News May 16, 2024
SRH ప్లే ఆఫ్స్ చేరదు: హర్భజన్
ఈ సారి SRH ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు లేవని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘తదుపరి 2 మ్యాచ్‌లలో SRH ఓడిపోవచ్చు. ఐపీఎల్‌లో ఏదైనా జరగొచ్చు. కేకేఆర్, రాజస్థాన్, సీఎస్కే, ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు వెళ్లొచ్చు’ అని ఆయన చెప్పారు. కాగా హర్భజన్ వ్యాఖ్యలపై SRH ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అపశకునపు మాటలు మాట్లాడుతున్నారంటూ భగ్గుమంటున్నారు. కమిన్స్ బృందాన్ని తక్కువ అంచనా వేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.
Similar News
News January 11, 2025
భాగ్యనగరం బోసి‘పోతోంది’!
పండగకు నగరవాసులందరూ ఇరు తెలుగు రాష్ట్రాల్లోని తమ స్వగ్రామాలకు వెళ్లిపోతుండటంతో భాగ్యనగరం బోసిపోయింది. జనంతో కళకళలాడే రోడ్లు విదేశాల్లో రోడ్లలా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈరోజు, రేపు కూడా గడిస్తే పండుగకు వెళ్లేవారంతా వెళ్లిపోగా, హైదరాబాద్ రహదారులు మరింత నిర్మానుష్యంగా మారొచ్చని అంచనా. ప్రశాంతంగా ఉందని కొంతమంది అంటుంటే.. జనం లేక బోరింగ్‌గా కనిపిస్తోందని మరికొంతమంది పేర్కొంటున్నారు. మీ కామెంట్?
News January 11, 2025
భక్తుల మృతికి సీఎం బాధ్యుడు కాదా పవన్?: అంబటి
AP: తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ‘కలవని కల్తీ లడ్డుకు అప్పటి ముఖ్యమంత్రి బాధ్యుడా? ఆరుగురు భక్తుల మృతికి ఇప్పటి సీఎం బాధ్యుడు కాదా పవన్ కళ్యాణ్?’ అని Xలో ప్రశ్నించారు. ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అంబటి తాజాగా ఆరోపించిన విషయం తెలిసిందే.
News January 11, 2025
మరో పేషెంట్‌లో న్యూరాలింక్ చిప్ అమరిక విజయవంతం
ఎలాన్ మస్క్ సంస్థ న్యూరాలింక్ తయారుచేసిన చిప్‌ను మరో రోగి మెదడులో వైద్యులు విజయవంతంగా అమర్చగలిగారు. మస్క్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘ఇప్పటి వరకూ ముగ్గురిలో చిప్‌ను విజయవంతంగా అమర్చాం. అందరిలోనూ చిప్స్ బాగా పనిచేస్తున్నాయి’ అని పేర్కొన్నారు. శరీరంపై నియంత్రణ కోల్పోయిన వారి మెదడులో చిప్ అమర్చి, దాని సాయంతో వారు ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించగలిగేలా న్యూరాలింక్ చిప్ పనిచేస్తుంది.