News March 4, 2025
ఆదోనికి పోసాని కృష్ణమురళి

AP: గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళిని ఆదోని PSకు తరలిస్తున్నారు. అక్కడ ఆయనపై కేసు నమోదైన నేపథ్యంలో పీటీ వారెంట్ దాఖలు చేసి తీసుకెళ్తున్నారు. మరోవైపు, నరసరావుపేట కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ వేయగా దానిపై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. రాజంపేట జైలులో ఉన్న ఆయన్ను నిన్న పోలీసులు పీటీ వారంట్‌పై నరసరావుపేట తీసుకురాగా, జడ్జి 10 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
Similar News
News March 4, 2025
ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

✷ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ✷ సమిష్టి కృషితోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసాం: కలెక్టర్ సెల్వి ✷ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో లైన్మెన్ దినోత్సవ సందర్భంగా 14 మంది లైన్మెన్ లకు సత్కారం ✷ పోలవరం R&R భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి: బాలరాజు
News March 4, 2025
ప్చ్.. కోహ్లీ సెంచరీ మిస్

ఛాంపియన్స్ ట్రోఫీ: సెమీఫైనల్లో కచ్చితంగా సెంచరీ చేస్తాడనుకున్న విరాట్ కోహ్లీ కాస్త దూరంలో ఆగిపోయారు. 84 పరుగుల వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 43 ఓవర్లలో 226/5గా ఉంది. భారత్ విజయానికి 42 బంతుల్లో 39 రన్స్ అవసరం. క్రీజులో కేఎల్ రాహుల్ (31*), హార్దిక్ పాండ్య (1*) క్రీజులో ఉన్నారు.
News March 4, 2025
Japan Train: సెకన్ లేటుగా వచ్చినా ఊరుకోరు!

ఇండియాలో చాలా రైళ్లు రోజూ గంటల కొద్దీ ఆలస్యంగానే నడుస్తుంటాయి. అయితే జపాన్ రైల్వే దీనికి పూర్తి వ్యతిరేకం. అక్కడి రైళ్లు స్టేషన్‌కు చేరుకునే సమయంలో సెకండ్లను కూడా ఉంచుతారు. సమయపాలన కోసం టెక్నాలజీని వాడుతున్నారు. ఆటోమెటిక్ ట్రైన్ కంట్రోల్ సాంకేతికత రైలు వేగాన్ని నియంత్రిస్తుంది. షెడ్యూల్ ప్రకారం నడిచేలా సహాయపడుతుంది. ఓసారి 35 సెకండ్లు లేటుగా వచ్చినందుకు రైల్వే అధికారులు క్షమాపణలు కూడా చెప్పారట.