India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్ ప్రయాణం ముగిసింది. ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌లో పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణోయ్ ఓటమిపాలయ్యారు. చైనాకు చెందిన సిక్స్త్ సీడ్ హాన్ యువే చేతిలో సింధు పోరాడి 18-21, 21-13, 17-21 తేడాతో ఓడారు. దీనికి ముందు ఆమెతో 5సార్లు తలపడిన సింధు ఎప్పుడూ ఓడిపోలేదు. ఇక సెవెన్త్ సీడ్‌గా బరిలోకి దిగిన ప్రణోయ్, తైపీకి చెందిన అన్‌సీడెడ్ లిన్ చున్-యీ చేతిలో 43 నిమిషాల్లోనే ఓడిపోయారు.
AP: రాజకీయ హేమాహేమీలు పోటీ చేసి గెలుపొందిన పార్లమెంట్ స్థానం పల్నాడు(D) నరసరావుపేట. ఈసారి ఇక్కడ సమవుజ్జీల పోటీ ఉత్కంఠ రేపుతోంది. నెల్లూరు సిటీ MLA అనిల్ కుమార్ యాదవ్‌ను YCP బరిలోకి దింపింది. గతంలోనూ నెల్లూరు జిల్లా నేతలు ఇక్కడ పోటీ చేసి నెగ్గిన చరిత్ర ఉంది. ఇటు TDP నుంచి లావు కృష్ణదేవరాయలు పోటీలో ఉన్నారు. విజయంపై ఇద్దరు నేతలూ ధీమాగా ఉండగా.. యాదవ వర్గం ఓట్లు కీలకంగా మారనున్నాయి.
<<-se>>#ELECTIONS2024<<>>
ప్రస్తుతం టీమ్‌ఇండియాకు కీలక బౌలర్‌గా ఉన్న బుమ్రా ఓ దశలో కెనడాలో స్థిరపడాలని అనుకున్నారట. ఆయన భార్య సంజనా గణేశన్‌తో కలిసి చేసిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నా కెరీర్ తొలినాళ్లలో క్రికెట్ కలిసి రాకుంటే ఫ్యామిలీతో సహా కెనడా వెళ్లిపోయి అక్కడ బంధువుల వద్ద ఉండి చదువుకుందామని అనుకున్నా. కానీ అమ్మ దేశాన్ని విడిచిపెట్టేందుకు ఇష్టపడలేదు. అదృష్టవశాత్తు నాకు అవకాశాలు వచ్చాయి’ అని తెలిపారు.
AP: తన అన్నయ్య చిరంజీవి మార్షల్ ఆర్ట్స్, నటన అనే స్కిల్స్ నేర్పించడం వల్లే ఇవాళ తాను ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నానని పవన్ చెప్పారు. ‘ఆ స్కిల్స్ నన్ను కోట్ల మంది ముందు నిలబెట్టాయి. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తే యువత సొంతంగా సంపాదించుకుంటారు. అందుకే యువత నైపుణ్యాలు మెరుగుపర్చేలా కష్టపడుతున్నాం. సంక్షేమ పథకాలూ ఏవీ ఆపం. మరో పది రూపాయలు ఎక్కువే ఇస్తాం’ అని హామీనిచ్చారు.
AP: టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి త్రివేణి సంగమంలా ఈ రాష్ట్రాన్ని కాపాడుతాయని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ‘యువతకు భరోసా ఇవ్వడానికి, ఈ ప్రాంతానికి కొబ్బరి బోర్డు తీసుకురావడానికి కృషి చేస్తాం. కోనసీమకు కొబ్బరి అనుబంధ పరిశ్రమలు రావాలి. 5 కోట్ల మంది ప్రజలను కాపాడేందుకు, రైతు కన్నీరు తుడిచేలా కూటమి అండగా నిలుస్తుంది. రైతుభరోసా కేంద్రాలు కాకినాడ మాఫియా డాన్ చేతుల్లోకి వెళ్లాయి’ అని వ్యాఖ్యానించారు.
AP: ప్రభుత్వ ఉద్యోగులు సైతం జగన్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘విశాఖలో శంకర్ అనే కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులకు ఇవ్వాల్సిన నిధులు ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఈ దుర్మార్గులు మళ్లీ వస్తే ప్రజలు పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. గోదావరి, కృష్ణా లాంటి పవిత్ర నదులు పారే ఈ రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చారు’ అని ఫైర్ అయ్యారు.
AP: పచ్చని అందమైన కోనసీమను YCP ప్రభుత్వం కలహాల సీమగా మార్చేందుకు ప్రయత్నించిందని పవన్ మండిపడ్డారు. అంబాజీపేట సభలో మాట్లాడిన పవన్.. ‘కోనసీమను ప్రేమ సీమగా మార్చేందుకు మేం ముందుకు వచ్చాం. 2.5 లక్షల హెక్టార్ల కొబ్బరి తోటలతో నిండిన కోనసీమను కొట్లాట సీమగా మారకుండా మేం కృషి చేశాం. భవిష్యత్తులో కూడా ప్రేమ సీమగా ఉండేలా, అన్ని కులాల ప్రజలు, మైనార్టీలు కలిసి ఉండేలా పనిచేస్తాం’ అని వెల్లడించారు.
AP: చెత్తపై పన్ను వేసిన దుర్మార్గుడు CM జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘CM ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సిద్ధం అంటున్న వారిపై యుద్ధం చేద్దామని పవన్ చెప్పారు. 2014లో పవన్ పోటీ చేయకుండా మద్దతిచ్చారు. గోదావరి జిల్లాల ప్రజలు వన్‌సైడ్ తీర్పిచ్చారు. మరోసారి మోదీ, నేను, పవన్ జతకట్టాం. నిలబడే దమ్ము జగన్‌కు ఉందా?మీరు నిలబడనిస్తారా? ఎన్నికలు లాంఛనమే. కూటమి గెలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.
ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు వాంఖడే స్టేడియంలో ముంబై, బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది.
ముంబై జట్టు: రోహిత్ శర్మ, ఇషాన్, తిలక్, హార్దిక్, టిమ్ డేవిడ్, రొమారియో, నబీ, కోయెట్జీ, శ్రేయస్ గోపాల్, బుమ్రా, ఆకాశ్ మధ్వాల్
ఆర్సీబీ జట్టు: విరాట్, డుప్లెసిస్, విల్ జాక్స్, పాటీదార్, మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, లోమ్రోర్, టోప్లీ, వైశాఖ్, సిరాజ్, ఆకాశ్ దీప్
వియత్నాంలో ప్రజల్ని మోసం చేసిన కోటీశ్వరురాలు ట్రువాంగ్ మైలాన్‌కు అక్కడి కోర్టు మరణ శిక్ష విధించింది. 2012-2022 మధ్యకాలంలో ఆమె వేలాది నకిలీ సంస్థల్ని స్థాపించి వాటి ద్వారా రూ.లక్ష కోట్ల(2022లో వియత్నాం స్థూలదేశీయోత్పత్తిలో ఇది 3శాతం) అవినీతికి పాల్పడ్డారు. ఈ కేసుపై విచారణ చేస్తున్న హో చిన్ మిన్ నగరంలోని కోర్టు, మైలాన్‌కు మరణశిక్ష విధిస్తున్నట్లు తాజాగా తీర్పు చెప్పింది.
Sorry, no posts matched your criteria.