News March 28, 2024

Ghost Jobs‌ ఏంటి? ఎప్పుడైనా అప్లై చేశారా?

image

వినేందుకు వింతగా ఉన్న ఈ ఘోస్ట్ జాబ్స్ ఇటీవల ఎక్కువయ్యాయి. ఘోస్ట్ జాబ్స్ అంటే కంపెనీలు ఉద్యోగ ప్రకటనలు ఇచ్చినా నియమించుకునే ఉద్దేశం ఉండకపోవడం. కంపెనీ వెబ్‌సైట్లో ఖాళీలున్నట్లు చూపించినా బడ్జెట్, ఇతర కారణాలతో రిక్రూట్ చేసుకోదు. జాబ్ ప్రకటించిన డేట్ చెక్ చేయడం, కంపెనీ గురించి క్రాస్ చెక్, ఆ ఉద్యోగులను సోషల్ మీడియాలో కలవడం, నేరుగా కంపెనీకి వెళ్లడం వంటి స్టెప్స్ తీసుకుంటే వీటి నుంచి తప్పించుకోవచ్చు.

News March 28, 2024

కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే: జగన్

image

AP: మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే అని, జీసస్ జీవితమే మానవాళికి గొప్ప సందేశమని సీఎం జగన్ అన్నారు. రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన ఏసుప్రభు త్యాగాన్ని కీర్తించారు. ‘మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవన్నీ తన జీవితం, బోధనల ద్వారా జీసస్ లోకానికి ఇచ్చిన సందేశాలు’ అని జగన్ తెలిపారు.

News March 28, 2024

ఇతడు ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కు ఆదర్శం

image

చాలామంది ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగం రాకపోతే డిప్రెషన్‌లోకి వెళతారు. అలాంటి వారికి గోవాకు చెందిన లిండన్ కార్డొసో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంజినీరింగ్ చదివిన లిండన్ 2013లో హాస్టల్‌లో వాటర్ హీటర్ వేస్తుండగా కరెంట్ షాక్‌ తగిలి చేతులు కోల్పోయారు. 3నెలలు ఆసుపత్రి బెడ్‌పైనే ఉన్నారు. కట్ చేస్తే.. ఇటీవల GSPC ఎగ్జామ్ క్లియర్ చేసి డైరెక్టరేట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్‌లో డి.డైరెక్టర్‌గా అయ్యారు.

News March 28, 2024

ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన స్టార్ హీరోయిన్

image

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా తల్లి కాబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్, ప్రమోషన్లలో ఆమె వదులు దుస్తులు ధరించడంతో అలాంటి వార్తలు వైరల్ అయ్యాయి. వీటిపై పరిణీతి స్పందించారు. ‘ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లా? నేను వేసుకునే డ్రెస్సును చూసి అలా భావిస్తారా?’ అని ఆమె ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. కాగా గతేడాది ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పరిణీతి వివాహమాడిన సంగతి తెలిసిందే.

News March 28, 2024

బస్సు, ట్రైన్‌లో జంతువులను తీసుకెళ్లొచ్చా?

image

RTC బస్సులో చిలుకలకు టికెట్లు ఇవ్వడం చర్చనీయాంశమైంది. అయితే బస్సుల్లో కోళ్లు, మేకలు వంటి జంతువులకు అనుమతి లేదని RTC MD సజ్జనార్ తెలిపారు. రైళ్లలో మాత్రం పెంపుడు జంతువులను తీసుకెళ్లవచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఫస్ట్ క్లాస్ AC టికెట్ బుక్ చేసుకోవాలి. ట్రైన్ ఎక్కే స్టేషన్ CROకు దరఖాస్తు ఇవ్వాలి. పెట్స్‌కు టీకాలు వేయించిన సర్టిఫికెట్, వాటి హెల్త్‌పై డాక్టర్ సర్టిఫికెట్ అవసరం.

News March 28, 2024

రెండుగా చీలిపోయిన ముంబై ఇండియన్స్?

image

ముంబై ఇండియన్స్ జట్టులో అనిశ్చితి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ జట్టు 2 వర్గాలుగా చీలిపోయినట్లు సమాచారం. కెప్టెన్ హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్ ఓ వైపు.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ మరోవైపు ఉన్నట్లు టాక్. కానీ హార్దిక్ వర్గానికి ఫ్రాంచైజీ యాజమాన్యం మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. వరుస ఓటములతో డీలా పడ్డ ముంబై జట్టులో ఇలాంటి వాతావరణం కనిపించడం ఫ్యాన్స్‌ను కలవరపరుస్తోంది.

News March 28, 2024

IPL: ఒకే ఓవర్‌లో 4,4,6,4,6,1

image

ఢిల్లీతో మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ 185/5 రన్స్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన RR 36 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది. రియాన్ పరాగ్ ఆ జట్టును ఆదుకున్నారు. 45 బంతుల్లో 84 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచారు. అతడి ఇన్నింగ్సులో 6 సిక్సర్లు, 7 ఫోర్లున్నాయి. 20వ ఓవర్‌లో పరాగ్ ఏకంగా 25(4,4,6,4,6,1) రన్స్ రాబట్టారు. అశ్విన్ 29, జురెల్ 20 రన్స్ చేశారు.

News March 28, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొకరు అరెస్ట్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు ప్రణీత్ రావుతో కలిసి హవాలా వ్యాపారులను బెదిరించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. రేపు ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా ప్రణీత్ అరెస్ట్ కాగానే రాధాకిషన్‌ అమెరికా వెళ్లిపోయారు. దీంతో పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేయడంతో ఆయన్ను హైదరాబాద్ తిరిగి పంపారు.

News March 28, 2024

రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. కీలక నిందితుడు అరెస్ట్

image

బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడిని NIA అరెస్ట్ చేసింది. ముజమిల్ షరీఫ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అతడి నుంచి నగదు, పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. మరో ఇద్దరు నిందితులు సాజిబ్, అబ్దుల్ కోసం NIA తీవ్రంగా గాలిస్తోంది. కాగా మార్చి 1న రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో నలుగురు గాయపడ్డారు.

News March 28, 2024

జగన్ ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదు: చంద్రబాబు

image

AP: సీఎం జగన్ రాష్ట్రంలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘రాయలసీమ కోసం వైసీపీ చేసిందేమీ లేదు. 142 ప్రాజెక్టులను రద్దు చేశారు. టీడీపీ హయాంలో రాయలసీమలో సాగు నీటి కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేశాం. కానీ జగన్ మాత్రం రూ.2 వేల కోట్లే ఖర్చు చేశారు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని కాపాడడానికే టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయి’ అని ఆయన పేర్కొన్నారు.