News November 28, 2024
ఉనద్కత్.. IPL వేలంలో 13వసారి..
IPL-2025 వేలంపాటలో భారత సీనియర్ క్రికెటర్ జయ్‌దేవ్ ఉనద్కత్ రికార్డు సృష్టించారు. ఆయనను సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ.1కోటికి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే వేలంలో ఎక్కువసార్లు అమ్ముడైన ఏకైక క్రికెటర్‌గా ఆయన అవతరించారు. ఆయనకు ఇది 13వ IPL వేలం. ఏడుసార్లకు మించి ఎవరూ అమ్ముడవలేదు. కాగా ఉనద్కత్ తన IPL కెరీర్‌లో 8 జట్లకు ఆడారు. KKR, DD, RPS, RR, MI, LSG, RCBకి ఆడారు.
Similar News
News November 28, 2024
ఆస్ట్రేలియాలో పుష్ప-2 ఆల్ టైమ్ రికార్డ్!
విడుదలకు ముందే పుష్ప-2 పలు రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. ఆస్ట్రేలియాలో ఆ సినిమా హిందీ వెర్షన్ బాలీవుడ్ సినిమాల్ని కూడా తలదన్నింది. హిందీ సినిమాల ముందస్తు టికెట్ అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిందని ఆస్ట్రేలియన్ తెలుగు ఫిల్మ్స్ ట్వీట్ చేయగా, పుష్ప మూవీ టీమ్ దాన్ని రీట్వీట్ చేసింది. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో ‘పుష్ప’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా వచ్చే నెల 5న రిలీజ్ కానుంది.
News November 28, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: నవంబర్ 28, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 5:12 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:28 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12:04 గంటలకు
అసర్: సాయంత్రం 4:04 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:40 గంటలకు
ఇష: రాత్రి 6.56 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 28, 2024
బీఆర్ఎస్ హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు: సీతక్క
TG: దిలావర్‌పూర్ ఇథనాల్ పరిశ్రమకు బీఆర్ఎస్ హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయని మంత్రి సీతక్క అన్నారు. కావాలనే తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇథనాల్ ఫ్యాక్టరీ డైరెక్టర్లుగా తలసాని సాయికిరణ్, మరో వ్యక్తి ఉన్నారన్నారు. తలసాని సాయికిరణ్ ఎవరో చెప్పాలన్నారు. కిరాయి మనుషులతో సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.