India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిన్న MIపై సెంచరీతో చెలరేగిన RR ప్లేయర్ జైస్వాల్ IPL హిస్టరీలో సరికొత్త రికార్డు నెలకొల్పారు. 23 ఏళ్ల వయసు లోపు(22Y 116D) రెండు శతకాలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. ఇతను గత ఏడాది MIపైనే తొలి సెంచరీ బాదారు. తక్కువ ఏజ్‌లో రెండు సెంచరీలు కొట్టిన వారి జాబితాలో గిల్(23Y 255D), శాంసన్(24Y 138D), వార్నర్(25Y 196D), కోహ్లీ(27Y 184D) ఉన్నారు.
AP: తూ.గో జిల్లా తిరుగుడుమెట్టకు చెందిన చంద్రశేఖర్ ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. అనంతరం బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తండ్రితో పాటు ప్రాణాలు కోల్పోయాడు. అయితే నిన్న విడుదలైన టెన్త్ ఫలితాల్లో చంద్రశేఖర్ 513 మార్కులు సాధించాడు. ఈ సంతోష సమయంలో మిత్రుడు తమతో లేకపోవడంతో స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి విద్యార్థిని కోల్పోయామంటూ ఉపాధ్యాయులు అతడిని గుర్తు చేసుకుంటున్నారు.
AP: హీరో బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని, అల్లుడు, విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ పేరిట రూ.393.41 కోట్ల ఆస్తులున్నాయి. భరత్ పేరిట రూ.16.89 కోట్ల చరాస్తులు, రూ.183.95 కోట్ల స్థిరాస్తులు.. తేజస్విని పేరుతో రూ.48.36 కోట్ల చరాస్తులు, రూ.44.20 కోట్ల స్థిరాస్తులున్నాయి. భరత్‌కు 7 కేజీల గోల్డ్, 51 కేజీల సిల్వర్.. తేజస్వినికి 5.3 కేజీల బంగారం, 52.50 కేజీల వెండి ఉంది.
ఐపీఎల్‌లో ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్నారు కేకేఆర్ ఆటగాడు నరైన్. ఆయన వెస్టిండీస్ తరఫున టీ20 వరల్డ్ కప్‌లో ఆడాలని చాలామంది కోరుతున్నారు. అయితే తాను రిటైర్మంట్ నుంచి బయటికొచ్చేది లేదని నరైన్ స్పష్టం చేశారు. ‘అందరూ నన్ను తిరిగి ఆడాలని కోరడం చాలా సంతోషం. కానీ నాకు ఆ ఆలోచన లేదు. వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌కు మద్దతునిచ్చి ఆనందిస్తాను. మా జట్టుకు ఆల్ ది బెస్ట్’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తమపై దాడికి వస్తే అణుశక్తితో ప్రతిస్పందించేందుకు ఉత్తర కొరియా తాజాగా డ్రిల్ నిర్వహించింది. దేశాధ్యక్షుడు కిమ్ దగ్గరుండి ఈ ప్రయోగాల్ని పర్యవేక్షించారని ప్రభుత్వ అధికారిక మీడియా కేసీఎన్ఏ ప్రకటించింది. 352 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని తమ రాకెట్లు అత్యంత కచ్చితత్వంతో ఛేదించాయని తెలిపింది. సోమవారం ప్యాంగ్యాంగ్ పలు స్వల్ప శ్రేణి క్షిపణులను ప్రయోగించిందని అంతకుముందు దక్షిణ కొరియా వెల్లడించింది.
IPL: ముంబై మరో మ్యాచ్ ఓడిపోవడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యపై ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి. కెప్టెన్, బ్యాటర్, బౌలర్‌గా విఫలమవుతున్నారని ముంబై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. బుమ్రా, కోయెట్జీ, తుషారా లాంటి టాప్ క్లాస్ బౌలర్లు ఉండగా.. హార్దిక్ ఫస్ట్ ఓవర్ వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. బ్యాటింగ్‌లోనూ సరైన ఫినిష్ ఇవ్వట్లేదని, కెప్టెన్సీలోనూ తేలిపోతున్నారని పెదవి విరుస్తున్నారు. మరి హార్దిక్ ప్రదర్శనపై మీ కామెంట్?
JEE మెయిన్ సెషన్-2 పరీక్ష ఫైనల్ ‘కీ’ నిన్న రిలీజైంది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పులు చేసిన NTA.. 4 ప్రశ్నలకు సంబంధించి విద్యార్థులకు మార్కులు కలపనుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 25న ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించినప్పటికీ.. ఇవాళే రిజల్ట్స్ రిలీజ్ అవుతాయని తెలుస్తోంది. APR 4 నుంచి 12 వరకు ఈ పరీక్ష జరిగింది. కటాఫ్ మార్కులు పొందిన 2.50 లక్షల మందికి JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే వీలు కల్పిస్తారు.
AP: నిన్న టెన్త్ ఫలితాల్లో 600కు 599 మార్కులు సాధించిన ఏలూరు జిల్లా విద్యార్థిని మనస్వి చరిత్ర సృష్టించారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇవే అత్యధిక మార్కులు. 2022లో 598, 2023లో 597 మార్కులు రాగా.. ఇప్పుడు ఆ రికార్డులను మనస్వి బద్దలుకొట్టారు. మనస్వి తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. వారి గైడెన్స్ తనకెంతో ఉపయోగపడిందని, ఐఐటీలో కంప్యూటర్ కోర్స్ చేస్తానని చెబుతున్నారు ఈ సరస్వతీ పుత్రిక.
నిన్న ముంబైపై రాజస్థాన్ రాయల్స్ సునాయాసంగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్, ఓపెనర్ జైస్వాల్‌పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ‘ఫామ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతం. యశస్వి ఆటే అందుకు నిదర్శనం. టీ20 వరల్డ్‌కప్‌లో కీపర్ ఎవరన్నదానిపై ఇక చర్చ అనవసరం. శాంసన్‌నే ఎంపిక చేయాలి. రోహిత్ తర్వాత కెప్టెన్‌గా అతడిని ప్రోత్సహించాలి’ అని అభిప్రాయపడ్డారు.
AP: దిగ్గజ రాజకీయ నేత కొణిజేటి రోశయ్య ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. రాష్ట్రంలో ఈసారి ముక్కోణపు పోరు జరిగే సెగ్మెంట్లలో ఇదొకటి. కరణం వెంకటేశ్(YCP), మాలకొండయ్య యాదవ్(TDP), ఆమంచి కృష్ణమోహన్(INC) తలపడనున్నారు. దీంతో పోటీ రసవత్తరంగా ఉండనుంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీనే ఉంటుందని అంచనా. ఇక్కడ INC 7సార్లు, TDP 5సార్లు, జనతా పార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, CPI ఒక్కోసారి గెలిచాయి.
<<-se>>#ELECTIONS2024<<>>
Sorry, no posts matched your criteria.