News April 1, 2024

తిహార్ జైలులో సెల్ కేటాయింపు

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌కు తిహార్ జైలులో అధికారులు సెల్ కేటాయించారు. జైలు నంబర్ 2 కాంప్లెక్స్‌లో ఆయనకు సెల్ కేటాయించగా.. అందులో కేజ్రీవాల్ ఒక్కరే ఉండనున్నారు. ఇదివరకు ఈ సెల్‌లో ఉన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను కొద్ది రోజుల క్రితం జైలు నంబర్ 5 కాంప్లెక్స్‌కి మార్చారు. ఇదే కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మహిళా ఖైదీలు ఉండే జైలు నంబర్ 6 కాంప్లెక్స్‌లో ఉంచారు.

News April 1, 2024

భోజ్‌శాల సర్వేపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు

image

మధ్యప్రదేశ్‌ ధార్ జిల్లాలోని వివాదాస్పద భోజ్‌‌శాల/కమల్ మౌలా మసీదుపై జరుగుతున్న శాస్త్రీయ సర్వేపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సర్వే ఫలితాలు వెల్లడయ్యాక తమ అనుమతి లేనిదే ఎలాంటి చర్యలు చేపట్టొద్దని ధర్మాసనం ఆదేశించింది. దీనిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం, పురావస్తు శాఖ, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కాగా ఈ ప్రదేశంలో మంగళవారం హిందువులు, శుక్రవారం ముస్లిములు ప్రార్థనలు చేస్తారు.

News April 1, 2024

ఏఐతో మానవాళి అంతానికి 20శాతం ఛాన్స్: మస్క్

image

ఏఐతో మానవాళి పూర్తిగా అంతమయ్యేందుకు 20శాతం వరకు ఛాన్స్ ఉందని టెస్లా వ్యవస్థాపకుడు మస్క్ అభిప్రాయపడ్డారు. ‘దానితో ఉన్న ఉపయోగాల దృష్ట్యా ఆమాత్రం రిస్క్ తీసుకోవడం తప్పదు. ఏఐను అభివృద్ధి చేయడమంటే పిల్లాడిని పెంచినట్లే. ఆ పెంపకం ఎలా ఉంటుందన్నదానిపై తుది ఫలితం ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ నిజమే చెప్పేలా శిక్షణనివ్వడం కీలకం. ఒకసారి అబద్ధాలు మొదలుపెడితే, దానికి అంతు ఉండదు’ అని హెచ్చరించారు.

News April 1, 2024

CSK ఓటమి.. సాక్షి పోస్ట్ వైరల్

image

నిన్నటి వైజాగ్‌ మ్యాచులో CSK ఓటమిపై ధోనీ భార్య సాక్షి సింగ్ ఆసక్తికర పోస్ట్ చేశారు. విజయాల ఖాతా తెరిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్‌‌ను ప్రశంసించారు. మరోవైపు పరోక్షంగా ధోనీ ఇన్నింగ్స్‌ను కొనియాడుతూనే.. CSK మ్యాచ్ ఓడిపోయిందని గుర్తించలేదని టీజ్ చేశారు. నిన్నటి మ్యాచులో ధోనీ ఆఖర్లో వచ్చి 37 పరుగులు చేశారు.

News April 1, 2024

బలవంతంగా మోసం చేస్తున్నారు!

image

సుమారు 5000మంది భారతీయులు కంబోడియాలోని సైబర్ నేరగాళ్ల చేతుల్లో చిక్కుకుపోయారు. నేరస్థులు బలవంతంగా వారితో ఇండియాలోని పౌరులను ఆన్‌లైన్ ద్వారా మోసం చేయిస్తున్నారు. గత 6నెలల్లో రూ.500కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఇక్కడి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రూ.67లక్షలు నష్టపోవడంతో స్కామ్ వెలుగు చూసింది. స్పందించిన కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం దాదాపు 250 మంది భారతీయులను స్వదేశానికి పంపించింది.

News April 1, 2024

ఒక్క మ్యాచుతో ధోనీ సరికొత్త రికార్డులు

image

నిన్న ఢిల్లీతో మ్యాచులో సీఎస్కే మాజీ కెప్టెన్ ధోనీ ఖాతాలో పలు రికార్డులు చేరాయి. ఐపీఎల్ ఒకే ఓవర్లో 20 అంతకన్నా ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో మొదటి స్థానంలో నిలిచారు. ధోనీ 9 సార్లు ఈ ఫీట్ అందుకోగా.. ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ(8) ఉన్నారు. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో 19, 20వ ఓవర్లలో 100 సిక్సర్లు బాదిన తొలి ప్లేయర్‌గా ధోనీ రికార్డులకెక్కారు.

News April 1, 2024

పెన్షన్లను అడ్డుకున్న చంద్రబాబును దేవుడు క్షమించడు: బొత్స

image

AP: నిమ్మగడ్డ రమేశ్‌ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు వాలంటీర్లపై కుట్ర చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వడాన్ని అడ్డుకుని ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారని ఫైరయ్యారు. ఇన్ని నెలలు పెన్షన్లు పంపిణీ చేస్తే రాని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు. ‘వికలాంగులు, పెన్షనర్లకు ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబును దేవుడు కూడా క్షమించడు’ అని మండిపడ్డారు.

News April 1, 2024

పెట్రోల్, డీజిల్ వాహనాలను నిర్మూలిస్తాను: గడ్కరీ

image

దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాలను నిర్మూలిస్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఇది కష్టమే కానీ అసాధ్యం కాదన్నారు. మరోవైపు హైబ్రీడ్ వాహనాలపై ఉన్న GSTని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ‘ప్రస్తుతం భారత్ ఇంధన దిగుమతులకు రూ.16లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధిస్తే ఆ డబ్బును రైతులు, గ్రామాలు, ఉపాధి మొదలైన అంశాలకు ఉపయోగించొచ్చు’ అని పేర్కొన్నారు.

News April 1, 2024

కడియం శ్రీహరి, కావ్యకు డిపాజిట్ రాకుండా చేస్తాం: పల్లా

image

TG: కాంగ్రెస్‌లో చేరిన MLA కడియం శ్రీహరి, కావ్య ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ రాకుండా చేస్తామని BRS MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కడియం హస్తం గూటికి చేరే కుట్రకు అసెంబ్లీ సమావేశాల్లోనే బీజం పడిందన్నారు. అందుకే ముందుగా BRSలోని నాయకులను వేధించి, వెళ్లగొట్టి కూతురుకు టికెట్ ఇప్పించుకున్నారని మండిపడ్డారు. NTR, CBN, KCRకు వెన్నుపోటు పొడిచిన పెద్ద మోసగాడు కడియం అని ఫైరయ్యారు.

News April 1, 2024

బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరీ బవేజా ముందు వాదనలు కొనసాగుతున్నాయి. కవిత తరఫున న్యాయవాది నితీశ్ రానా, ఈడీ తరఫున జోహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు.