India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: జూన్ చివరి వారంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయని భువనగిరి లోక్‌సభ సమీక్ష సమావేశంలో కాంగ్రెస్ నేతలకు CM రేవంత్ చెప్పినట్లు సమాచారం. MP ఎన్నికల తర్వాత జూన్ ఫస్ట్ వీక్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, జూన్ చివరిలోపు ఎన్నికలు జరుగుతాయని చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే సంక్షేమ పథకాల కోసం ఇందిరమ్మ కమిటీలు వేస్తామని, ప్రతి కమిటీ సభ్యునికి రూ.6వేలు గౌరవ వేతనంగా చెల్లిస్తామన్నారట.
చక్కర పదార్థాల్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయని, వాటిని తినడం మానేస్తే శరీర బరువు తగ్గే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయని, డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని తెలిపారు. కాలేయం పనితీరు కూడా మెరుగుపడుతుందని, దంతాలు, చిగుళ్ల సమస్యల నుంచి బయటపడొచ్చని అంటున్నారు. గుండె సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు కూడా పోతాయని పేర్కొంటున్నారు.
భారత్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం కోసం తాను ఎదురుచూస్తున్నానని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈనెల 22న వీరి భేటీ జరగనున్నట్లు సమాచారం. దేశంలో టెస్లా కార్ల తయారీ ప్లాంట్ స్థాపనపై వారు చర్చించే అవకాశం ఉందని, పీఎంతో భేటీ అనంతరం దీనిపై మస్క్ అప్‌డేట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మోదీ, మస్క్ చివరగా గతేడాది జూన్‌లో యూఎస్‌లో కలిశారు. మళ్లీ ఇప్పుడు కలవనున్నారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు ఐఐటీ మద్రాస్ ప్రకటించింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారు ఏప్రిల్ 27 నుంచి మే 7న సా.5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. మే 10 వరకు ఫీజు చెల్లించవచ్చని, మే 17 నుంచి అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. మే 26న పరీక్షను యథాతథంగా నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
తేది: ఏప్రిల్ 11, గురువారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:49
సూర్యోదయం: ఉదయం గం.6:03
జొహర్: మధ్యాహ్నం గం.12:17
అసర్: సాయంత్రం గం.4:43
మఘ్రిబ్: సాయంత్రం గం.6:31
ఇష: రాత్రి గం.07.45
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
వచ్చే నెల 1 నుంచి తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లో వన్ ప్లస్ ఫోన్లు ఆఫ్‌లైన్ స్టోర్లలో లభించకపోవచ్చు. ఆ ఫోన్ల అమ్మకాల వలన తమకు మార్జిన్లు ఉండకపోవడమే కాక, తమ సమస్యలను వన్ ప్లస్ పెడచెవిన పడుతోందని సౌత్ఇండియన్ ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. వాటిని అమ్మేది లేదని చెబుతూ వన్‌ప్లస్ సేల్స్ డైరెక్టర్‌కు తాజాగా లేఖ రాసింది.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
1827: సంఘ సంస్కర్త జ్యోతీరావు పూలే జననం
1869: కస్తూరిబాయి గాంధీ జననం
1904: నటుడు, గాయకుడు కుందన్ లాల్ జననం
1919: అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడింది
2010: నక్సలైట్ ఉద్యమకారుడు పైల వాసుదేవరావు మరణం
* ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవం
* జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: ఏప్రిల్ 11, గురువారం
చైత్రము
శు.తదియ: మధ్యాహ్నం: 3:03 గంటలకు
కృత్తిక: అర్ధరాత్రి 1:38 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 10:04 నుంచి ఉదయం 10:54 గంటల వరకు
తిరిగి మధ్యాహ్నం 3:00 నుంచి మధ్యాహ్నం 3:50 వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 2:21 నుంచి మధ్యాహ్నం 3:52 వరకు
Sorry, no posts matched your criteria.