India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఖమ్మం కాంగ్రెస్ MP అభ్యర్థిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సీటును కాంగ్రెస్ నేత రామసహాయం రఘురాంరెడ్డికి కేటాయించినట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు టాక్. ఇప్పటికే ఆయన 2 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాగా హీరో వెంకటేశ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి రఘురాంరెడ్డి వియ్యంకుడు. వీరిద్దరి కూతుళ్లను రఘురాం కుమారులు వివాహం చేసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ మారింది. ఇప్పటి వరకు ‘అబ్ కీ బార్ 400 పార్’ అన్న నినాదంతో ఎన్డీఏ నేతలు ప్రచారం చేశారు. నిన్న గుజరాత్‌లోని సూరత్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. దీంతో ఎన్డీఏ నేతలు ‘అబ్ కీ బార్ 399 పార్’ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా 1951 నుంచి ఇప్పటివరకు పోటీ లేకుండా ఎన్నికైన ఎంపీల సంఖ్య 35కు చేరుకుంది.
AP: వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 26న తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశంపై జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉండగా.. మహిళలు, యువత, రైతులను దృష్టిలో పెట్టుకుని పలు జనాకర్షక పథకాలను ప్రకటిస్తారని సమాచారం.
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తిరువనంతపురం నుంచి మళ్లీ గెలుస్తారని నటుడు ప్రకాశ్ రాజ్ జోస్యం చెప్పారు. ‘థరూర్ ఈ నియోజకవర్గానికి చాలా చేశారు. మళ్లీ ఆయనే గెలుస్తారు. ఆయన నాకు మిత్రుడని నేను మద్దతు ఇవ్వడం లేదు. గడచిన దశాబ్ద కాలంగా ఈ దేశ ప్రతినిధిగా థరూర్ నమ్మకాన్ని ఇచ్చారు’ అని పేర్కొన్నారు. తిరువనంతపురంలో థరూర్ 2009 నుంచి గెలుస్తుండటం గమనార్హం.
ఆర్సీబీకి ఇవాళ మర్చిపోలేని రోజు. ఇదే తేదీలో ఒక ఉత్తమ, ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. 2013 ఏప్రిల్ 23న PWతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 263 పరుగుల అత్యధిక స్కోరు చేసింది. 2017 ఏప్రిల్ 23న KKRతో జరిగిన మ్యాచ్‌లో 49కే ఆలౌటై అత్యల్ప స్కోరు నమోదు చేసింది. కాగా ఈ సీజన్‌లో RCB ఘోర ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి ఒకే ఒక్క దాంట్లో గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ‘ప్రతినిధి-2’ మూవీ విడుదల వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. తొలుత ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయాలని నిర్ణయించారు. టీవీ5 మూర్తి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సిరి లెల్లా హీరోయిన్‌గా నటించారు. అజయ్ ఘోష్, సప్తగిరి, జిషు సేన్ గుప్తా కీలకపాత్రలు పోషించారు. కుమార్ రాజా, ఆంజనేయులు, సురేంద్రనాథ్ సంయుక్తంగా నిర్మించారు.
విమానయాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్ల చిన్నారులకు అదే పీఎన్‌ఆర్ నంబర్‌పై ప్రయాణిస్తున్న తల్లిదండ్రులు లేదా సంరక్షకుల్లో ఒకరి పక్కన సీటు కేటాయించాలని సూచించింది. దీంతో పాటు జీరో బ్యాగేజీ, సీట్ల ప్రాధాన్యం, మీల్స్, సంగీత వాయిద్య పరికరాలు తీసుకెళ్లడానికి రుసుములు వసూలు చేసుకోవచ్చని పేర్కొంది.
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చేవెళ్లలోని రాజేంద్రనగర్‌లో ఆయన మాట్లాడారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికిపందలకు బుద్ధి చెప్పాలని పార్టీ నేతలను కోరారు. BRSకు 8-10 సీట్లు ఇస్తే కేంద్రంలోని ప్రభుత్వం తాము చెప్పినట్లే వింటుందన్నారు.
AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ సెల్ఫీ దిగారు. సోషల్ మీడియా వింగ్‌తో విశాఖలో ముఖాముఖి సమావేశం ముగిసిన అనంతరం సెల్ఫీదిగి కార్యకర్తల్లో జోష్ నింపారు. ‘మా సోషల్ మీడియా సూపర్‌స్టార్స్‌తో నేను’ అంటూ ఆ ఫొటోను సీఎం జగన్ ట్వీట్ చేశారు.
AP: ఐదేళ్లలో తన సంపాదన రూ.114.76 కోట్లని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. పన్ను రూపంలో ప్రభుత్వానికి రూ.73.92 కోట్లు చెల్లించినట్లు వివరించారు. మరో రూ.20 కోట్లను విరాళాలుగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. తనకు రూ.64.26 కోట్ల అప్పులు ఉన్నట్లు ఆయన తెలిపారు. బ్యాంకులు, వ్యక్తుల నుంచి ఈ అప్పులు తీసుకున్నట్లు వివరిస్తూ జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.
Sorry, no posts matched your criteria.