India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణలో ఈ ఏడాది వానాకాలంలో రైతులు వరి సాగుకు పెద్దపీట వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఈసారి దాదాపు 65లక్షల ఎకరాల్లో వరి, 53లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని భావిస్తోంది. ఈమేరకు వానాకాలం సీజన్‌కు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసింది. గత వానాకాలంలో 64లక్షల ఎకరాల్లో వరి, 44.77లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. పంటల సాగు అంచనాల మేరకు విత్తనాల సరఫరాకు సన్నాహాలు చేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ నిన్న మొదలు కాగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి 39 మంది MP అభ్యర్థులు, 190 ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మరోవైపు తెలంగాణ నుంచి 42 మంది ఎంపీ అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్‌రావు, భరత్ ప్రసాద్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి తమ నామినేషన్ దాఖలు చేశారు.
<<-se>>#ELECTIONS2024<<>>
TG: పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. ఉదయం మహబూబ్‌నగర్‌లో వంశీచంద్ రెడ్డి నామినేషన్‌కు హాజరై సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌కు హాజరైన అనంతరం కర్ణాటకలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఈనెల 21న భువనగిరి, 22న ఆదిలాబాద్, 23న నాగర్‌కర్నూల్, 24న జహీరాబాద్, వరంగల్‌లో పర్యటించనున్నారు.
గుజరాత్‌లోని కచ్‌లో ఇటీవల గుర్తించిన శిలాజాలకు సంబంధించి IIT రూర్కి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇవి ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పాముకు చెందిన వెన్నెముక భాగాలు కావొచ్చని పేర్కొంది. అంతరించిపోయిన మాడ్‌ట్సోయిడే కుటుంబానికి చెందిన ఈ పాము పొడవు 11-15 మీటర్లు (36-49 ఫీట్లు) ఉండొచ్చని తెలిపింది. కాగా కొత్తగా గుర్తించిన ఈ రకం పాము జాతికి పరిశోధకులు ‘వాసుకీ ఇండికస్’ అని నామకరణం చేశారు.
ఈ ఐపీఎల్ తొలి 26 మ్యాచ్‌లతో తమ టీవీ ఛానెళ్లకు 45కోట్ల మంది వీక్షకులు వచ్చినట్లు డిస్నీ స్టార్ గ్రూప్ వెల్లడించింది. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి తమ ఛానెళ్లకు మొత్తంగా రీచ్ 8శాతం, టెలివిజన్ రేటింగ్స్ 15% పెరిగినట్లు తెలిపింది. గరిష్ఠంగా ముంబై ఇండియన్స్, RCB మధ్య ఈనెల 11న జరిగిన మ్యాచ్‌ను 15 కోట్ల మంది వీక్షించినట్లు తెలిపింది. మరోవైపు టోటల్ వాచ్ టైమ్ 188 బిలియన్ మినట్స్‌గా ఉన్నట్లు పేర్కొంది.
ప్రధాని మోదీని మరోసారి గెలిపిస్తే దేశంలో నక్సలిజం అనేది లేకుండా చేస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ‘అధికారంలోకి వచ్చిన ఏడాది లేదా రెండేళ్లలోనే నక్సలిజాన్ని అంతం చేస్తాం. ఛత్తీస్‌గఢ్‌లో BJP సర్కార్ రాగానే 90 రోజుల్లోనే 86 మంది నక్సల్స్ హతమయ్యారు. 126 మంది అరెస్ట్ కాగా 250 మంది సరెండర్ అయ్యారు’ అని తెలిపారు. కాంకేర్ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోలు హతమైన నేపథ్యంలో షా ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత నేవీ చీఫ్‌గా అడ్మిరల్ హరి కుమార్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్రం వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠిని కొత్త చీఫ్‌గా ప్రకటించింది. ఈనెల 30న త్రిపాఠి నేవీ చీఫ్‌గా బాధ్యతలు అందుకోనున్నారు. త్రిపాఠి గతంలో వెస్ట్రన్ నేవల్ కమాండ్ కమాండర్ ఇన్ చీఫ్‌గా సేవలు అందించారు. ఎన్నో నేవీ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు. 1985 జూలై 1న నేవీలో చేరిన త్రిపాఠి 2019లో వైస్ అడ్మిరల్/వైస్ చీఫ్ హోదా అందుకున్నారు.
సాధారణంగా ఎంపీ అభ్యర్థి ఆస్తి రూ.లక్షలు లేక రూ.కోట్లలోనో ఉంటుంది. కానీ నేడు జరగనున్న లోక్‌సభ తొలి విడత ఎన్నికల అభ్యర్థుల్లో కొందరి ఆస్తి రూ.వందల్లో ఉంది. తమిళనాడులోని తూత్తుకుడి నుంచి పోటీకి దిగిన స్వతంత్ర అభ్యర్థి పోన్‌రాజ్ ఆస్తి రూ.320. చెన్నై నార్త్ స్వతంత్ర అభ్యర్థి సూర్యముత్తు, మహారాష్ట్రలోని రామ్‌తేక్ స్వతంత్ర అభ్యర్థి కార్తిక్ గెండ్లాజీ ఆస్తుల విలువ చెరో రూ.500గా ఉంది. <<-se>>#Elections2024<<>>
లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా నేడు 1625 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 450 మంది అభ్యర్థులు కోటీశ్వరులే కావడం గమనార్హం. తమిళనాడు నుంచి అత్యధికంగా 202 మంది సంపన్న అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు క్రిమినల్ కేసులు ఉన్న 251 మంది అభ్యర్థుల్లో 28 మంది బీజేపీ, 19 మంది కాంగ్రెస్‌కు చెందిన వారు ఉన్నారు. DMK, AIADMK నుంచి చెరో 13 మందిపైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. <<-se>>#Elections2024<<>>
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్‌సభ తొలి విడత ఎన్నికలతో పాటు నేడు అసెంబ్లీ ఎన్నికలూ జరగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా 10 చోట్ల BJP అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 50 సీట్లకు నేడు పోలింగ్ జరగనుంది. 133 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సిక్కింలో 32 స్థానాలకు పోలింగ్ జరగనుండగా, 146 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Sorry, no posts matched your criteria.