India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులను కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా కాపాడుకుంటుందో అలా కాపాడుకున్నామని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం 5 పథకాలు తీసుకొచ్చామన్నారు. రైతుబంధుతో ఎకరానికి రూ.10వేలు ఇచ్చామన్నారు. 24గంటల నాణ్యమైన కరెంట్, రైతు బీమా కింద రూ.5లక్షలు, పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేదని ఆయన అన్నారు.
HYD సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌పై సీబీఐ FIR నమోదు చేసింది. జగదల్‌పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పనులకు సంబంధించి ₹174 కోట్ల బిల్లులను క్లియర్ చేయించుకోవడానికి 8 మంది NISP, NMDC అధికారులకు కంపెనీ ₹78 లక్షల లంచం ఇచ్చినట్లు తేలింది. దీంతో వారిపైనా కేసు నమోదయ్యింది. కాగా ₹966 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసి.. రెండో అతిపెద్ద కంపెనీగా మేఘా నిలిచిన విషయం తెలిసిందే.
ఆగ్రాకు చెందిన హన్సురామ్ అంబేడ్కరీ(78)కి ఎన్నికలతో ప్రత్యేక అనుబంధం ఉంది. 1985 నుంచి ఇప్పటి వరకు 98 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక్కసారీ గెలవలేదు. రానున్న ఎన్నికలకూ ఆగ్రా, ఫతేపుర్ సిక్రీ స్థానాల నుంచి బరిలో ఉన్నారు. ‘పంచాయతీ నుంచి లోక్‌సభ వరకు అన్ని ఎన్నికలకూ పోటీ చేశా. రాష్ట్రపతి పదవికీ ట్రై చేశా. తిరస్కరించారు. 100సార్లు నామినేషన్ నా లక్ష్యం. అది పూర్తయ్యాక మానేస్తాను’ అని తెలిపారు.
TG: ప్రభుత్వం అంటే ప్రజలకు ధీమా, ధైర్యం ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తమకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం ఆదుకుంటుందనే విశ్వాసం ఉండాలని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వాన్ని ఎన్నుకునే ముందు ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని అన్నారు. ప్రతిసభలోనూ ఇదే విషయాన్ని తాను ప్రజలకు గుర్తు చేస్తుంటానని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వాలు మారుతుంటాయని ఆయన అన్నారు.
స్టార్ హీరో ధనుశ్ తన కొడుకే అంటూ 2015లో కేసు వేసిన కతిరేశన్ మృతి చెందారు. ధనుశ్ స్కూల్ నుంచి తమకు చెప్పకుండా పారిపోయి దర్శకుడు కస్తూరి రాజాకు దత్తపుత్రుడు అయ్యాడని కతిరేశన్ దంపతులు పేర్కొనడం అప్పట్లో సంచలనమైంది. ఈ విషయమై వారు కోర్టులను కూడా ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. కాగా గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కతిరేశన్ నిన్న మధురై ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందారు.
హనుమాన్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన తేజా సజ్జ హీరోగా ‘సూపర్ యోధ’ అనే మూవీ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టుపై ఎల్లుండి అధికారిక ప్రకటన చేయనున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. ‘చరిత్రను తిరగరాసే రహస్యం’ ఆవిష్కృతం కానుందని పేర్కొంది. కాగా ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తారని సమాచారం. విలన్‌గా మంచు మనోజ్, కీలక పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తారని తెలుస్తోంది.
TG: హైదరాబాద్‌లో నీటి సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలు 155313 నంబరుకు కాల్ చేయాలని సూచించారు. 700 ట్యాంకర్ల ద్వారా సిటీలో నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూర్‌లో నీటి నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కన్నా ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నామని పొన్నం చెప్పారు.
AP: వెయ్యి మంది జగన్‌లు వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరని చంద్రబాబు అన్నారు. అమరావతి రైతులు, మహిళల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. తిక్కలోడికి ప్రజలు ఓటేస్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని దుయ్యబట్టారు. సంపద సృష్టించే కేంద్రంగా రాజధాని తయారు చేస్తామని.. కర్నూలు, విశాఖను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తాను సీఎంగా ఉంటే ఇప్పటికే పోలవరం పూర్తయ్యేది అని పేర్కొన్నారు.
కొలంబియా దేశ రాజధాని బొగోటా సిటీ మేయర్ కార్లోస్ ఫెర్నాండో గాలన్ ప్రజలకు వింత సూచన చేశారు. ప్రస్తుతం అక్కడ తీవ్ర నీటి కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దంపతులు కలిసి స్నానం చేయాలని.. తద్వారా కాస్త నీరు ఆదా అవుతుందని సలహా ఇచ్చారు. అలాగే హాలిడేస్‌లో లేదా బయటకు వెళ్లని రోజుల్లో స్నానం చేయడం మానుకోవాలని కోరారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా నీటి ఎద్దడి నెలకొన్న దృష్ట్యా ఇలాంటి జాగ్రత్తలు తప్పవని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో తమిళనాడులోని ప్రతిపక్ష AIADMKకు మద్దతిస్తామని AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ పొత్తు ఉంటుందన్నారు. BJPతో పొత్తు పెట్టుకునేందుకు AIADMK తిరస్కరించిందని, భవిష్యత్తులోనూ ఒప్పుకోబోదని ఒవైసీ అన్నారు. కేంద్రంలోని BJP తీసుకొచ్చిన CAA, NPR, NRCలను సైతం తమిళనాడులోని AIADMK వ్యతిరేకిస్తోందని, అందుకే ఆ పార్టీకి తాము మద్దతిస్తున్నట్లు ఒవైసీ ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.