News March 24, 2024

జనసేన గ్లాసు గుర్తు ఆకారంలో పెళ్లి పత్రిక

image

AP: పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు జనసేన పార్టీ గుర్తు ‘గాజు గ్లాసు’ ఆకారంలో పెళ్లి పత్రికను ముద్రించుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామానికి చెందిన అడబాల నాగేశ్వరరావు పవన్‌పై తనకున్న అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు. ఆ శుభలేఖపై పవన్ కళ్యాణ్, చిరంజీవి ఫొటోలను ప్రింట్ చేయించాడు. దీంతో ఈ వెడ్డింగ్ కార్డు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

News March 24, 2024

ట్రేడ్ చేసిన రోజే అకౌంట్లలోకి డబ్బులు

image

ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేస్తే మరుసటి రోజు(T+1) సెటిల్‌మెంట్ జరుగుతోంది. ఇకపై ట్రేడ్ జరిగిన రోజే(T+0) సాయంత్రం 4.30లోపు సెటిల్‌మెంట్ చేసేందుకు సెబీ సిద్ధమవుతోంది. ఈ నెల 28న కొత్త బీటా వర్షన్‌ను ఆవిష్కరించనుంది. 6 నెలలపాటు కేవలం 25 షేర్లు, పరిమిత సంఖ్యలో బ్రోకర్లకు ఈ సదుపాయాన్ని పరీక్షిస్తుంది. ఫలితాలను బట్టి పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురానుంది.

News March 24, 2024

ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

AP: పేద పిల్లలకు ప్రైవేటు, అన్‌ఎయిడెడ్ స్కూళ్లలో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు అధికారులు పొడిగించారు. నిన్నటికి 47,082 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు సమీపంలోని సచివాలయం, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం 18004258599 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

News March 24, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి నోటీసులు

image

TG: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులకు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌తో పాటు ఓ ఛానల్ ఎండీకి నోటీసులు ఇచ్చారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టు అయిన తర్వాత వీరు విదేశాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

News March 24, 2024

HYDలో ఆఫీస్ స్పేస్‌కు భారీ డిమాండ్

image

దేశంలోని 6 ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ జనవరి-మార్చి త్రైమాసికంలో 35 శాతం పెరిగే అవకాశం ఉందని ‘కొలియర్స్ ఇండియా’ అంచనా వేసింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై, పుణెలో 1.36 కోట్ల చదరపు అడుగుల స్థలం లీజుకు వెళ్లనుందని చెప్పింది. HYDలో వృద్ధి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. గత ఏడాది జనవరి-మార్చిలో 13 లక్షల చ.అ. స్థలం లీజుకు వెళ్లగా, ఈ ఏడాది 29 లక్షల చ.అ.లకు పెరగొచ్చని పేర్కొంది.

News March 24, 2024

70 శాతం మంది పిల్లలకు డిజిటల్ అడిక్షన్ ముప్పు

image

స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల వినియోగం పిల్లల్లో పెరిగిపోతోంది. 5-16 ఏళ్ల పిల్లల్లో 60 శాతం మంది డిజిటల్ అడిక్షన్‌ బారిన పడే అవకాశం ఉన్నట్లు స్మార్ట్ పేరెంట్ సొల్యూషన్ కంపెనీ అధ్యయనంలో తేలింది. 70-80 శాతం మంది చిన్నారులు నిర్దేశిత స్క్రీన్ సమయాన్ని మించి ఉపయోగిస్తున్నారు. వీరిని కంట్రోల్ చేయడానికి 85 శాతం మంది పేరెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. కేవలం 10 శాతం మంది మాత్రమే నియంత్రించగలుగుతున్నారు.

News March 24, 2024

మాజీ సైనికులకు బీబీనగర్ ఎయిమ్స్‌లో నగదు రహిత వైద్యం

image

దేశ రక్షణ కోసం పోరాడిన తెలుగు రాష్ట్రాల్లోని మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లోని బీబీనగర్ ఎయిమ్స్ ముందుకొచ్చింది. తాజాగా ఎక్స్ సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్‌(ECHS)తో ఒప్పందం చేసుకుంది. ఇకపై నగదు అవసరం లేకుండా అన్నిరకాల వైద్య పరీక్షలు, ఆపరేషన్లను చేయనుంది. దీంతో దాదాపు 90వేల మందికి లబ్ధి చేకూరనుంది.

News March 24, 2024

మూడోసారి ప్రధాని ప్రత్యర్థిగా అజయ్‌రాయ్

image

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీపై వారణాసి నుంచి యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ పోటీ చేయనున్నారు. ఈయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వారణాసి నుంచి 2009లో SP, 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు. మోదీని మూడోసారి ఢీకొట్టబోతున్నారు. ఎస్పీ, ఆప్‌తో పొత్తు ఉండటం కలిసొస్తుందని ఆయన భావిస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News March 24, 2024

జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం సులభమేనా?

image

ఢిల్లీ CM కేజ్రీవాల్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జైలులో ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో సీఎం నేరుగా పాల్గొనడం సాధ్యం కాదని అంటున్నారు. ప్రభుత్వ పనితీరును సమీక్షించడం, ఫైళ్లను తనిఖీ చేయడం సులభం కాదని, ఆయనను కలవాల్సినప్పుడల్లా కోర్టు అనుమతి ఉండాలని చెబుతున్నారు. పాలకుడు ప్రజల్లోనే ఉండాలని, కేజ్రీవాల్ మరొకరిని సీఎంగా నామినేట్ చేయాలని సూచిస్తున్నారు.

News March 24, 2024

రూ.కోట్లు కుమ్మరిస్తే.. ఆటలో తేలిపోయారు

image

IPL వేలంలో అత్యధిక <<12908684>>రేటు<<>> పలికిన ఆసీస్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్(KKR), పాట్‌ కమిన్స్‌(SRH) తొలి మ్యాచ్‌లో విఫలమయ్యారు. స్టార్క్ 4 ఓవర్లలో వికెట్ తీయకుండా 53 రన్స్, కమిన్స్ 4 ఓవర్లలో ఒక వికెట్ తీసి 32 పరుగులు ఇచ్చుకున్నారు. బ్యాటింగ్‌లో చివరి బంతికి 5 రన్స్ చేయాల్సినప్పుడు కమిన్స్ షాట్ ఆడలేకపోయారు. IPLలో రూ.కోట్ల వీరులు తేలిపోతారనే ఆనవాయితీని వీరు కొనసాగించారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.