News August 16, 2024

ఎన్నిక‌ల‌కు సిద్ధం: ఒమ‌ర్ అబ్దుల్లా

image

జ‌మ్మూక‌శ్మీర్ ఎన్నిక‌ల‌కు నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ సిద్ధంగా ఉందని మాజీ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా తెలిపారు. 1987-88 తరువాత విడతల వారీగా ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటిసారి అన్నారు. ఎన్నిక‌లు పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హిస్తామ‌ని చెబుతున్న EC, గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న అధికారుల‌ బ‌దిలీల‌పై ద‌ర్యాప్తు చేయాలన్నారు. BJPకి లాభం చేకూర్చేలా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా బ‌దిలీలు జ‌రుగుతున్నాయని ఒమర్ ఆరోపించారు.

Similar News

News January 21, 2025

నిధులు మంజూరు చేయించండి.. కిషన్ రెడ్డికి భట్టి వినతి!

image

TG: రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ₹1.63 లక్షల కోట్లు ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. కోణార్క్‌లో ‘గనులు, ఖనిజాల శాఖల మంత్రుల’ సమావేశం సందర్భంగా ఆయనను కలిశారు. ORR-RRR రోడ్లకు ₹45,000cr, మెట్రో విస్తరణకు ₹24,269cr, మూసీ పునరుజ్జీవ పనులకు, సీవరేజ్ మాస్టర్ ప్లాన్ తదితర ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయించాలని వినతిపత్రం ఇచ్చారు.

News January 21, 2025

DOGE నుంచి వివేక్ రామస్వామి ఔట్

image

ట్రంప్ కొత్తగా ఏర్పాటు చేసిన DOGE నుంచి ఇండియన్ అమెరికన్ వివేక్ రామస్వామి తప్పుకున్నారు. ఈ శాఖ సృష్టికి సాయపడటం తనకు దక్కిన గౌరవమని, మస్క్ టీమ్ దానిని సమర్థంగా నిర్వహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒహైయో స్టేట్ గవర్నర్ పదవికి పోటీచేయడంపై ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ఏదేమైనా ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’కు సాయపడతానన్నారు. H1B అంశంలో నల్లవారితో పోలిస్తే తెల్లవారు లేజీ అనడం ఆయనకు పొగపెట్టినట్టు సమాచారం.

News January 21, 2025

యథావిధిగా కొనసాగనున్న ఆరోగ్య సేవలు

image

TG: నెట్ వర్క్ ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయడంతో మంత్రి రాజనర్సింహా ఆస్పత్రుల ప్రతినిధులతో చర్చలు జరిపారు. గత ఏడాది కాలంలో రూ.1,137కోట్లు చెల్లించామని, మరో 6 నెలల్లో బకాయిలన్నీ క్లియర్ చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇతర సమస్యలపైనా కమిటీ ఏర్పాటు చేసి, సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. దీంతో ఆరోగ్య శ్రీ సేవలను యథావిధిగా కొనసాగిస్తామని నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది.