News April 2, 2024

రెండు ఐపీఎల్ మ్యాచ్‌ల రీ షెడ్యూల్

image

రెండు IPL మ్యాచ్‌లను BCCI రీ షెడ్యూల్ చేసింది. ఈ నెల 17న కోల్‌కతాలో జరగాల్సిన KKR, RR మ్యాచ్‌ను ఒక రోజు ముందుగా నిర్వహించనుంది. ఈ నెల 16న ఇది జరగనుంది. ఈ మ్యాచ్ ఒక రోజు ముందుకు జరగడంతో ఈ నెల 16న GT, DC మధ్య జరగాల్సిన మ్యాచ్‌ రీషెడ్యూల్ అయింది. దీనిని ఈ నెల 17న నిర్వహించనున్నారు. కాగా శ్రీరామ నవమి సందర్భంగా మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని బెంగాల్ పోలీసులు తెలపడంతో BCCI మ్యాచ్ తేదీలు మార్చింది.

News April 2, 2024

మేడిగడ్డ కాళేశ్వరానికి వెన్నెముక: సీఎం రేవంత్

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేడిగడ్డ బ్యారేజీ కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నెముక వంటిది. వెన్నెముక విరిగితే మనిషి పని చేయలేడు. మేడిగడ్డ పరిస్థితి కూడా అంతే. అక్కడి నుంచి నీళ్లు కిందికి వదిలింది కేసీఆర్ ప్రభుత్వమే. మిగతా పిల్లర్లకు ప్రమాదమని, నీళ్లు వదలాలని కేంద్ర బృందం చెప్పింది. అన్నారం, సుందిళ్ల కూడా ప్రమాదంలో ఉన్నాయని తెలిపింది’ అని చెప్పారు.

News April 2, 2024

BREAKNG: ఏపీలో ఉన్నతాధికారుల బదిలీ.. ఈసీ కీలక నిర్ణయం

image

AP: రాష్ట్రంలో పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రకాశం(పరమేశ్వర్), పల్నాడు(రవిశంకర్ రెడ్డి), చిత్తూరు(జాషువా), అనంతపురం(అన్బురాజన్), నెల్లూరు(తిరుమలేశ్వర్) ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుని బదిలీ చేసింది. అలాగే ముగ్గురు ఐఏఎస్‌లు, ఐదుగురు ఎస్పీలపైనా చర్యలు తీసుకుంది. వారిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News April 2, 2024

ఎన్‌కౌంటర్‌: 9 మంది మావోయిస్టులు మృతి

image

ఆంధ్రా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 9కి చేరింది. గంగాలూరు పీఎస్ పరిధిలో మావోయిస్టుల కదలికలపై భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 9 మంది మావోయిస్టులు మరణించారు. తుపాకులతో పాటు భారీ ఎత్తున ఆటోమెటిక్ వెపన్స్ సీజ్ చేశారు.

News April 2, 2024

పుష్ప-2 టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

image

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘పుష్ప-2’ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ బర్త్ డే సందర్భంగా టీజర్‌ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ మాస్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక పుష్ప-2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న విడుదల కానుంది.

News April 2, 2024

హ్యాట్రిక్ వికెట్లు తీసిన బంగ్లాదేశ్ ప్లేయర్..

image

మహిళల క్రికెట్‌లో ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో బంగ్లాదేశ్ ప్లేయర్ ఫరీహా ఇస్లామ్ త్రిస్న హ్యాట్రిక్ సాధించారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 4, 5, 6 బంతులకు వికెట్లు తీశారు. మొత్తంగా 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు. కెరీర్‌లో ఆమెకు ఇది రెండో హ్యాట్రిక్ కావడం విశేషం. ఆసీస్ 161/8 స్కోర్ చేయగా, ఛేజింగ్‌లో బంగ్లా బ్యాటర్లు చేతులెత్తేశారు. 20 ఓవర్లలో 103/9 స్కోర్ చేసి జట్టు ఓడిపోయింది.

News April 2, 2024

కశ్మీర్ లోయ ఓట్లు ఎవరికో? – 1/3

image

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో జరగనున్న తొలి లోక్‌సభ ఎన్నికలు కావడంతో అక్కడి ప్రజల తీర్పుపై ఆసక్తి నెలకొంది. జమ్మూలో పట్టు సాధించిన BJP కశ్మీర్‌లోనూ ఖాతా తెరవాలనుకుంటోంది. గుజ్జర్లు, ST వర్గంలో చేర్చినందుకు పహారీలు తమకు అనుకూలంగా ఓటు వేస్తారనేది బీజేపీ అంచనా. అనంత్‌నాగ్ నియోజకవర్గంలోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో వీరి ఓటు బ్యాంక్ ఎక్కువ. బారాముల్లాలో సైతం వీరి ఓటు బ్యాంక్ ఉంది.
<<-se>>#Elections2024<<>>

News April 2, 2024

కశ్మీర్ లోయ ఓట్లు ఎవరికో? – 2/3

image

ఇక శ్రీనగర్‌లో ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాలు నేషనల్ కాన్ఫరెన్స్ గుప్పిట్లో ఉన్నాయి. ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని ఈ పార్టీ మరోసారి ఇక్కడ గెలవాలని భావిస్తోంది. ఇండియా కూటమిలో NC, PDP భాగమైనా.. సీట్ల పంపిణీకి NC ససేమిరా అంటోంది. అనంతనాగ్ సీటు పీడీపీకి కేటాయించాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించి ఒంటరి పోరుకు సిద్ధమైంది.
<<-se>>#Elections2024<<>>

News April 2, 2024

కశ్మీర్ లోయ ఓట్లు ఎవరికో? – 3/3

image

ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో పీడీపీ ఒంటరి పోరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ NC, PDPలు… సమర్థిస్తూ BJP కశ్మీర్‌లో పోటీకి దిగనున్నాయి. మరోవైపు జమ్మూలో ఈసారి గెలిచి తీరాలని కాంగ్రెస్ భావిస్తోంది. లద్ధాక్‌లో స్థానికుల నిరసన ఎన్నికలపై ప్రభావం చూపించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్ రైట్స్‌పై స్థానికులు పోరాడుతున్నారు.
<<-se>>#Elections2024<<>>

News April 2, 2024

ఆ సక్సెస్‌ను ఉపయోగించుకోలేకపోయా: జగపతిబాబు

image

లెజెండ్ సినిమా తర్వాత విలన్ పాత్రలకు కేరాఫ్‌గా మారారు జగపతిబాబు. అయితే, ఆ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను తాను సద్వినియోగం చేసుకోలేకపోయానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా పేరు అనౌన్స్ చేసినప్పుడు జగపతిబాబు విలన్ ఏంటి అన్నారు చాలామంది. ఆ సినిమా విజయం నాకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే, సక్సెస్‌ను సరిగ్గా వాడుకోలేకపోయాను. ఆ తర్వాత కొన్ని మంచి పాత్రలు మాత్రమే చేయగలిగాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.