India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ఈ ఎన్నికల్లో ఎంపీ అవినాశ్ రెడ్డి, CM జగన్‌లను ఓడించాలని వివేకా కుమార్తె సునీత పిలుపునిచ్చారు. ‘మా నాన్న హత్య కేసులో శిక్ష పడితే ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు. కేసు విచారణకు రానీయకుండా జాప్యం చేస్తుంటే దోషులకు ఎప్పుడు శిక్ష పడుతుంది? ఇది వ్యవస్థలతో ఆడుకోవడమే. నేరగాళ్లు మళ్లీ మళ్లీ గెలుస్తుంటే.. వ్యవస్థలను స్వప్రయోజనాలకు వాడుకుంటారు. గత ఎన్నికల్లో జగన్‌ను గుడ్డిగా నమ్మా’ అని ఆమె వెల్లడించారు.

TG: కాంగ్రెస్ పార్టీ MP అభ్యర్థుల ఎంపిక తీరును నిరసిస్తూ నేటి నుంచి మాదిగలు నిరసనలు చేపట్టనున్నట్లు MRPS అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. ‘రాష్ట్రంలో 3 SC రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉంటే పెద్దపల్లి, నాగర్‌కర్నూల్ సీట్లు మాలలకు కేటాయించారు. మిగిలిన WGL కోసం ఐదారుగురు మాదిగలు చూస్తుంటే.. మాదిగ ఉపకులమైన బైండ్లకు చెందిన కడియం కావ్యకు ఇచ్చారు’ అని ఆయన అన్నారు.

TG: ఎక్సైజ్ శాఖ కానిస్టేబుళ్లకు నేటి నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. హైదరాబాద్ అప్పాజంక్షన్ వద్ద ఉన్న ట్రైనింగ్ అకాడమీలో మొదటి బ్యాచ్‌లో భాగంగా 125 మంది ట్రైనీలకు శిక్షణ ఇవ్వనున్నారు. 475 మంది కానిస్టేబుళ్లు ట్రైనింగ్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. కాగా రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ఎక్సైజ్ కానిస్టేబుళ్ల శిక్షణకు ఇటీవల సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

AP: ఈ నెల 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించిన విద్యాశాఖ.. ఫైనల్ పరీక్షలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. రెండు రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేసి ఏప్రిల్ 23న ఫలితాలను ప్రకటించి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. జూన్ 11 వరకు సెలవులు ఉంటాయి.

TG: మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై కేసు నమోదైంది. మార్చి 27న బీజేపీ కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు, మెదక్ BRS MP అభ్యర్థి వెంకట్రామిరెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని ఆయన కోరినట్లు పోలీసులు వెల్లడించారు.

TG: వేసవి ఆరంభంలోనే రాష్ట్రాన్ని కరవు ఛాయలు కమ్ముకున్నాయి. మిడ్ మానేరు ప్రాజెక్టులో నీరు తగ్గడంతో ముంపు గ్రామాలు బయటపడుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 11 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఇప్పుడు కుడి, ఎడమ కాలువలతో పాటు లోయర్ మానేర్ డ్యామ్‌కు నీటిని విడుదల చేస్తుండటంతో మిడ్ మానేరు ప్రాజెక్టులో నీరు తగ్గింది. ఇన్నాళ్లు నీటిలో మునిగి ఉన్న ముంపు గ్రామాల్లోని ఇళ్లు, స్కూళ్లు, ఆలయాలు బయటపడుతున్నాయి.

AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటించనున్నారు. కొత్తపేట, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజాగళం రోడ్ షోలు నిర్వహించనున్నారు. 4న కొవ్వూరు, గోపాలపురం, 5న నరసాపురం, పాలకొల్లు, 6న పెదకూరపాడు, సత్తెనపల్లి, 7న పామర్రు, పెనమలూరులో ఆయన పర్యటిస్తారు. ప్రజాగళంలో భాగంగా ఇప్పటికే ఆయన 15 నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించారు.

భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడటమే తన లక్ష్యమని యువ పేసర్ మయాంక్ యాదవ్ అన్నారు. ‘వేగంగా బౌలింగ్ చేయడానికి డైట్, సరిపడా శిక్షణ అవసరం. త్వరగా రికవరీ కావడానికి చన్నీటి స్నానం, డైట్‌పై ఫోకస్ చేస్తున్నా’ అని తెలిపారు. కాగా ఆర్సీబీతో నిన్న జరిగిన మ్యాచ్‌లో మయాంక్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. 4 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించారు.

TG: మండు వేసవిలో నీరు దొరక్క వన్య ప్రాణులు అల్లాడిపోతున్నాయి. వీటి కోసం తెలంగాణ అడవులలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి గుంటల్లో జీవాలు గొంతు తడుపుకుంటున్నాయి. పులి, జింకలు, అడవి దున్నలు, హైనాలు నీటి కుంటల్లో దాహార్తిని తీర్చుకుంటున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కగా.. వీటిని అటవీ శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వన్యప్రాణులు కోసం అధికారులు తీసుకుంటున్న చర్యల్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.

విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం తీసుకొచ్చిన EMPS కొత్త స్కీమ్ అమల్లోకి వచ్చింది. జులై 31 వరకు అమల్లో ఉండే ఈ పథకం కింద రాయితీల కోసం రూ.500 కోట్లు కేటాయించారు. మొత్తం 3.72లక్షల ఈవీ వెహికల్స్ కొనుగోలును ప్రోత్సహించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కింద EV బైక్‌లకు రూ.10 వేలు, ఇ-రిక్షా, ఇ-కార్ట్‌లకు రూ.25వేలు, 3 చక్రాల ఈవీలను కొనుగోలు చేసే వారికి రూ.50 వేల సబ్సిడీ లభిస్తుంది.
Sorry, no posts matched your criteria.