News April 24, 2024

సం‘క్షేమమేనా?’

image

AP: సంక్షేమ పథకాలు తమ ప్రభుత్వాన్ని క్షేమంగా చూసుకుంటాయని YCP భావిస్తోంది. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఏదో ఒక పథకంతో లబ్ధి పొందారని CM జగన్ సైతం పలు సందర్భాల్లో పేర్కొన్నారు. దీంతో వారంతా ఓటు బ్యాంకుగా మారుతారని ఆశిస్తోంది. కానీ రాష్ట్రాభివృద్ధి అంశాన్ని ప్రతిపక్షాలు ప్రధాన ప్రచారాస్త్రంగా తీసుకుంటే ప్రజల ఆలోచన మారినా ఆశ్చర్యం అక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

News April 24, 2024

కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు

image

బెంగాల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్ కేసుపై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2016 నాటి రిక్రూట్‌మెంట్ చెల్లదని పేర్కొంది. 9, 10, 11, 12వ తరగతిలో గ్రూప్ సీ, డీలో చేసిన నియామకాలన్నీ చట్ట విరుద్ధమని తెలిపింది. దీంతో నియమితులైన 23వేల మందికి పైగా ఉద్యోగులను వెంటనే తొలగించాలంటూ తీర్పు చెప్పింది. వీరందరూ నాలుగు వారాల్లోగా 12 శాతం వడ్డీతో మొత్తం జీతాన్ని తిరిగివ్వాలని తెలిపింది.

News April 24, 2024

కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ కొట్టివేత

image

జైల్లో ఢిల్లీ CM కేజ్రీవాల్ భద్రతను దృష్టిలో ఉంచుకొని మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. పిల్ వేసిన న్యాయ విద్యార్థికి రూ.75వేల ఫైన్ వేసింది. ఈసందర్భంగా పిటిషనర్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఆయనకు సలహాలు ఇచ్చేందుకు మనం ఎవరు? అసలు నువ్వెవరు? నీ గురించి నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావ్?’ అని పేర్కొంది.

News April 24, 2024

GOOD NEWS: బంగారం, వెండి ధరలు తగ్గాయ్

image

పసిడి, వెండి ధరలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.550 తగ్గి రూ.73,690కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.500 తగ్గి రూ.67,550గా నమోదైంది. సిల్వర్ రేట్ కేజీకి రూ.1000 దిగి రూ.89వేల వద్ద ఉంది.

News April 24, 2024

ఓటుపై ప్రముఖుల మాట

image

★ అవినీతిని సూటిగా ప్రశ్నించే ధైర్యం/సమయం లేనప్పుడు చాటుగానైనా శిక్షించు: అంబేడ్కర్
★ బుల్లెట్ కంటే బ్యాలెట్ బలమైనది: అబ్రహాం లింకన్
★ ఓటు వేయకపోవడమంటే లొంగి పోవడమే: ఎల్లిసన్
★ ఓటు వేయకపోతే నువ్వు లెక్కలోకి రావు: పెలోసీ
★ మార్పు కోరుకుంటే సరిపోదు.. ఓటు వేసి మార్పు చూడాలి: టేలర్ స్విఫ్ట్
★ మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు తెలివిగా సిద్ధమైతే తప్ప ప్రజాస్వామ్యం విజయం సాధించదు: రూజ్‌వెల్ట్

News April 24, 2024

తాడిపత్రిలో తడాఖా చూపేదెవరో!

image

అనంతపురం(D) తాడిపత్రిలో దశాబ్దాలుగా జేసీ బ్రదర్స్ హవా నడిచింది. 1985 నుంచి 2009 వరకు JC దివాకర్ రెడ్డి జైత్రయాత్ర అప్రతిహాతంగా కొనసాగింది. 2014లో ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. వీరి విజయపరంపరకు 2019లో కేతిరెడ్డి పెద్దారెడ్డి(YCP) బ్రేక్ వేశారు. ఈ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారు. TDP నుంచి 2019లో పోటీ చేసి ఓడిన ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ మరోసారి సమరానికి సై అంటున్నారు.
<<-se>>#ELETIONS2024<<>>

News April 24, 2024

టెన్త్ ఫలితాలు.. 600కు 599 మార్కులు

image

AP: టెన్త్ ఫలితాల్లో ఆకుల వెంకట నాగసాయి మనస్వి అనే విద్యార్థిని సత్తా చాటారు. 600కు 599 మార్కులతో రికార్డు సృష్టించారు. సెకండ్ లాంగ్వేజ్‌ (99 మార్కులు) తప్ప అన్ని సబ్జెక్టుల్లో 100కు 100 మార్కులు వచ్చాయి.

News April 24, 2024

రెండో దశ ఎన్నికలు.. స్వల్పంగా పెరిగిన మహిళా అభ్యర్థులు

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ ఈ నెల 26న జరగనుంది. 13 రాష్ట్రాల్లోని 89 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశతో పోలిస్తే సెకండ్ ఫేజ్‌లో పోటీ చేసే మహిళా అభ్యర్థులు కాస్త పెరిగారు. తొలి దశలో 102 స్థానాలకు 1,625 మంది పోటీ చేయగా 134(8.2%) మంది మహిళలున్నారు. ఈసారి 1198 మంది బరిలో ఉండగా వీరిలో 103(8.6%) మంది మహిళలు పోటీలో నిలిచారు.<<-se>>#ELECTIONS2024<<>>

News April 24, 2024

మే 24 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

image

AP: టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 3 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ కమిషనర్ సురేశ్ వెల్లడించారు. రేపటి నుంచి ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లికేషన్లు స్వీకరిస్తామని, విద్యార్థులు స్కూల్ నుంచి మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. నాలుగు రోజుల్లో షార్ట్ మెమోలు విడుదల చేస్తామన్నారు.

News April 24, 2024

ఇండియాలో టాప్-10 రిచెస్ట్ క్రికెటర్లు

image

★ సచిన్ టెండూల్కర్: $150 Million
★ ఎంఎస్ ధోనీ: $110M
★ విరాట్ కోహ్లీ: $93M
★ సౌరవ్ గంగూలీ: $50M
★ వీరేంద్ర సెహ్వాగ్: $45M
★ యువరాజ్ సింగ్: $35M
★ సురేశ్ రైనా: $25M
★ రాహుల్ ద్రవిడ్: $23M
★ రోహిత్ శర్మ: $22M ★ గౌతమ్ గంభీర్: $19M