News April 13, 2024

IPL: టాస్ గెలిచిన రాజస్థాన్

image

ఈరోజు ములాన్‌పూర్‌లో పంజాబ్, రాజస్థాన్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో RR టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
పంజాబ్ జట్టు: బెయిర్‌స్టో, తాయిడే, ప్రభ్‌సిమ్రన్, కరన్, లివింగ్‌స్టన్, జితేశ్, శశాంక్ సింగ్, బ్రార్, హర్షల్ పటేల్, రబాడ, అర్షదీప్ సింగ్
ఆర్ఆర్ జట్టు: కోటియన్, హెట్మెయిర్, శాంసన్, పరాగ్, జురెల్, పావెల్, బౌల్ట్, మహారాజ్, ఆవేశ్, కుల్‌దీప్ సేన్, చాహల్

News April 13, 2024

రైతులను కోడిపిల్లల్లా కాపాడుకున్నాం: KCR

image

TG: తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులను కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా కాపాడుకుంటుందో అలా కాపాడుకున్నామని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం 5 పథకాలు తీసుకొచ్చామన్నారు. రైతుబంధుతో ఎకరానికి రూ.10వేలు ఇచ్చామన్నారు. 24గంటల నాణ్యమైన కరెంట్, రైతు బీమా కింద రూ.5లక్షలు, పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేదని ఆయన అన్నారు.

News April 13, 2024

‘మేఘా’పై FIR నమోదు చేసిన సీబీఐ

image

HYD సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌పై సీబీఐ FIR నమోదు చేసింది. జగదల్‌పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ పనులకు సంబంధించి ₹174 కోట్ల బిల్లులను క్లియర్ చేయించుకోవడానికి 8 మంది NISP, NMDC అధికారులకు కంపెనీ ₹78 లక్షల లంచం ఇచ్చినట్లు తేలింది. దీంతో వారిపైనా కేసు నమోదయ్యింది. కాగా ₹966 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసి.. రెండో అతిపెద్ద కంపెనీగా మేఘా నిలిచిన విషయం తెలిసిందే.

News April 13, 2024

ఎన్నికల్లో పట్టువదలని విక్రమార్కుడు!

image

ఆగ్రాకు చెందిన హన్సురామ్ అంబేడ్కరీ(78)కి ఎన్నికలతో ప్రత్యేక అనుబంధం ఉంది. 1985 నుంచి ఇప్పటి వరకు 98 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక్కసారీ గెలవలేదు. రానున్న ఎన్నికలకూ ఆగ్రా, ఫతేపుర్ సిక్రీ స్థానాల నుంచి బరిలో ఉన్నారు. ‘పంచాయతీ నుంచి లోక్‌సభ వరకు అన్ని ఎన్నికలకూ పోటీ చేశా. రాష్ట్రపతి పదవికీ ట్రై చేశా. తిరస్కరించారు. 100సార్లు నామినేషన్ నా లక్ష్యం. అది పూర్తయ్యాక మానేస్తాను’ అని తెలిపారు.

News April 13, 2024

ప్రభుత్వం అంటే ప్రజలకు ధీమా ఉండాలి: కేసీఆర్

image

TG: ప్రభుత్వం అంటే ప్రజలకు ధీమా, ధైర్యం ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తమకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం ఆదుకుంటుందనే విశ్వాసం ఉండాలని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వాన్ని ఎన్నుకునే ముందు ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని అన్నారు. ప్రతిసభలోనూ ఇదే విషయాన్ని తాను ప్రజలకు గుర్తు చేస్తుంటానని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వాలు మారుతుంటాయని ఆయన అన్నారు.

News April 13, 2024

హీరో ధనుశ్ తండ్రినని కోర్టుకెక్కిన వ్యక్తి మృతి

image

స్టార్ హీరో ధనుశ్ తన కొడుకే అంటూ 2015లో కేసు వేసిన కతిరేశన్ మృతి చెందారు. ధనుశ్ స్కూల్ నుంచి తమకు చెప్పకుండా పారిపోయి దర్శకుడు కస్తూరి రాజాకు దత్తపుత్రుడు అయ్యాడని కతిరేశన్ దంపతులు పేర్కొనడం అప్పట్లో సంచలనమైంది. ఈ విషయమై వారు కోర్టులను కూడా ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. కాగా గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కతిరేశన్ నిన్న మధురై ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందారు.

News April 13, 2024

తేజా సజ్జ కొత్త సినిమా ‘సూపర్ యోధ’

image

హనుమాన్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన తేజా సజ్జ హీరోగా ‘సూపర్ యోధ’ అనే మూవీ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టుపై ఎల్లుండి అధికారిక ప్రకటన చేయనున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. ‘చరిత్రను తిరగరాసే రహస్యం’ ఆవిష్కృతం కానుందని పేర్కొంది. కాగా ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తారని సమాచారం. విలన్‌గా మంచు మనోజ్, కీలక పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తారని తెలుస్తోంది.

News April 13, 2024

నీటి ఎద్దడిపై టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

image

TG: హైదరాబాద్‌లో నీటి సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలు 155313 నంబరుకు కాల్ చేయాలని సూచించారు. 700 ట్యాంకర్ల ద్వారా సిటీలో నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూర్‌లో నీటి నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కన్నా ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నామని పొన్నం చెప్పారు.

News April 13, 2024

నేను సీఎంగా ఉండుంటే పోలవరం పూర్తయ్యేది: CBN

image

AP: వెయ్యి మంది జగన్‌లు వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరని చంద్రబాబు అన్నారు. అమరావతి రైతులు, మహిళల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. తిక్కలోడికి ప్రజలు ఓటేస్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని దుయ్యబట్టారు. సంపద సృష్టించే కేంద్రంగా రాజధాని తయారు చేస్తామని.. కర్నూలు, విశాఖను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తాను సీఎంగా ఉంటే ఇప్పటికే పోలవరం పూర్తయ్యేది అని పేర్కొన్నారు.

News April 13, 2024

‘దంపతులు కలిసి స్నానం చేయండి’.. మేయర్ వింత సూచన

image

కొలంబియా దేశ రాజధాని బొగోటా సిటీ మేయర్ కార్లోస్‌ ఫెర్నాండో గాలన్‌ ప్రజలకు వింత సూచన చేశారు. ప్రస్తుతం అక్కడ తీవ్ర నీటి కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దంపతులు కలిసి స్నానం చేయాలని.. తద్వారా కాస్త నీరు ఆదా అవుతుందని సలహా ఇచ్చారు. అలాగే హాలిడేస్‌లో లేదా బయటకు వెళ్లని రోజుల్లో స్నానం చేయడం మానుకోవాలని కోరారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా నీటి ఎద్దడి నెలకొన్న దృష్ట్యా ఇలాంటి జాగ్రత్తలు తప్పవని పేర్కొన్నారు.