News January 21, 2025

మహాకుంభమేళా కోసం ఓ IAS ఏం చేశారంటే?

image

ఓ సివిల్ సర్వెంట్ తలుచుకుంటే ఏం చేయగలరో IAS చంద్రమోహన్ గర్గ్ నిరూపించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న ఈయన మహాకుంభమేళా నేపథ్యంలో డంప్ యార్డును అడవిలా మార్చేశారు. దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని రెండేళ్లలో యార్డులోని వ్యర్థాలను తొలగించి మియావాకీ పద్ధతిలో 1.2 లక్షల మొక్కలను నాటారు. దీంతో దుమ్ము, దూళిని పోగొట్టి గాలి నాణ్యతను పెంచిన ఈ IASను అభినందించాల్సిందే.

Similar News

News January 21, 2025

గ్రూప్-1 మెయిన్స్ డేట్స్ ఖరారు

image

AP: గ్రూప్-1 షెడ్యూల్‌ను APPSC ఖరారు చేసింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. ఈ ఏడాది మే 3న తెలుగు, 4న ఇంగ్లిష్, 5న పేపర్1 జనరల్ ఎస్సే, 6న పేపర్2 హిస్టరీ, కల్చరల్, 7న పేపర్3 పాలిటీ, లా, 8న పేపర్4 ఎకానమీ, 9న పేపర్5 సైన్స్, టెక్నాలజీ ఎగ్జామ్స్ జరుగుతాయని వివరించింది. పరీక్షలన్నీ ఉ.10 గం. నుంచి మ.1 గంట వరకు జరుగుతాయని పేర్కొంది.

News January 21, 2025

సాగర్ డ్యామ్ నిర్వహణ ఏపీకి ఇవ్వం: తెలంగాణ

image

నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణ ఏపీకి ఇవ్వమని తెలంగాణ నీటిపారుదలశాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జా KRMB సమావేశంలో స్పష్టం చేశారు. సాగర్ పర్యవేక్షణ నుంచి CRPF బలగాలు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. నదీ జలాల వాటా పెంచాలని కోరారు. 79-21 వాటాల ప్రకారం నీటిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అప్పటివరకు 50-50 పద్ధతిలో నీటిని విడుదల చేయాలని పేర్కొన్నారు. నదీ జలాల మళ్లింపు విషయంలో కలగజేసుకోవాలని బోర్డును కోరారు.

News January 21, 2025

నుమాయిష్‌లో ఉచిత పార్కింగ్ ఇవ్వాలి: రాజాసింగ్

image

HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏటా నిర్వహిస్తున్న నుమాయిష్‌ను నగర శివార్లకు తరలించాలని CM రేవంత్ రెడ్డిని BJP MLA రాజాసింగ్ కోరారు. నగరం మధ్యలో జరుగుతున్న ఎగ్జిబిషన్‌కు వేలాదిగా ప్రజలు తరలిరావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోందని, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. మరోవైపు పార్కింగ్ పేరుతో దోచుకుంటున్నారని, ప్రభుత్వ స్థలంలో జరుగుతున్న ఎగ్జిబిషన్‌కు ఉచితంగా పార్కింగ్ కల్పించాలని కోరారు.