News November 14, 2024
స్పెషల్ ఫుడ్ కోసం పాండా ఏం చేసిందంటే?
ప్రత్యేక ఆహారంతో పాటు పరిరక్షణ, వసతి కోసం చైనాలోని ఆరేళ్ల జెయింట్ పాండా తాను గర్భం దాల్చినట్లు జూకీపర్లను నమ్మించింది. జూలో గర్భం దాల్చిన పాండాలకు 24 గంటల పాటు ప్రత్యేక చికిత్స లభిస్తుంది. అయితే, 2 నెలల పరిశీలన తర్వాత అది సాధారణ స్థితికి చేరుకుందని వైద్యులు తెలిపారు. కొన్ని తెలివైన పాండాలు ఇలా నటిస్తాయని అభిప్రాయపడ్డారు. హార్మోన్లలో మార్పుల వల్ల కూడా ఒక్కోసారి ఇలా జరగొచ్చని పేర్కొన్నారు.
Similar News
News November 15, 2024
ట్రాఫిక్ విధుల్లో ట్రాన్స్జెండర్లు: CM రేవంత్
TG: హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లను నియమించడంపై దృష్టి సారించాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. తొలిదశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారి సేవలు వినియోగించాలని సూచించారు. హోమ్ గార్డుల తరహాలో ట్రాన్స్జెండర్లను నియమించాలని చెప్పారు. డ్రంక్&డ్రైవ్ కోసం వారి సేవలను ఉపయోగించుకోవాలన్నారు. వీలైనంత త్వరగా దీన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అదేశించారు.
News November 15, 2024
తెలుగు టైటాన్స్ ఓటమి
ప్రోకబడ్డీ లీగ్ సీజన్-11లో భాగంగా UP యోధాస్తో మ్యాచ్లో తెలుగు టైటాన్స్ ఓడింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి తెలుగు టైటాన్స్ 20-16తో ఆధిక్యం కనబర్చింది. అయితే ఆ తర్వాత UP ఆటగాళ్లు పుంజుకున్నారు. చివరికి UP 40 పాయింట్లు సాధించగా టైటాన్స్ 34 పాయింట్లకే పరిమితమైంది. మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్(32)పై U ముంబా(35) గెలిచింది. పాయింట్స్ టేబుల్లో టాప్లో హరియాణా ఉండగా టైటాన్స్ 6వ స్థానంలో ఉంది.
News November 15, 2024
ఈ నెల 19న ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన
TG: ‘ఇందిరా మహిళా శక్తి’ భవనాలకు సీఎం రేవంత్ వరంగల్ వేదికగా ఈ నెల 19న శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ భవనాలు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాపాలన-విజయోత్సవాల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో సీఎం పాల్గొన్నారు.