India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఐపీఎల్ వ్యక్తిగత ఆట అయ్యుంటే ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎక్కువ ట్రోఫీలు గెలిచేవాడని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. అది గ్రూప్ గేమ్ కావడం వల్లే కోహ్లీ ఏం చేయలేకపోతున్నాడని చెప్పారు. అతడు ధారాళంగా పరుగులు చేస్తున్నా మిగతా బ్యాటర్ల నుంచి సహాయం అందడం లేదని పేర్కొన్నారు. కాగా 16 ఏళ్లుగా ఆర్సీబీలో స్టార్స్ ఉన్నా ట్రోఫీ మాత్రం నెగ్గడం లేదు.

సునీల్ నరైన్ మరోసారి బ్యాట్‌తో మ్యాజిక్ చేశారు. ఢిల్లీపై విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అలరించారు. కేవలం 39 బంతుల్లోనే 85 రన్స్ చేశారు. 7 సిక్సర్లు, 7 ఫోర్లతో రఫ్ఫాడించారు. అంతకుముందు మ్యాచులో ఆర్సీబీపై 22 బంతుల్లోనే 47 పరుగులు చేశారు. ఈ ఆల్‌రౌండర్‌ను ఓపెనర్‌గా పంపాలన్న గంభీర్ నిర్ణయం గ్రాండ్ సక్సెస్ అయిందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.

సాధారణంగా తనను బాగా చూసుకునే భర్త కావాలని మహిళలు కోరుకుంటారు. కానీ ముంబైకి చెందిన ఓ 37ఏళ్ల మహిళ రిక్వైర్మెంట్ చూసి నెటిజన్లు నివ్వెరపోతున్నారు. ఏడాదికి రూ.4లక్షలు సంపాదించే ఈమెకు కనీసం రూ.కోటి సంపాదించే వరుడు కావాలని పేర్కొంది. ముంబైలో సొంతిల్లు, స్థిరమైన ఉద్యోగంతో పాటు బాగా చదువుకున్న కుటుంబానికి చెందిన వాడై ఉండాలట. సర్జన్ లేదా CAకి ప్రాధాన్యం ఇస్తుందట. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈనెల 9న ఉగాది పండగ సందర్భంగా తెలుగు ప్రజలు ‘క్రోధి’నామ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు. ఇది కలియుగంలో 5,125వ సంవత్సరం. క్రోధినామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేదని అర్థం. అంటే ప్రజలు కోపం, ఆవేశంతో వ్యవహరిస్తారని పండితులు చెబుతున్నారు. కుటుంబసభ్యుల మధ్య కోపతాపాలు, రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు, దేశాల మధ్య కోపావేశాలతో యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.

AP: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రూ.34 కోట్ల సొత్తు సీజ్ చేశామని సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఇందులో రూ.11 కోట్ల నగదు, రూ.7కోట్ల విలువైన మద్యం, రూ.10 కోట్ల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయన్నారు. మొత్తం 3,300 FIRలు నమోదయ్యాయని, సీ-విజిల్ యాప్ ద్వారా 5,500 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. ఎన్నికలకు సంబంధించి 3,040 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు.

* 148/2 – SRH vs MI, హైదరాబాద్, 2024
* 141/2 – MI vs SRH, హైదరాబాద్, 2024
* 135/1 – KKR vs DC, వైజాగ్, (ఇవాళ్టి మ్యాచ్)
* 131/3 – MI vs SRH, అబుదాబి, 2021
* 131/3 – PBKS vs SRH, హైదరాబాద్, 2014
* 130/0 – డెక్కన్ ఛార్జర్స్ vs MI, ముంబై, 2008

TG: షెడ్యూల్ రాకముందే అడ్మిషన్‌లు తీసుకుంటే చర్యలు తప్పవని రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు వార్నింగ్ ఇచ్చింది. పీఆర్వోలను పెట్టుకుని కొన్ని కాలేజీలు అడ్మిషన్లు చేయిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. ఇంకా జూనియర్ కాలేజీలకు 2024-25 విద్యాసంవత్సరం అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించే కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

TG: గతంలో దుండగుల కాల్పుల్లో అకాలమరణం చెందిన జవాన్ యాదయ్య కుటుంబానికి సాయం అందించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. ‘నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డి పల్లెకు చెందిన యాదయ్య కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఐదెకరాల భూమి, ఆయన భార్య సునితమ్మకు ఉద్యోగం కల్పించడం జరిగింది. ఈ విధంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగిందన్న తృప్తి కలిగింది’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

వేసవి వచ్చిదంటే మామిడి పండ్ల సందడి మొదలవుతుంది. అయితే ఈసారి ఈ సందడి ఇంకాస్త ఎక్కువ ఉండనుందట. పంట దిగుబడి పెరగడమే ఇందుకు కారణం. గత ఏడాదితో పోలిస్తే 14శాతం వృద్ధి నమోదై ఈసారి పంట దిగుబడి 24 మిలియన్ టన్నులకు చేరొచ్చని ICAR-CISH వెల్లడించింది. ఈసారి 10-20 రోజుల పాటు తీవ్ర వడగాల్పులు ఉండొచ్చన్న IMD హెచ్చరికపై స్పందిస్తూ.. అది పంట దిగుబడిపై పెద్ద ప్రభావం చూపకపోవచ్చని పేర్కొంది.

AP: వృద్ధురాలి మృతిపై వైసీపీ శవ రాజకీయం చేస్తోందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ‘సహజంగా మరణించిన వృద్ధురాలి శవాన్ని చంద్రబాబు ఇంటికి తీసుకెళ్లేందుకు మంత్రి జోగి రమేశ్ డ్రామా ఆడారు. ఆయన్ని వృద్ధురాలి బంధువులు తిట్టి అక్కడి నుంచి పంపించారు. 2014లో తండ్రి శవం.. 2019 బాబాయ్ శవం.. 2024 పెన్షనర్ శవం. వైసీపీ బతుకే ఫేక్.. ఆ పార్టీ డీఎన్ఏలోనే శవ రాజకీయం ఉంది’ అని ఆయన ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.