India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఏప్రిల్, మే, జూన్ నెల పింఛన్లను సచివాలయల వద్దే పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారుల బయోమెట్రిక్, ఐరిస్, ఆధార్ కార్డు ద్వారా సచివాలయ ఉద్యోగులు నగదు అందిస్తారని సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డి తెలిపారు. ఇవి విఫలమైతే రియల్ టైం బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ సిస్టం ద్వారా అందిస్తారని చెప్పారు. వాలంటీర్లు ఎన్నికలు పూర్తయ్యే వరకు పింఛన్ల పంపిణీలో పాల్గొనకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కుల, మతాలు, ఆర్థిక స్థితిగతులు వివాహాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. 30-35 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కావట్లేదు. అబ్బాయికి నెలకు రూ.లక్షల జీతం వస్తున్నా.. కుటుంబ ఆస్తులు లేవని అమ్మాయిలు తిరస్కరిస్తున్నారట. మెడిసిన్ చదివిన అబ్బాయిలు తక్కువగా ఉండటంతో MBBS, MD చదివిన అమ్మాయిలకు వివాహాలు ఆలస్యమవుతున్నాయి. ఒకే రంగంలో ఉద్యోగం చేస్తున్నవారినే భాగస్వామిని చేసుకోవాలనే కోరికా వివాహాలపై ప్రభావం చూపుతోంది.
మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ-1000 టోర్నీ ఛాంపియన్‌గా అమెరికా టెన్నిస్ ప్లేయర్ డానియల్ కోలిన్స్ నిలిచింది. ఫ్లోరిడాలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినాపై విజయం సాధించింది. దీంతో ఆమెకు రూ.9 కోట్ల 16లక్షల ప్రైజ్‌మనీతో పాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కాగా ఈ ఏడాది ఆమె ఆటకు వీడ్కోలు పలకనున్నారు.
తెలంగాణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ‘ఆపద మిత్ర’లకు శిక్షణ ఇస్తున్నట్లు విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల విభాగం DG నాగిరెడ్డి తెలిపారు. స్థానికుల్లో కొందరిని వలంటీర్లుగా తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినపుడు తీసుకోవాల్సిన చర్యలపై వీరికి శిక్షణ ఇస్తున్నామని.. త్వరలోనే క్షేత్ర స్థాయిలోకి వస్తారని చెప్పారు. ఫైర్ సిబ్బందికి మంటలార్పే సమయంలో వీరు సహాయకులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో హీరో నాగచైతన్య ఓ సినిమా చేయనున్నారు. ఇందులో చైతూ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2014లో విడుదలైన ఒక లైలా కోసం సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. దాదాపు పదేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కాగా ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ చిత్ర షూటింగ్‌లో చైతూ బిజీగా ఉన్నారు.
AP: శ్రీశైల మహాక్షేత్రంలో ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు ఏటా పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. దీంతో దేవస్థానం బోర్డు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే చలువ పందిళ్లు ఏర్పాటు చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. పార్కింగ్, శౌచాలయం, మంచినీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ మూవీ కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఈ సినిమా రెండో రోజు బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టింది. ఓవరాల్‌గా తొలి రెండు రోజుల్లో రూ.45.3 కోట్లు కొల్లగొట్టింది. వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. డైరెక్టర్ మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ మూవీకి భీమ్స్ మ్యూజిక్ అందించారు.
తనను ఎంపీగా గెలిపిస్తే పేదలకు విదేశీ మద్యం ఇస్తానని ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి హామీ ఇచ్చారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో వనితా రౌత్ అనే ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థి ఈ వినూత్న ప్రచారం చేస్తున్నారు. సబ్సిడీ ధరలకు బీరు, విస్కీ ఇస్తానని చెప్పారు. ప్రతీ గ్రామంలో ఎంపీ నిధులతో విదేశీ మద్యం, బీర్లతో బార్ ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. పేదలకు ఒకే ఒక విలాసం మద్యం తాగడమని.. అందుకే వారికి ఈ పథకం అవసరమన్నారు.
ప్రభుత్వంపై తమిళనాడు రైతులకు ఉన్న ఆగ్రహం 1996లో ఎన్నికల సంఘానికి పెద్ద పని పెట్టింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టగా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఆ ఏడాది ఎన్నికల్లో ఈరోడ్ MP స్థానానికి 1,033 నామినేషన్లు వేశారు. పత్రికల మాదిరి అభ్యర్థుల పేర్లతో బ్యాలెట్ పుస్తకాలు ముద్రించాల్సి వచ్చింది. ఈ ఘటనతో సెక్యూరిటీ డిపాజిట్‌ని రూ.500 నుంచి రూ.10 వేలకు EC పెంచింది.
#ELECTIONS2024
AP: వాలంటీర్ వ్యవస్థను చూసి చంద్రబాబు భయపడిపోతున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. టీడీపీకి పెన్షనర్ల ఓట్లు పోవడం ఖాయమని చెప్పారు. ‘ఈసీకి ఫిర్యాదులు చేసి పెన్షన్లు ఆపింది టీడీపీ నేతలే. ఇప్పుడు త్వరగా ఇవ్వాలంటూ గొడవలు చేస్తోంది వాళ్లే. వృద్ధులు మూడు నెలల పాటు సచివాలయంకి వెళ్లి పెన్షన్లు తీసుకునేలా చంద్రబాబు చేశారు. ప్రజలకు, సచివాలయం సిబ్బందికి క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.