News March 28, 2024

సీఎం సహా ఐదుగురు ఏకగ్రీవం!

image

అరుణాచల్‌ప్రదేశ్‌లో సీఎం పెమా ఖండూతో పాటు మరో నలుగురు BJP ఎమ్మెల్యే అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నిన్నటితో నామినేషన్ల పర్వం ముగియగా ఆయా స్థానాల్లో BJP నేతలు మినహా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం వారి ఎన్నికను ఈసీ అధికారికంగా ప్రకటించనుంది. 60 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఆ రాష్ట్రంలో ఏప్రిల్ 19న 55 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరగనుంది.

News March 28, 2024

2019లో భారీ మెజార్టీ.. ఇప్పుడు ఆత్మహత్య

image

తమిళనాడులోని ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి(77) <<12940065>>ఆత్మహత్య<<>> ఆ రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 2019 ఎన్నికల్లో ఆయన DMK నుంచి పోటీ చేసి 2.10 లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగు మందు తాగారు. నాలుగు రోజులుగా ప్రాణాలతో పోరాటం చేసి ఇవాళ గుండె పోటుతో తుది శ్వాస విడిచారు. వివాద రహితుడు, సౌమ్యుడిగా ఆయనకు పేరుంది.

News March 28, 2024

పెళ్లింట ఘోర విషాదం

image

TS: రోడ్డు ప్రమాదం పెళ్లింట విషాదం నింపింది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మాన్సాన్‌పల్లిలో నిన్న పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మరణించారు. బంధువులు ప్రమాదంలో చనిపోవడంతో పెళ్లి నిలిచిపోయింది. పెళ్లి ఆగిందన్న మనస్తాపంతో వరుడి తాత పెంటయ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 28, 2024

రూ.7.50 లక్షల కోట్ల అప్పునకు కేంద్రం ప్రణాళికలు

image

APR-SEPలో సెక్యూరిటీ బాండ్ల ద్వారా భారీగా రుణ సమీకరణకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2024-25కు స్థూల మార్కెట్ రుణ అంచనాలు ₹14.13 లక్షల కోట్లు కాగా, తొలి 6 నెలలకు అందులో 53% లేదా ₹7.50 లక్షల కోట్లు తీసుకోనుంది. రెవెన్యూ లోటును పూడ్చడం, ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 3, 5, 7, 10, 15, 30, 40, 50 ఏళ్ల కాలపరిమితితో నిధులు సమీకరించనున్నట్లు పేర్కొన్నారు.

News March 28, 2024

కంగనాపై కామెంట్స్.. ఎంపీ టికెట్ కోల్పోయిన సుప్రియ

image

కంగనా రనౌత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుప్రియా శ్రీనతేకు కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. అభ్యర్థుల లిస్టు నుంచి ఆమె పేరును తొలగించింది. ఆమె స్థానంలో మహారాజ్‌గంజ్(UP) టికెట్‌ను వీరేంద్ర చౌదరికి కేటాయించింది. కంగనాకు BJP MP టికెట్ ప్రకటించిన అనంతరం, ఆమెను వేశ్యగా పేర్కొంటూ సుప్రియ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత డిలీట్ చేశారు. దీనిపై ఆమెకు ఈసీ నోటీసులిచ్చింది.

News March 28, 2024

‘న్యాయవ్యవస్థపై దుష్ప్రచారం’.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ

image

న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కోల్పోయేలా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని 600 మంది లాయర్లు సంయుక్తంగా CJI జస్టిస్ చంద్రచూడ్‌కు లేఖ రాశారు. ‘ముఖ్యంగా పొలిటికల్ కేసుల్లో న్యాయవ్యవస్థపై కొందరు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పటి న్యాయవ్యవస్థ బాగుండేదని దుష్ప్రచారం చేస్తుంటే దానికి కొందరు లాయర్లు వంతపాడటం బాధాకరం. వీరిపై సుప్రీంకోర్టు కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.

News March 28, 2024

NIA డైరెక్టర్ జనరల్‌గా సదానంద్ దాతె

image

మహారాష్ట్ర ఆంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ సదానంద్ వసంత్ దాతెను NIA డైరెక్టర్‌గా కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న దినకర్ గుప్తా ఈనెల 31న రిటైర్ కానున్నారు. ఆయన స్థానాన్ని భర్తీ చేయనున్న వసంత్ 2026 డిసెంబర్ 31 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. 26/11 ముంబై పేలుళ్ల ఘటనలో కీలక ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అబు ఇస్మాయిల్‌ను ఈయనే పట్టుకున్నారు. అప్పుడు ఈయన ముంబై అడిషనల్ సీపీగా పనిచేస్తున్నారు.

News March 28, 2024

ఇటు ఆకలి కేకలు.. అటు ఆహార వృథా

image

ప్రపంచవ్యాప్తంగా 2022లో 1.5 బిలియన్ టన్నుల ఆహారం వృథా అయ్యిందని UNEP ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. అందుబాటులో ఉన్న మొత్తం ఆహారంలో ఇది ఐదో వంతు అని తెలిపింది. ఫుడ్ వేస్టేజ్ కారణంగా $1 ట్రిలియన్ నష్టపోయినట్లు పేర్కొంది. మరోవైపు 78.3 కోట్ల మంది ఆకలితో బాధపడుతున్నారని వెల్లడించింది. ప్రపంచంలో ఒక్కో వ్యక్తి సగటున ఏడాదికి 79 కేజీలు, ఇండియాలో 55 కేజీలు వృథా చేస్తున్నారట.

News March 28, 2024

NET స్కోరుతో PhD ప్రవేశాలు: UGC ఛైర్మన్

image

2024-25 విద్యాసంవత్సరం నుంచి NET స్కోరుతో PhD ప్రవేశాలు కల్పించవచ్చని యూనివర్సిటీలకు యూజీసీ సూచించింది. PhD ప్రవేశ పరీక్షల స్థానంలో నెట్ స్కోరును పరిగణించవచ్చని పేర్కొంది. జూన్ 2024 సెషన్‌కు సంబంధించిన NET దరఖాస్తు ప్రక్రియను వచ్చే వారంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ వెల్లడించారు.

News March 28, 2024

అప్పుడు వార్నర్.. ఇప్పుడు క్లాసెన్

image

క్లాసెన్.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ ప్లేయర్. IPLలో చాలా సీజన్ల పాటు అలరించిన వార్నర్‌ను SRH వదులుకోవడంతో అలాంటి ఆటగాడి కోసం అభిమానులు ఎదురుచూశారు. వారి ఆశలను నెరవేరుస్తూ తాను ఉన్నానంటూ క్లాసెన్ ముందుకొచ్చారు. ఎవరు ఆడినా, ఆడకున్నా తాను మాత్రం అద్భుతమైన షాట్లతో భారీ స్కోర్లు చేస్తున్నారు. గత సీజన్లోనూ ఒంటరి పోరాటం చేశారు. ప్రస్తుతం టీ20ల్లో తానే బెస్ట్ ప్లేయర్‌నని నిరూపించుకుంటున్నారు.