద్యార్థులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామని చెప్పింది.

రెపో రేట్‌లో ఎలాంటి మార్పులు చేయట్లేదని RBI ప్రకటించినా అది స్టాక్ మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 60 పాయింట్ల స్వల్ప నష్టంతో 74160 వద్ద సెన్సెక్స్.. 24 పాయింట్ల లాస్‌తో 22,490 వద్ద నిఫ్టీ ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. రియల్టీ రంగం షేర్లు రాణించినా ఇతర ప్రధాన రంగాల షేర్లు మందకొడిగా సాగుతున్నాయి. HDFC బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఎస్‌బీఐ లైఫ్, కొటక్ బ్యాంక్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.

<<12964536>>కచ్చతీవు<<>> ద్వీపాన్ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్లకు ఎలాంటి ఆధారం లేదని శ్రీలంక మంత్రి డగ్లస్ దేవానంద అన్నారు. ‘1974 ఒప్పందం ప్రకారం కచ్చతీవును శ్రీలంకకు అప్పగించారు. 1976లో కుదిరిన మరో ఒప్పందం ప్రకారం కన్యాకుమారికి దిగువన వెస్ట్ బ్యాంకు ప్రాంతం భారత్‌కు దక్కింది. అది కచ్చతీవు కంటే 80 రెట్లు పెద్దది’ అని తెలిపారు. ఎన్నికల వేళ ఈ ద్వీపం వ్యవహారం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.