News April 11, 2025

ALERT.. రేపు వర్షాలు, వడగాలులు

image

AP: రాష్ట్రంలో రేపు విజయనగరం, SKLM, మన్యం, అల్లూరి, VZG, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, TPTY జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA హెచ్చరించింది. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, NTR, బాపట్ల, పల్నాడులోని 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

News April 10, 2025

జగన్ నుంచి రాష్ట్రానికి భద్రత కావాలి: నిమ్మల

image

AP: వైసీపీ చీఫ్ జగన్‌కు మరింత భద్రత కేటాయించాలన్న ఎమ్మెల్సీ బొత్స వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల రామనాయుడు కౌంటర్ ఇచ్చారు. నేర స్వభావం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎవరికి భద్రత కావాలని ప్రశ్నించారు. భద్రత జగన్‌కు కాదని, ఆయన నుంచి రాష్ట్రానికి, ప్రజలకు కావాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం చంద్రబాబు సైతం తన పర్యటనల్లో సెక్యూరిటీని తగ్గించుకున్నారనే విషయాన్ని గుర్తు చేశారు.

News April 10, 2025

IPL: రుతురాజ్‌కు రీప్లేస్‌మెంట్ ఎవరు?

image

మోచేతి గాయంతో IPL 18వ సీజన్ మొత్తానికి దూరమైన రుతురాజ్ స్థానంలో CSK ఎవరిని తీసుకుంటుందనే దానిపై చర్చ మొదలైంది. పృథ్వీ షా, ఆయుశ్ మాత్రే, మయాంక్ అగర్వాల్‌లో ఒకరిని తీసుకోవచ్చని నేషనల్ మీడియా పేర్కొంది. పృథ్వీ, మయాంక్‌కు ఇప్పటికే IPLలో చాలా సీజన్లు ఆడిన అనుభవం ఉంది. మరోవైపు ముంబైకి చెందిన 17 ఏళ్ల ఆయుశ్ ఇటీవల దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటి అందరి దృష్టిలో పడ్డారు. మరి వీరిలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో?

News April 10, 2025

మాజీ ప్రేయసికి బుద్ధి చెప్పాలని..

image

ప్రేమలో ఉన్నప్పుడు ఆన్‌లైన్ షాపింగ్, గిఫ్ట్‌లు కావాలంటూ వేధించిన యువతికి కోల్‌కతాలో మాజీ ప్రియుడు ఊహించని షాక్ ఇచ్చాడు. నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా ఆమెకు 300 COD ఆర్డర్లు చేశాడు. విసిగిపోయిన యువతి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఇది మాజీ ప్రియుడి నిర్వాకమేనని తేల్చారు. తెలియని నంబర్ల నుంచి మెసేజులు పంపి వేధించినట్లు వెల్లడించారు. నిన్న యువకుడిని కోర్టులో ప్రవేశపెట్టగా బెయిల్ మంజూరైంది.

News April 10, 2025

TCS ఉద్యోగుల హైక్ ఆలస్యం!

image

ఈ ఏడాది ఉద్యోగుల జీతాల పెంపు ఆలస్యం అవ్వొచ్చని TCS హింట్ ఇచ్చింది. ‘పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయి. జీతాల పెంపుపై ఈ ఏడాదిలో నిర్ణయం తీసుకుంటాం. వ్యాపారాన్ని బట్టి అది ఎప్పుడైనా ఉండొచ్చు’ అని చీఫ్ HR మిలింద్ తెలిపారు. 2025 JAN-MARలో TCS కేవలం 625 మంది ఉద్యోగులను మాత్రమే చేర్చుకుంది. 2026 ఆర్థిక సంవత్సరంలోనూ ఫ్రెషర్ల నియామకాలు అంతే లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చని చెప్పారు.

News April 10, 2025

ఈనెల 14న ‘HIT-3’ ట్రైలర్

image

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘HIT-ది థర్డ్ కేస్’ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈనెల 14న ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ ద్వారా వెల్లడించారు. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. మే 1న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ అంచనాలను పెంచేసింది.

News April 10, 2025

చైనా వస్తువులపై అమెరికా టారిఫ్ 145%

image

చైనాపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు 145 శాతానికి పెరిగాయి. బుధవారం చైనా వస్తువులపై 125% సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అప్పటివరకు చైనా దిగుమతులపై అమెరికా 20% టారిఫ్ విధిస్తోంది. దీంతో ఆ రెండు కలిపి అది 145 శాతానికి పెరిగింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు 70 దేశాలపై విధించిన సుంకాలను ట్రంప్ 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.

News April 10, 2025

ప్రపంచంలో తొలిసారి.. AI సాయంతో శిశువు జననం

image

ఏఐ అసిస్టెడ్ IVF విధానంలో ప్రపంచంలో తొలి శిశువు జన్మించింది. మెక్సికోలోని హోప్ ఐవీఎఫ్ సెంటర్‌లో నిపుణుల సమక్షంలో ఓ 40 ఏళ్ల మహిళ మగబిడ్డకు జన్మనిచ్చారు. అండంలోకి స్పెర్మ్‌ను నేరుగా ఇంజెక్ట్ చేసే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ICSI)కు బదులు ఆటోమేటెడ్ IVF సిస్టమ్‌ను ఉపయోగించారు. దీని ద్వారా ICSI ప్రక్రియలోని 23 దశలు మనిషి సాయం లేకుండానే పూర్తయ్యాయి. ఈ ప్రక్రియకు 9min 56sec సమయం పట్టింది.

News April 10, 2025

కొత్తగా రూ.31,167 కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు

image

AP: రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఎంతముఖ్యమో ఆ పెట్టుబడులు క్షేత్ర స్థాయిలో కార్యరూపం దాల్చడమూ అంతే ముఖ్యమని CM చంద్రబాబు అన్నారు. ఏదైనా ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినప్పుడే ఆ సంస్థ ఎప్పుడు ఉత్పత్తి ప్రారంభిస్తుందనే తేదీపై స్పష్టత తీసుకోవాలని అధికారులకు సూచించారు. SIPB సమావేశంలో 17 సంస్థల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వీటితో ₹31,167cr పెట్టుబడులు, 32,633 ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు.

News April 10, 2025

3 రోజులకు రూ.25 కోట్లు.. నో చెప్పిన ప్రభాస్!

image

పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ ఉన్నా ప్రభాస్ యాడ్స్‌లో కనిపించేది చాలా తక్కువే. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బాహుబలికి ఓ బ్రాండ్ యాడ్‌లో నటించాలని ఆఫర్ వచ్చిందట. 3 రోజులు కేటాయిస్తే రూ.25 కోట్లు ఇస్తామని ఆఫర్ చేయగా ప్రభాస్ సింపుల్‌గా నో చెప్పారని సమాచారం. ప్రస్తుతం ఫౌజీ, ది రాజాసాబ్‌ చిత్రాలతో డార్లింగ్ తీరిక లేకుండా ఉన్నారు. ఆ తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2 చిత్రాల్లో నటించాల్సి ఉంది.