News April 2, 2024

టీ20 వరల్డ్‌ కప్ నుంచి తప్పుకొన్న బెన్ స్టోక్స్

image

త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ నుంచి ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ తప్పుకొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. ‘ప్రస్తుతం నేను నా ఫిట్‌నెస్, శారీరక సామర్థ్యం మెరుగుపరచుకోవడంపై దృష్టి సారించాను. ఆల్‌రౌండర్‌గా 100శాతం ప్రదర్శన కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇందుకే ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్‌ నుంచి తప్పుకొన్నాను’ అని స్పష్టం చేశారు. టెస్టుల్లో ఆడేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News April 2, 2024

‘లాల్ సలామ్’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ మార్పు?

image

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘లాల్ సలామ్’ సినిమా OTT రిలీజ్‌పై సందిగ్ధం నెలకొంది. OTT హక్కులను దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్.. చిత్రీకరణ సమయంలో మిస్ అయిన 21రోజుల ఫుటేజీని ఇవ్వాలని డిమాండ్ చేసిందట. డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ ఫుటేజీ మిస్సింగ్ విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ఈనెల 12న నెట్‌ఫ్లిక్స్‌కి బదులు ‘సన్ నెక్స్ట్’లో ప్రసారం కానుందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News April 2, 2024

కేసీఆర్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు: రేవంత్

image

TG: మాజీ సీఎం కేసీఆర్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్ పరిస్థితి చూస్తే జాలేస్తోంది. ఆయన అధికారం పోయిన బాధలో ఉన్నారు. పదేళ్ల తర్వాత కేసీఆర్‌కు రైతులు గుర్తొచ్చారు. మా వల్లే కరవు వచ్చిందని అంటున్నారు. వర్షాలు కురవకపోవడంతో కరవు వచ్చింది. మేం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అవుతోంది. మా వల్ల కరవు ఎలా వస్తుంది?’ అని ఆయన మండిపడ్డారు.

News April 2, 2024

BREAKING: ఎంపీగా షర్మిల పోటీ.. ఎక్కడి నుంచంటే?

image

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 114 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేయనున్నారు. రాజమండ్రి – గిడుగు రుద్రరాజు, కాకినాడ – పల్లంరాజు, బాపట్ల – జేడీ శీలం, కర్నూలు – రాంపుల్లయ్య యాదవ్ లోక్‌సభ బరిలో ఉన్నారు.

News April 2, 2024

మల్కాజిగిరిలో మా పోటీ బీజేపీతోనే: కేటీఆర్

image

మల్కాజిగిరి స్థానంలో తమ పోటీ బీజేపీతోనేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. శామిర్‌పేటలో జరిగిన మల్కాజిగిరి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో మళ్లీ వెనుకటి రోజులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని రేవంత్ నిజాయితీగా ముందే చెప్పాడు. మనమే ప్రజలకు సరిగ్గా చెప్పలేదు. మల్కాజిగిరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని పెట్టింది. మన పోటీ కచ్చితంగా బీజేపీతోనే’ అని పేర్కొన్నారు.

News April 2, 2024

సచివాలయానికి వెళ్తూ వృద్ధుడు మృతి.. రూ.5 లక్షల పరిహారం

image

AP: పింఛన్ కోసం సచివాలయానికి వెళ్తూ కాకినాడ రూరల్‌ తూరంగిలో వెంకట్రావ్(70) అనే వృద్ధుడు గుండెపోటుతో మరణించారు. ఆయన మృతిపై సీఎం జగన్ సంతాపం తెలిపారు. వెంకట్రావ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని అధికారులని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు.

News April 2, 2024

ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి: సురేశ్ రైనా

image

చారిత్రక ఘట్టమైన 2011 వరల్డ్ కప్‌ను భారత జట్టు గెలుచుకున్న క్షణాలను తలుచుకుంటే ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ట్వీట్ చేశారు. అద్భుతమైన టీమ్‌తో మరిచిపోలేని జ్ఞాపకాలు అంటూ WC అందుకున్న ఫొటోలను షేర్ చేశారు. రైనా 2011 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఆ టోర్నీలో పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన రైనా.. సెమీస్‌లో పాకిస్థాన్‌పై గెలవడంలోనూ ముఖ్యపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

News April 2, 2024

‘జైశ్రీరామ్’ నినాదం కడుపు నింపదు: కేటీఆర్

image

‘జై శ్రీరామ్’ నినాదాలు చేసే పిల్లలకు బీఆర్ఎస్ కార్యకర్తలు నచ్చజెప్పాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. ‘మనదే నిజమైన సెక్యులర్ పార్టీ అని ప్రతి క్రిస్టియన్, ముస్లిం సోదరుడికీ చెబుదాం. జై శ్రీరామ్ నినాదాలు చేసే పిల్లలకు అది కడుపు నింపదని, ఉద్యోగం ఇవ్వదని చెప్పండి. మీకోసం పార్లమెంటులో మాట్లాడేవాళ్లు, కొట్లాడేవాళ్లు కావాలి అని వారికి అర్థమయ్యేలా వివరించండి’ అని సూచించారు.

News April 2, 2024

BREAKING: లిక్కర్ స్కామ్.. ఎంపీకి బెయిల్

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సంజయ్ సింగ్‌పై ఎలాంటి ఆంక్షలు విధించొద్దని సూచించింది. అతను ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని తెలిపింది. ఈ కేసులో సంజయ్ 6 నెలల పాటు జైలులో ఉన్నారు. మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత జైలులో ఉన్నారు.

News April 2, 2024

కేసీఆర్ గౌరవం నిలుపుకోవాలి: మంత్రి తుమ్మల

image

TG: కాంగ్రెస్ 100 రోజుల పాలనపై విపక్షాలు అసత్యప్రచారాలు చేస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుయ్యబట్టారు. వేసవిలో తాగునీరు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నాయన్నారు. కేసీఆర్ గౌరవం నిలుపుకోవాలని సూచించారు. పంట బీమా పథకాన్ని పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. ఏవైనా లోపాలుంటే సరిచేసుకొని పాలిస్తామని అన్నారు.