News October 30, 2024
ఇక్కడ వృద్ధులకు తోలుబొమ్మలే తోడు
చదువు, ఉపాధి కోసం యువత గ్రామాలను వదిలి పట్టణాలకు వెళ్లడం కామన్. ఆ ఇళ్లలో పిల్లలు లేని లోటు తీర్చలేనిది. అందుకు జపాన్ అతీతం కాదు. అయితే అక్కడి ఇచినోనో గ్రామంలో ఇళ్లు విడిచి వెళ్లిన వారి లోటు తెలియనీయకుండా వృద్ధులకు తోలుబొమ్మలు తోడుగా ఉంటున్నాయి. ఆ వృద్ధులు వారి పిల్లల పోలికలతో బొమ్మలను తయారు చేసుకుంటున్నారు. అటు జపాన్ యువతలేమి, వృద్ధాప్య సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
Similar News
News November 18, 2024
గ్రీవెన్స్ డేలో ఆధార్ తప్పనిసరి
AP: ప్రతి సోమవారం ఎస్పీ ఆఫీసుల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే)లో ఫిర్యాదు చేసేవారికి అధికారులు కీలక సూచన చేశారు. తమ వెంట తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని తెలిపారు. ఫిర్యాదు పత్రానికి ఆధార్ ప్రతిని జత చేయాలని, ఇది ఈరోజు నుంచే అమల్లోకి రానున్నట్లు చెప్పారు. అయితే ఈ నిబంధన కలెక్టర్ కార్యాలయాల్లో వర్తిస్తుందా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు.
News November 18, 2024
సర్వేలో అప్పులు తప్ప ఆస్తులు చెప్పట్లేదు!
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో ప్రజలు పూర్తి వివరాలు చెప్పేందుకు భయపడుతున్నారు. కులం, కుటుంబ వివరాలు, అప్పులు, చదువుల వివరాలు మాత్రమే వెల్లడిస్తున్నారు. ఆస్తులు, పథకాల లబ్ధి, ఇతర వివరాలు చెప్పేందుకు జంకుతున్నారు. వస్తున్న స్కీమ్స్ పోతాయన్న భయం, రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు తొలగిస్తారన్న అనుమానంతో ఈ వివరాలు కరెక్టుగా చెప్పడం లేదు. కొందరైతే ఆధార్ నంబర్లు ఇచ్చేందుకూ ఆలోచిస్తున్నారు.
News November 18, 2024
నేడు హైదరాబాద్‌లో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్
నేడు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో భారత్, మలేషియా జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది 10 మ్యాచుల్లో ఒక్క విజయం సాధించని భారత్ బోణీ కొట్టాలని చూస్తోంది. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. జియో సినిమా, స్పోర్ట్స్ 18 3 టీవీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ 125, మలేషియా 133వ స్థానాల్లో ఉన్నాయి.