News March 23, 2024

నన్ను కలవాలంటే గంటకు ₹5 లక్షలు ఇవ్వాలి: డైరెక్టర్

image

ఇక నుంచి ఎవరైనా తనను కలవాలనుకుంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తెలిపారు. ఇప్పటికే చాలా టైమ్ వృథా చేశానని, కొత్త వ్యక్తుల్ని కలవడానికి తన దగ్గర టైమ్ లేదని ఆయన తన ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నారు. తనను కలవాలంటే అరగంటకు ₹2లక్షలు, గంటకు ₹5 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని, లేదంటే తనకు కాల్స్, మెసేజెస్ చేయొద్దని రాసుకొచ్చారు. షార్ట్ కట్స్ వెతుక్కునే వారంటే తనకు నచ్చదని చెప్పారు.

News March 23, 2024

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

image

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
DC: వార్నర్, మార్ష్, హోప్, పంత్ (C), స్టబ్స్, రికీ భుయ్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.
PBKS: శిఖర్ ధవన్(C), బెయిర్‌స్టో, జితేశ్ శర్మ, లివింగ్‌స్టోన్, సామ్ కరన్, శశాంక్‌సింగ్, రబాడ, అర్ష్‌దీప్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్.

News March 23, 2024

ఎక్సర్‌సైజ్ పిల్ వచ్చేస్తోంది!

image

ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నా కొందరు బద్ధకిస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఎక్స‌ర్‌సైజ్ పిల్ వచ్చేస్తోంది. వ్యాయామం చేస్తే కలిగే లాభాలు ఈ ఒక్క మాత్రలో ఉంటాయట. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉంది. ఎలుకలపై వీటిని పరీక్షించినప్పుడు వ్యాయమం చేశాక ఉండే జీవక్రియనే వాటిలో గుర్తించారట. ఇది సక్సెస్ అయితే గుండె, నరాల సంబంధింత వ్యాధుల చికిత్సలో ముందడుగు పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

News March 23, 2024

రూ.200, రూ.500 నోట్లను రద్దు చేయాలి: చంద్రబాబు

image

AP: పెద్ద నోట్లను రద్దు చేయాలనేది తన ఆలోచనేనని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. రూ.200, రూ.500 నోట్లను కూడా రద్దు చేసే పరిస్థితి రావాలన్నారు. వైసీపీ లాంటి పార్టీల కట్టడికి డిజిటల్ కరెన్సీ అవసరమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సంపదనంతా వైసీపీ నేతలు హవాలా రూపంలో విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం, దేశం కోసమే జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు.

News March 23, 2024

‘జిల్’ కాంబో రిపీట్?

image

రాధాకృష్ణ డైరెక్షన్‌లో గోపీచంద్ మరో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. అతను వినిపించిన స్టోరీ లైన్‌కు హీరో ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుందని టాలీవుడ్ టాక్. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుందట. వీరిద్దరి కాంబోలో 2015లో వచ్చిన ‘జిల్’ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత డైరెక్టర్.. ప్రభాస్‌తో చేసిన రాధేశ్యామ్ డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

News March 23, 2024

56 ఏళ్లు కడుపులో పిండాన్ని మోశారు..

image

బ్రెజిల్‌లో అరుదైన ఘటన జరిగింది. డానియెలా వెరా(81) అనే మహిళ తన కడుపులో 56 ఏళ్లుగా చనిపోయిన పిండాన్ని మోశారు. ఈ పరిస్థితిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఆమె ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చినప్పటికీ కడుపులోని పిండాన్ని డాక్టర్లు కూడా గుర్తించలేకపోయారు. ఇటీవల తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లగా, 3D స్కాన్‌లో పిండం గురించి తెలిసింది. ఆపరేషన్ చేసి దాన్ని తీసేయగా, మరుసటి రోజే ఆమె మరణించారు.

News March 23, 2024

సినీ నటులకు మించిన క్రేజ్ సీఎం జగన్ సొంతం: మంత్రి రోజా

image

AP: టీడీపీ నేతలకే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టికెట్లు ఇస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. మరోవైపు ఎన్నో ఏళ్లుగా టీడీపీ జెండా మోసిన వాళ్లకు చంద్రబాబు సీటు ఇవ్వలేదని దుయ్యబట్టారు. 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా అనేక హామీలు ఇచ్చి ఆయన ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సినీ నటులకు లేని క్రేజ్ జగన్‌కు ఉందని చెప్పారు.

News March 23, 2024

ఒకే ఫ్రేమ్‌లో రవీంద్ర స్క్వేర్

image

రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ఆడుతున్న ఇరువురూ ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం ఫొటోకు పోజులిచ్చారు. నిన్నటి మ్యాచ్‌లో ఈ ఇద్దరు ప్లేయర్లు సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించారు. 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసిన రచిన్ చెన్నై టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 25* రన్స్‌తో జడేజా జట్టును విజయతీరాలకు చేర్చారు.

News March 23, 2024

ప్రచారానికి సిద్ధమవుతున్న రథాలు

image

ఎన్నికల పర్వంలో ప్రచార రథాలదే కీలక పాత్ర. ప్రతి ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ఇవి లేకుంటే ప్రచారం ముందుకు సాగదు. పోలింగ్ తేదీకి మరో 50 రోజులే ఉండటంతో ఆయా పార్టీల నేతలు ప్రచార రథాలను ఆధునిక హంగులతో తయారు చేయించుకుంటున్నారు. ముఖ్య నేతల చిత్రాలతో పాటు అభ్యర్థి కూడా కనిపించే విధంగా సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే నెల మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఆయా పార్టీల ప్రచారాలు హోరెత్తనున్నాయి.

News March 23, 2024

టెట్ ఫీజు భారీగా పెంపు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం టెట్ ఫీజును భారీగా పెంచింది. ఒక్కో పేపర్ ఫీజును రూ.1,000గా ప్రకటించింది. రెండు పేపర్లు రాసేవారు రూ.2,000 చెల్లించాలి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు https://schooledu.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మే 15 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.