News March 4, 2025
యువత ఆకాంక్షలు నెరవేర్చాలి: మంత్రి లోకేశ్

AP: పట్టభద్రుల MLC ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర, పేరాబత్తుల రాజశేఖర్ మంగళగిరిలోని TDP ఆఫీసులో మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. వారికి అభినందనలు తెలిపిన మంత్రి మాట్లాడారు. ‘ఈ విజయంతో మనపై మరింత బాధ్యత పెరిగింది. యువత మనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చే దిశగా చిత్తశుద్ధితో పని చేయాలి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని లోకేశ్ అన్నారు.
Similar News
News March 4, 2025
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు గతంలోనే చెప్పిన కల్పన

ప్రముఖ సింగర్ <<15653135>>కల్పన<<>> ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. అయితే ఆమె గతంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పారు. ‘2010లో భర్తతో విడిపోవడంతో కుంగిపోయాను. పిల్లల్ని చదివించాలి. చేతిలో అవకాశాలు లేవు. సూసైడ్ చేసుకోవాలనుకున్నా. ఆ సమయంలో చిత్రమ్మ ధైర్యం చెప్పి, నన్ను ఆ ఆలోచన నుంచి బయటపడేశారు’ అని అప్పట్లో కల్పన చెప్పుకొచ్చారు.
News March 4, 2025
ప్చ్.. కోహ్లీ సెంచరీ మిస్

ఛాంపియన్స్ ట్రోఫీ: సెమీఫైనల్లో కచ్చితంగా సెంచరీ చేస్తాడనుకున్న విరాట్ కోహ్లీ కాస్త దూరంలో ఆగిపోయారు. 84 పరుగుల వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 43 ఓవర్లలో 226/5గా ఉంది. భారత్ విజయానికి 42 బంతుల్లో 39 రన్స్ అవసరం. క్రీజులో కేఎల్ రాహుల్ (31*), హార్దిక్ పాండ్య (1*) క్రీజులో ఉన్నారు.
News March 4, 2025
Japan Train: సెకన్ లేటుగా వచ్చినా ఊరుకోరు!

ఇండియాలో చాలా రైళ్లు రోజూ గంటల కొద్దీ ఆలస్యంగానే నడుస్తుంటాయి. అయితే జపాన్ రైల్వే దీనికి పూర్తి వ్యతిరేకం. అక్కడి రైళ్లు స్టేషన్‌కు చేరుకునే సమయంలో సెకండ్లను కూడా ఉంచుతారు. సమయపాలన కోసం టెక్నాలజీని వాడుతున్నారు. ఆటోమెటిక్ ట్రైన్ కంట్రోల్ సాంకేతికత రైలు వేగాన్ని నియంత్రిస్తుంది. షెడ్యూల్ ప్రకారం నడిచేలా సహాయపడుతుంది. ఓసారి 35 సెకండ్లు లేటుగా వచ్చినందుకు రైల్వే అధికారులు క్షమాపణలు కూడా చెప్పారట.