News May 21, 2024

ఆ లోపు కొత్త పాలసీలు సిద్ధం చేయండి: రేవంత్

image

TG: ఎలక్షన్ కోడ్ ముగిసేలోగా పారిశ్రామికాభివృద్ధికి కొత్త పాలసీలను సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. TSIICపై సీఎం సమీక్ష నిర్వహించారు. MSME, ఎగుమతులు, లైఫ్ సైన్సెస్, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ, EV పాలసీలకు సవరణ చేస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. పలు రంగాలకు సంబంధించి 6 కొత్త పాలసీలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రపంచ దేశాల్లోని అత్యుత్తమ పాలసీలను అధ్యయనం చేయాలని CM సూచించారు.

Similar News

News January 11, 2025

భాగ్యనగరం బోసి‘పోతోంది’!

image

పండగకు నగరవాసులందరూ ఇరు తెలుగు రాష్ట్రాల్లోని తమ స్వగ్రామాలకు వెళ్లిపోతుండటంతో భాగ్యనగరం బోసిపోయింది. జనంతో కళకళలాడే రోడ్లు విదేశాల్లో రోడ్లలా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈరోజు, రేపు కూడా గడిస్తే పండుగకు వెళ్లేవారంతా వెళ్లిపోగా, హైదరాబాద్ రహదారులు మరింత నిర్మానుష్యంగా మారొచ్చని అంచనా. ప్రశాంతంగా ఉందని కొంతమంది అంటుంటే.. జనం లేక బోరింగ్‌గా కనిపిస్తోందని మరికొంతమంది పేర్కొంటున్నారు. మీ కామెంట్?

News January 11, 2025

భక్తుల మృతికి సీఎం బాధ్యుడు కాదా పవన్?: అంబటి

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ‘కలవని కల్తీ లడ్డుకు అప్పటి ముఖ్యమంత్రి బాధ్యుడా? ఆరుగురు భక్తుల మృతికి ఇప్పటి సీఎం బాధ్యుడు కాదా పవన్ కళ్యాణ్?’ అని Xలో ప్రశ్నించారు. ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అంబటి తాజాగా ఆరోపించిన విషయం తెలిసిందే.

News January 11, 2025

మరో పేషెంట్‌లో న్యూరాలింక్ చిప్ అమరిక విజయవంతం

image

ఎలాన్ మస్క్ సంస్థ న్యూరాలింక్ తయారుచేసిన చిప్‌ను మరో రోగి మెదడులో వైద్యులు విజయవంతంగా అమర్చగలిగారు. మస్క్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘ఇప్పటి వరకూ ముగ్గురిలో చిప్‌ను విజయవంతంగా అమర్చాం. అందరిలోనూ చిప్స్ బాగా పనిచేస్తున్నాయి’ అని పేర్కొన్నారు. శరీరంపై నియంత్రణ కోల్పోయిన వారి మెదడులో చిప్ అమర్చి, దాని సాయంతో వారు ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించగలిగేలా న్యూరాలింక్ చిప్ పనిచేస్తుంది.