India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోడ్డుపై నిలిపి ఉంచిన లారీలు, భారీ వాహనాలతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. జాతీయ రహదారులపై బ్రేక్ డౌన్ అవడం, విశ్రాంతి కోసం కొంతమంది లారీ డ్రైవర్లు ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండా ఆపేస్తున్నారు. దీంతో వేగంగా వచ్చే కార్లు వెనుక నుంచి ఢీకొడుతున్నాయి. నిన్న వడోదరలో ఈ తరహా ప్రమాదంలో 10 మంది మరణించారు. రోడ్డుపై లారీలు ఆపకూడదు. ఒకవేళ ఆపాల్సి వస్తే ఇండికేటర్స్ ఆన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
SHARE IT
కాకినాడ MP స్థానంలో వరుసగా 3 సార్లు స్వల్ప తేడాతో ఓడి రెండో స్థానంలో నిలిచిన చలమలశెట్టి సునీల్ YCP నుంచి బరిలో దిగుతున్నారు. జనసేన నుంచి ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ల తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సానుభూతి, వైసీపీ బలం కలిసొస్తుందని సునీల్, కూటమి సహకారం, పవన్ క్రేజ్ గట్టెక్కిస్తుందని ఉదయ్ ధీమాగా ఉన్నారు. ఇక్కడ 10సార్లు INC, TDP 5సార్లు, YCP, CPI, BJP ఒక్కోసారి గెలిచాయి.
<<-se>>#ELECTIONS2024<<>>
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో కాజల్.. పార్వతి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ పాత్రలో నయనతార నటించాల్సి ఉంది. కానీ ఏ కారణాలవల్లో ఆమె అర్ధంతరంగా సినిమా నుంచి తప్పుకున్నారు. ముకేశ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 కటాఫ్ మార్కులను UPSC ప్రకటించింది. *ప్రిలిమ్స్: జనరల్- 75.41, EWS- 68.02, OBC- 74.75, SC- 59.25, ST- 47.82 మార్కులుగా ప్రకటించింది.
*మెయిన్స్: జనరల్- 741, EWS-706, OBC- 712, SC- 694, ST- 692
*ఫైనల్: జనరల్- 953, EWS- 923, OBC- 919, SC- 890, ST- 891
>>గత కొన్నేళ్లతో పోలిస్తే ఈసారి కటాఫ్ ఎక్కువగా ఉంది.
TG: రాబోయే మూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40KMS వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరుగుతాయని తెలిపింది.
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న ‘దేవర’ మూవీ నార్త్ థియేట్రికల్ హక్కులను భారీ ధరకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హిందీ హక్కులను రూ. 50 కోట్లకు అమ్మినట్లు సమాచారం. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.130 కోట్లకు థియేట్రికల్ రైట్స్ విక్రయించినట్లు టాక్. మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
శ్రీరామ నవమి శోభాయాత్రలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈక్రమంలో దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ‘నాపై నెగటివిటీని సృష్టించేందుకు ఓ వీడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇది అసంపూర్ణమైన వీడియో అని స్పష్టం చేస్తున్నా. ఈ వీడియో వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే వారికి క్షమాపణలు చెప్తున్నా’ అని తెలిపారు.
➯ఆల్కహాల్, కెఫీన్, డ్రింక్స్‌ని ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురి చేసి హీట్ ఫీలింగ్‌ను కలిగిస్తాయి.
➯ఇంట్లో డోర్లు, విండోలకు గ్రాస్ కర్టెన్ లాంటివి వినియోగించాలి.
➯నీరు, వెజిటెబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి
➯వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. చన్నీటి స్నానం శరీర వేడిని తగ్గిస్తుంది
➯సహజమైన గాలి ప్రవాహం కోసం ఇంట్లో వ్యతిరేక దిశల్లో ఉన్న కిటికీలను తెరిచి ఉంచాలి.
AP: సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో సతీశ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడికి వైద్య పరీక్షలు పూర్తి చేసి, విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి దుర్గారావు అనే వ్యక్తి సహకరించినట్లు సమాచారం. మొత్తంగా పోలీసులు ఐదుగురిని విచారించినట్లు తెలుస్తోంది.
AP: సీఎం జగన్‌పై దాడిని టీడీపీకి ఆపాదించే కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నేత బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ‘కావాలనే టీడీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. ఆ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మాజీ మంత్రి వెలంపల్లి కాలికి గాయమైతే.. కంటికి కట్టు కట్టుకున్నారు. ఆయనకు దమ్ముంటే పబ్లిక్‌గా కంటి పరీక్షలు చేయించుకోవాలి. సానుభూతి రాజకీయాల కోసమే జగన్ నాటకాలు ఆడుతున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Sorry, no posts matched your criteria.