News August 22, 2024
WORLD RECORD: 90 నిమిషాల్లో 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు
ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్‌కు 90 నిమిషాల్లోనే 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు వచ్చారు. దీంతో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఛానల్‌గా వరల్డ్ రికార్డు సాధించింది. 24గంటల్లోపే 12M సబ్‌స్క్రైబర్లు వచ్చారు. ఇదీ ఓ రికార్డే. ఫుట్‌బాల్, ఫ్యామిలీ, న్యూట్రీషన్, ఎడ్యుకేషన్, బిజినెస్ విషయాలను పంచుకుంటానని ఆయన తెలిపారు. రొనాల్డోకు Xలో 112M, FBలో 170M, ఇన్‌స్టాలో 636M ఫాలోవర్లు ఉన్నారు.
Similar News
News January 24, 2025
కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫ్రీగా మ్యాచ్ చూడొచ్చు
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దాదాపు 13 ఏళ్ల తర్వాత రంజీల్లో ఆడనున్నారు. ఈ నెల 30న రైల్వేస్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఆయన బరిలోకి దిగుతారు. ఈ క్రమంలో ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ జరిగే అరుణ్ జైట్లీ స్టేడియంలోకి ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది. కాగా విరాట్ చివరిసారి 2012లో రంజీ మ్యాచ్‌లో ఆడారు.
News January 24, 2025
సైఫ్‌పై కత్తిదాడి: నిందితుడిని కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు
యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై కత్తిదాడి కేసులో నిందితుడు షరీఫుల్ ఇస్లామ్‌ను పోలీసులు బాంద్రా కోర్టుకు తీసుకెళ్లారు. నేటితో ముగుస్తున్న అతడి కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించాల్సిందిగా వారు మెజిస్ట్రేట్‌ను కోరే అవకాశముంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో అంతుచిక్కని ప్రశ్నలు, అనుమానాలు ఎన్నో ఉన్నాయి. కోర్టు విచారణపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 24, 2025
తండ్రి రికార్డును బద్దలుకొట్టాడు
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు రాకీ ఫ్లింటాఫ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఇంగ్లండ్ లయన్స్ జట్టు తరఫున అతిపిన్న వయసు(16 ఏళ్ల 291 రోజులు)లో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచారు. గతంలో ఈ రికార్డ్ అతడి తండ్రి ఆండ్రూ(20 ఏళ్ల 18 రోజులు) పేరిట ఉండేది. ఆండ్రూ 1998లో కెన్యాపై సెంచరీ చేయగా 26 ఏళ్ల తర్వాత రాకీ క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్‌పై ఈ రికార్డ్ సాధించారు.