India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న CM కేజ్రీవాల్‌కు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన ప్రస్తుతానికి 15రోజులు తిహార్ జైలులో ఉండనున్నారు. జైలు నుంచే ఆయన ప్రభుత్వాన్ని నడపనున్నారు. ఇలా జైలు నుంచి పాలించిన తొలి సీఎంగా నిలువనున్నారు. అయితే.. జైలు నుంచి ప్రభుత్వ పరమైన ఆర్డర్లు పాస్ చేయకుండా చూడాలని ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ఈరోజు విచారణకు రానుంది.

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌కు కోర్టు జుడీషియల్ రిమాండ్ విధించింది. ఈడీ కస్టడీ ముగియడంతో ఆయన్ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఏప్రిల్ 15వ తేదీ వరకు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో కేజ్రీవాల్‌ను తిహార్ జైలుకు తరలించనున్నారు.

గుజరాత్ టైటాన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో SRH ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పవర్ ప్లేలో 17 బంతుల్లో 16 రన్స్ చేయడమే ఈ ఓటమికి ప్రధాన కారణమంటూ సన్‌రైజర్స్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ముంబైతో హై స్కోరింగ్ మ్యాచ్‌లోనూ 13 బంతుల్లో 11 రన్స్ చేశారని గుర్తు చేసుకుంటున్నారు. మయాంక్‌ను తప్పించి వేరొకరికి అవకాశమివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇదివరకే విడుదలైన సాంగ్స్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ ఏప్రిల్ 5న విడుదల కానుండగా రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాద్ మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ దీనికి వేదిక కానున్నట్లు సమాచారం.

TG: దేశంలో నియంత పాలనకు ఇదే నిదర్శనమని మంత్రి సీతక్క ఓ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. నిన్న అద్వానీకి భారత రత్న ఇచ్చే సమయంలో ప్రధాని మోదీ ఆయన పక్కనే కూర్చొని ఉండగా.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిల్చొని ఉన్న ఫొటోను పంచుకున్నారు. ఆదివాసీ మహిళను అవమానించడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

AP: ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే పెన్షన్ల పంపిణీపై పరిమితులు విధించగా.. తాజాగా రేషన్ పంపిణీలోనూ వాలంటీర్లు పాల్గొనవద్దని ఆదేశించింది. వాలంటీర్ల స్థానంలో వీఆర్వోలు మ్యాపింగ్ చేయాలని సూచించింది. ఎండీయూ ఆపరేటర్లు కూడా వాలంటీర్లను రేషన్ పంపిణీకి పిలవకూడదని స్పష్టం చేసింది. ఇవాళ్టి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రాగా.. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది.

‘కచ్చతీవు’పై విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. ఇది ఇప్పుడు తెరపైకి వచ్చిన అంశం కాదని తెలిపారు. ‘ఈ దీవి గురించి కేంద్రం, తమిళనాడు మధ్య చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు దాని గురించి 21 సార్లు తమిళనాడుకు సమాధానం ఇచ్చాను’ అని పేర్కొన్నారు. 1947 నాటికి భారత్ అధీనంలో ఉన్న దీవిని 5 దశాబ్దాల క్రితం కాంగ్రెస్ శ్రీలంకకు కట్టబెట్టిందని ప్రధాని మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

భారత్ – శ్రీలంకను వేరుచేసే పాక్ జల సంధిలో రామేశ్వరం దీవికి సమీపంలో ఈ కచ్చతీవు ఉంది. 1.9 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ <<12964536>>దీవి<<>>లో ఎవరూ నివసించరు. ఇక్కడ సెయింట్ ఆంటోనీ చర్చిలో జరిగే వేడుకల్లో తమిళులు పాల్గొంటారు. స్వాతంత్ర్యం రాకముందు ఈ దీవి రామ్‌నాడ్ పాలకుల ఆధీనంలో ఉండేది. అనంతరం భారత్‌లో చేరింది. మత్స్యసంపద ఎక్కువగా ఉండటంతో భారత మత్స్యకారులు చేపల వేట సాగిస్తారు.

శ్రీలంక మాత్రం ఈ ఒప్పందాన్ని పట్టించుకోవడం లేదు. మత్స్యకారులను తరుచూ అదుపులోకి తీసుకుంటోంది. న్యాయపరంగా ఈ <<12964536>>దీవి<<>> అప్పగింత చెల్లదని తమిళనాడులోని పలు పార్టీలు వాదిస్తున్నాయి. భారత భూభాగాలను రాజ్యాంగ సవరణ చేయకుండా ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై ఆర్టీఐ దరఖాస్తు సేకరణతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

మరోసారి పెళ్లి చేసుకోవాలని ఉంటే ఎన్నికలలోపే చేసుకోవాలని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలకు AIUDF చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ తీవ్రంగా స్పందించారు. ‘ఆయనకు శక్తి లేక ఒక్క బిడ్డనే కన్నారు. నాకు ఏడుగురు పిల్లలు ఉన్నారు. నాకు మళ్లీ చేసుకోవాలని అనిపిస్తే నేను ముఖ్యమంత్రిని అడగను’ అని పేర్కొన్నారు. కాగా తనకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉందంటూ అజ్మల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది.
Sorry, no posts matched your criteria.