India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు జగన్ పాలన చేస్తారని జోస్యం చెప్పారు. సీఎం ఆదేశాలతో ఇకపై ఎలాంటి ఉద్యమాలు ఉండవన్నారు. పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజలు జనసేన పార్టీని ప్యాక్ చేస్తారన్నారు. పవన్ కంటే చిరంజీవి చాలా బెటర్ అని అన్నారు.
TG: ఇటీవల 11,062 పోస్టులతో విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరీక్షకు సన్నద్ధమయ్యే BC అభ్యర్థులకు పుస్తకాల కోసం బీసీ స్టడీ సర్కిల్ రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10వేల మందికి లబ్ధి చేకూరనుంది. దీనికోసం <
ఇజ్రాయెల్-గాజాల మధ్య యుద్ధం ఆరు నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ కాల్పుల్లో గాజా స్ట్రిప్‌లో 32,552 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 62 మంది పాలస్తీనియన్లు చనిపోయారని, 91 మందికి గాయాలయ్యాయని తెలిపింది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ దాడికి ప్రతీకారంగా చేసిన ప్రతిదాడిలో అప్పుడు 1200 మంది చనిపోయారు.
ఈ ఆర్థిక ఏడాది డీజిల్ ఎగుమతులతో భారత్‌కు వచ్చే ఆదాయం అంతకుముందుతో పోలిస్తే 25శాతం క్షీణించినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో 11 నెలల్లో (APR-FEB) వచ్చిన మొత్తం $20 బిలియన్లకు పరిమితమైంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో అంతకుముందుతో పోలిస్తే డీజిల్ ఎగుమతి 25.8 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 26mmtకి పెరిగినా ఫలితం లేకపోయింది. మరోవైపు పెట్రోల్ ఎగుమతుల ఆదాయం సైతం 13% క్షీణించి $10 బిలియన్లుగా నమోదైంది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో BRSలో కీలకంగా ఉన్న నాయకులు సైతం ఇతర పార్టీలకు జై కొడుతున్నారు. ఫిరాయింపులు నచ్చకపోయినా వారి పిల్లల కోసమే పార్టీ వీడుతున్నారట. కుమార్తె కావ్య కోసం కడియం శ్రీహరి, కూతురు విజయలక్ష్మి కోసం కేకే, తనయుడు భరత్ కోసం పోతుగంటి రాములు పార్టీని వీడారు. అయితే, కాంగ్రెస్‌ని వీడకుండా అంటిపెట్టుకున్న జానారెడ్డి విజయం సాధించారు. తన వారసుల్లో ఒకరిని MLA చేయగా.. మరొకరికి MP సీటు లభించింది.
పురుషులలో ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇది మూత్రాశయం, సమీప అవయవాలకు వ్యాపిస్తుంది. దీనిని కొన్ని లక్షణాల ద్వారా ముందుగా గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. మూత్ర ప్రవాహంలో ఇబ్బందులు, రాత్రి వేళల్లో ఎక్కువగా యూరిన్ రావడం, యూరినేషన్ సమయంలో నొప్పి, మూత్రంలో రక్తం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వ్యాధి తీవ్రమైన వారి కాళ్లలో వాపు కనిపిస్తుందట.
TG: మాజీ సీఎం కేసీఆర్ చేసిన పాపాల వల్లే ఈ కరవు వచ్చిందని కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన చేసిన పాపాలే తనకు చుట్టుకున్నాయని ఆరోపించారు. యాదగిరిగుట్ట పేరు మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పు అని కోమటిరెడ్డి అన్నారు. దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారని మంత్రి మండిపడ్డారు.
MI కెప్టెన్‌ను మార్చడంతో హార్దిక్‌పై రోహిత్ ఫ్యాన్స్ ద్వేషాన్ని పెంచుకున్నారు. ఈక్రమంలో నటుడు సోనూసూద్ ఫ్యాన్స్‌కు పలు సూచనలు చేశారు. ‘మన దేశాన్ని గర్వపడేలా చేసిన ఆటగాళ్లను మనం గౌరవించాలి. ప్రతి భారత క్రికెటర్‌ని నేను ప్రేమిస్తున్నాను. ప్లేయర్ ఏ ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్నాడన్నది ముఖ్యం కాదు. కెప్టెన్‌గా ఆడినా 15వ ప్లేయర్ అయినా సరే. వారే మన హీరోలు’ అని ట్వీట్ చేశారు.
ఇవాళ RCB, కేకేఆర్ మధ్య బెంగళూరు చిన్నస్వామి వేదికగా మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రెండు జట్ల మధ్య గతంలో జరిగిన మ్యాచుల గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. IPLలోనే అత్యంత తక్కువ పరుగులు చేసిన జట్టుగా ఆర్సీబీ(49) KKRపై చెత్త రికార్డును మూటగట్టుకుంది. మరోవైపు సొంత మైదానంలో KKRపై 2015 తర్వాత విజయం సాధించలేకపోయింది. మరి ఈ మ్యాచులో గెలిచి పరాజయాలకు బ్రేక్ వేస్తుందో లేదో చూడాలి.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించి కేంద్రం నుంచి జర్మనీ, అమెరికాలు విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి ఐక్యరాజ్య సమితి చేరింది. ‘భారత్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పౌర హక్కులకు భంగం కలగకుండా స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని ఆశిస్తున్నాము’ అని UN పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో రాజకీయ అనిశ్చితి నెలకొంటుందా? అనే ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చింది.
Sorry, no posts matched your criteria.