India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోదరుడు ప్రసన్నకుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో సీఎం రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. కాగా తన ప్రత్యర్థి చల్లా వెంకట్రామిరెడ్డితో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ కావడంతో ప్రసన్నకుమార్ అలకబూనినట్లు టాక్. అందుకే తన సొంత అన్నతో విభేదించే పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది.
AP: మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు మాడుగుల టికెట్ ఇచ్చేందుకు TDP అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీఎం రమేశ్ కూడా ఆయనకే మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. మాడుగుల TDP టికెట్‌ను ఇప్పటికే పైలా ప్రసాద్‌కు కేటాయించారు. కానీ దీనిపై పార్టీ నేతలు పీవీజీ కుమార్, గవిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ప్రసాద్‌ను తప్పించి బండారుకు టికెట్ ఇవ్వనున్నట్లు టాక్.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 12 వరకు ఆయనకు ఈ రిమాండ్ విధిస్తున్నట్లు నాంపల్లి కోర్టు తెలిపింది. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు.
Way2News లోగోతో కొందరు తప్పుడు వార్తలు వైరల్ చేస్తున్నారు. వీటిని నమ్మినా, షేర్ చేసినా మనం ఇబ్బందులు పడవచ్చు. మేము పబ్లిష్ చేసే ఆర్టికల్‌కు యునిక్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్‌ను fc.way2news.comలో ఎంటర్ చేస్తే ఆ ఫార్వర్డ్ ఆర్టికల్ కన్పించాలి. లేదంటే మీకు వచ్చిన స్క్రీన్‌షాట్ మాది కాదు అని గ్రహించండి. మీరు Way2News లోగోతో ఫేక్ వార్తలు పొందితే ఈ-మెయిల్‌లో రిపోర్ట్ చేయండి. grievance@way2news.com -ధన్యవాదాలు
లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తనను విచారించడంపై MLC కవిత వేసిన పిటిషన్ కాసేపట్లో విచారణకు రానుంది. మధ్యాహ్నం 12 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఆమె పిటిషన్‌పై వాదనలు విననుంది. ప్రస్తుతం తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కవితను విచారించేందుకు సీబీఐ గతవారం అనుమతి తీసుకుంది. దీన్ని సవాలు చేస్తూ ఆమె కోర్టును ఆశ్రయించారు.
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల ఫలితాలు ఈనెల 25న విడుదల కానున్నాయి. మెయిన్ సెషన్-2 పేపర్-1 పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఈనెల 12న పేపర్-2(ఎ), పేపర్-2(బి) పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత NTA రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక ‘కీ’ని విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించనుంది.
బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్స్ మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.380 పెరిగి రూ.72,110కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.350 పెరిగి 66,100గా నమోదైంది. సిల్వర్ రేట్ కూడా అస్సలు తగ్గడం లేదు. తాజాగా కేజీ వెండిపై రూ.1000 పెరిగి రూ.89,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
TG: లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భువనగిరి ఎంపీ స్థానంపై రివ్యూ చేయనున్నారు. కాసేపట్లో ఆయన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి భేటీ కానున్నారు. దీనికి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్ రెడ్డి తదితర నేతలు హాజరుకానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
ఆడవారికంటే మగవారే ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నట్లు బ్రిటన్‌లో నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. మహిళలు ఏడాదికి సగటున 728 అబద్ధాలు చెబితే.. పురుషులు ఏకంగా 1,092 అబద్ధాలు ఆడుతున్నారట. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాల్లో కంటే నేరుగా కలిసినప్పుడు మరిన్ని అబద్ధాలు చెబుతున్నారట. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి?
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘జీవితంలో నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కోవాలి’ అని పోస్ట్ చేశారు. దీనికి నవ్వుతున్న ఫొటోను యాడ్ చేశారు. ఇటీవల పలువురు నేతలు పార్టీ మారడం, కవిత అరెస్టు బీఆర్ఎస్‌పై ప్రభావం చూపాయి. ఈ క్రమంలో KTR చేసిన ట్వీట్ వెనక ఆంతర్యం ఏంటో అని చర్చించుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.