News April 10, 2025

జిన్‌పింగ్ చాలా స్మార్ట్: ట్రంప్

image

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చాలా తెలివిగల వారని US<<16048311>> ప్రెసిడెంట్<<>> ట్రంప్ కొనియాడారు. తన దేశం అంటే ఆయనకు చాలా ఇష్టమని, ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఆయనకు బాగా తెలుసని అన్నారు. త్వరలో జిన్‌పింగ్‌తో డీల్ కుదిరే అవకాశం ఉందని ఏ క్షణంలోనైనా ఆయన నుంచి ఫోన్ కాల్ రావచ్చన్నారు. చైనా-అమెరికా మధ్య టారిఫ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

News April 10, 2025

RR జట్టుకు బిగ్ షాక్

image

GTతో మ్యాచ్‌లో ఓటమి బాధలో ఉన్న RR ఆటగాళ్లకు IPL యాజమాన్యం షాకిచ్చింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందుకు కెప్టెన్ సంజూ శాంసన్‌కు రూ.24 లక్షల జరిమానా విధించింది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ సహా టీమ్‌లోని ప్రతి ఆటగాడు రూ.6 లక్షల చొప్పున ఫైన్ లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కట్టాలని ఆదేశించింది. ఇందులో ఏది తక్కువ ఉంటే ఆ మొత్తం వర్తిస్తుందని పేర్కొంది.

News April 10, 2025

మెగాస్టార్ ‘విశ్వంభర’ ఫస్ట్ సింగిల్ అప్డేట్

image

మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తోన్న ‘విశ్వంభర’ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈనెల 12న హనుమాన్ జయంతి సందర్భంగా ఫస్ట్ సింగిల్ ‘రామ రామ’ పాటను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

News April 10, 2025

భారీగా తగ్గనున్న హోమ్ లోన్ EMI

image

ఆర్బీఐ రెపో రేటును 6 శాతానికి తగ్గించడంతో లోన్లు తీసుకున్నవారికి ఉపశమనం కలగనుంది. ముఖ్యంగా గృహ రుణదారులకు నెలవారీ EMIలు భారీగా తగ్గనున్నాయి. ఉదాహరణకు 20 ఏళ్ల కాల వ్యవధితో రూ.30 లక్షల లోన్ ఉంటే నెలవారీ EMI రూ.26,247 నుంచి రూ.25,071కి తగ్గనుంది. ప్రతినెలా రూ.1,176, 20 ఏళ్లకు రూ.2.82 లక్షలు ఆదా కానుంది. రూ.50 లక్షలు, రూ.70 లక్షలు, రూ.కోటి. రూ.1.5 కోట్లకు ఎంత మిగులుతుందో పైన ఫొటోలో చూడొచ్చు.

News April 10, 2025

6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. BIG UPDATE

image

AP: 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దేహదారుఢ్య పరీక్షల అనంతరం ఫలితాలు ఇచ్చాం. తుది రాత పరీక్షలకు సంబంధించి కోర్టులో కేసులు ఉండటంతో ఆలస్యమైంది. నెల రోజుల్లో వాటిని కూడా నిర్వహించేందుకు ప్రయత్నిస్తాం’ అని ఆమె స్పష్టం చేశారు.

News April 10, 2025

BIG ALERT: వాట్సాప్‌లో ఇమేజ్ స్కామ్.. ఎలా చేస్తారు?

image

లింక్స్, మెసేజెస్, కాల్స్ ద్వారానే కాకుండా మరో కొత్త రకం మోసానికి సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్నారు. స్కామర్లు వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్‌ల ద్వారా ఫొటోలను పంపుతారు. ఇందులో స్టెగానోగ్రఫీ అనే టెక్నాలజీతో ప్రమాదకర లింక్‌లను యాడ్ చేస్తారు. ఫొటోలను డౌన్‌లోడ్ చేయగానే వారి ఫోన్ క్రాష్ అవుతుంది. సున్నిత సమాచారాన్ని దొంగలించి రిమోట్ యాక్సెస్ చేస్తారు. తాజాగా MPలో ఓ వ్యక్తి ఇలాగే ₹2L పోగొట్టుకున్నాడు.

News April 10, 2025

ఇమేజ్ స్కామ్.. ఎలా బయటపడొచ్చు?

image

✒ వాట్సాప్‌ సెట్టింగ్స్‌లో ఆటో డౌన్‌లోడ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేయాలి.
✒ పరిచయం లేని నంబర్ల నుంచి వచ్చే ఫొటోలు, లింక్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయొద్దు.
✒ అనుమానిత నంబర్ల కాల్స్‌కు స్పందించవద్దు. వాటిని వెంటనే బ్లాక్ చేయాలి.
✒ వాట్సాప్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి.
✒ ఒకవేళ ఫొటోలు డౌన్‌లోడ్ చేశాక ఫోన్‌లో మార్పులు కనిపిస్తే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయండి.

News April 10, 2025

ధనుష్-శేఖర్ కమ్ముల కాంబోలో మరో చిత్రం?

image

శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్ నటిస్తోన్న ‘కుబేర’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. జూన్ 20న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగానే శేఖర్ కమ్ముల మరో కథను వినిపించగా ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. కాగా కుబేరలో రష్మిక, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు.

News April 10, 2025

ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై ఫిర్యాదులు.. రీవెరిఫికేషన్?

image

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తొలివిడతలో 71 వేల మందికి ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసింది. వీరిలో అనర్హులు ఎక్కువ మంది ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే ఇళ్లు ఉన్నవారి పేర్లు జాబితాలో ఉండటం, వాళ్లు పనులు ప్రారంభించకపోవడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీంతో మరోసారి రీవెరిఫికేషన్‌కు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇచ్చిన మంజూరు పత్రాలను వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

News April 10, 2025

కాకాణిపై లుకౌట్ నోటీసులు.. ఏ క్షణమైనా అరెస్ట్!

image

AP: అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి, YCP నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. మూడుసార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు రాకపోవడంతో పోలీసులు తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాకాణి దేశం విడిచి వెళ్లిపోకుండా అన్ని ఎయిర్‌పోర్టులు, సీపోర్టుల్లో అలర్ట్ చేశారు. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో ఏ క్షణమైనా కాకాణి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది.