India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి అన్నామలై తరఫున ఆయన ఇవాళ, రేపు ఓట్లు అభ్యర్థించనున్నారు. కోయంబత్తూరులో తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో సభలు, సమావేశాల్లో లోకేశ్ రోడ్‌షోల్లో పాల్గొంటారు. అనంతరం తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు.
AP: TET-2024, DSC కోసం ఫీజు చెల్లించి అనర్హులైన అభ్యర్థులకు ఫీజును తిరిగి ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. అభ్యర్థుల ఆధార్‌తో లింకై ఉన్న బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్టు తెలిపింది. 50,206 మందికి ఫీజు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు 44,690 మందికి చెల్లించినట్లు పేర్కొంది. డబ్బులు జమ కాని వారు కమిషనర్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఆధార్ లింకై ఉన్న అకౌంట్ వివరాలు ఇవ్వాలని సూచించింది.
TG: వర్షాకాలంలో నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు తాత్కాలిక మరమ్మతులు చేయాలని కాంట్రాక్ట్ కంపెనీలకు నీటి పారుదల శాఖ సూచించింది. అయితే.. మూడు బ్యారేజీలు, పంప్‌హౌస్‌లకు కలిపి రూ.600కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరమ్మతులకు ఎంత ఖర్చవుతుంది? దాన్ని ఎవరు భరించాలనేది తేలితేనే ఈ మరమ్మతులు జరిగే అవకాశం ఉంటుంది.
TG: టెట్ దరఖాస్తుల గడువును ఈనెల 20 వరకు పొడిగించిన ప్రభుత్వం నేటి నుంచి దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఈనెల 20 వరకు తమ దరఖాస్తుల్లోని తప్పులను సవరించుకోవచ్చని తెలిపింది. ఈనెల 9వ తేదీ నాటికి 1,93,135 దరఖాస్తులు రాగా, గతంతో పోల్చితే అప్లికేషన్లు తక్కువగా రావడంతో గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నిన్న రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో ముస్లింలు అత్యంత పవిత్రంగా పాటించిన రంజాన్ మాస ఉపవాస దీక్షలు ముగిశాయి. దీంతో ఇవాళ రంజాన్(ఈద్ ఉల్ ఫితర్) జరుపుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవ అత్యున్నతమైనదని చాటి చెప్పే ఈ పండుగ లౌకిక వాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.
ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెలను అరబిక్‌లో రంజాన్ అంటారు. నెలవంక దర్శనంతో ఇది మొదలవుతుంది. 29-30 రోజులుండే ఈనెలను పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెలలో ఖురాన్ పఠనానికి ప్రాధాన్యం ఇస్తారు. నెలంతా సూర్యోదయానికి ముందే నిద్రలేచి భోజనం ముగిస్తారు. దీనినే సుహుర్/సెహ్రి అంటారు. సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం ముగిస్తారు. అప్పుడు చేసే విందునే ఇఫ్తార్/ఫితూర్ అంటారు. ఉపవాసాలను ముగించడాన్ని ఈద్ ఉల్ ఫితర్ అంటారు.
ఐపీఎల్-2024లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. వాంఖడేలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచుల్లో తలపడగా ముంబై 18 మ్యాచుల్లో గెలిచింది. ఆర్సీబీ 14 మ్యాచుల్లో విజయం సాధించింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఈ రెండు టీమ్‌లు ఒక్కో మ్యాచులో మాత్రమే గెలిచాయి. మరి నేడు గెలుపెవరిది? కామెంట్ చేయండి.
TG: లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రంలో 450 పోలింగ్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయాలని ఈసీ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపు 3 లక్షల మంది ఓటర్లు పెరిగారు. ఈ నేపథ్యంలో కేంద్రాల సంఖ్యను 35,356 నుంచి 35,806కు పెంచాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అనుమతి కోరుతూ ECIకి రాష్ట్ర సీఈవో వికాస్ రాజ్ ప్రతిపాదనలు పంపారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 3.31 కోట్ల మంది ఓటర్లున్నారు.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ రికార్డు సృష్టించారు. RR తరఫున అత్యధిక 50+ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా నిలిచారు. సంజూ ఇప్పటివరకు 25 సార్లు 50+ స్కోర్లు చేయగా, అతని తర్వాత స్థానంలో బట్లర్ (24) ఉన్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచులాడిన సంజూ 246 రన్స్ చేశారు. దీంతో మంచి ఫామ్‌లో ఉన్న అతడిని T20 WC జట్టుకు సెలెక్ట్ చేయాలని బీసీసీఐ సెలక్టర్లకు పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.
TG: జూన్ చివరి వారంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయని భువనగిరి లోక్‌సభ సమీక్ష సమావేశంలో కాంగ్రెస్ నేతలకు CM రేవంత్ చెప్పినట్లు సమాచారం. MP ఎన్నికల తర్వాత జూన్ ఫస్ట్ వీక్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, జూన్ చివరిలోపు ఎన్నికలు జరుగుతాయని చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే సంక్షేమ పథకాల కోసం ఇందిరమ్మ కమిటీలు వేస్తామని, ప్రతి కమిటీ సభ్యునికి రూ.6వేలు గౌరవ వేతనంగా చెల్లిస్తామన్నారట.
Sorry, no posts matched your criteria.