News March 31, 2025

వివాహితపై సామూహిక అత్యాచారం

image

TG: నాగర్ కర్నూల్ (D) ఊర్కొండ(M)లో వివాహితపై గ్యాంగ్ రేప్ జరిగింది. MBNR జిల్లాకు చెందిన ఆమె బంధువుతో కలిసి ఊర్కొండపేట ఆంజనేయస్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. కాలకృత్యాల కోసం గుట్ట ప్రాంతానికి వెళ్లగా, 8 మంది ఆ బంధువుపై దాడి చేసి అతని చేతులు, కాళ్లు కట్టేశారు. ఆ తర్వాత వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఘటనకు పాల్పడ్డ వారిని గుర్తించిన పోలీసులు, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

News March 31, 2025

ముస్లిం సోదరులకు గవర్నర్, సీఎం రంజాన్ శుభాకాంక్షలు

image

AP: రాష్ట్రంలోని ముస్లింలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, CM చంద్రబాబు, మాజీ CM జగన్ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అల్లా దయతో విజయవంతం కావాలని CM కోరారు. జకాత్ పేరుతో సాటివారిని ఆదుకునే దయా గుణం ముస్లిం వర్గంలోని మానవత్వానికి ప్రతిరూపం అన్నారు. అల్లా చూపిన మార్గంలో న‌డవాల‌ని, అంద‌రిపై ఆయన దీవెనలు ఉండాల‌ని కోరుకుంటున్నట్లు జగన్ పేర్కొన్నారు.

News March 31, 2025

గాయం నుంచి ఇంకా కోలుకోలేదు: హీరోయిన్

image

జిమ్ చేస్తూ గాయపడిన తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. గత ఏడాది చివర్లో ఆమె వెయిట్ లిఫ్ట్ చేసే క్రమంలో గాయపడ్డారు. తాను చాలా విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ కమిట్ అయిన సినిమాలను తాను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు సినిమాలకు దూరమయ్యారు.

News March 31, 2025

‘నాన్న, తమ్ముడిని బాగా చూసుకో..’ అంటూ ఆత్మహత్య

image

నిజామాబాద్(TG) విద్యార్థి రాహుల్ మాదాల చైతన్య అలహాబాద్ ఐఐఐటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి జల్వాలోని హాస్టల్ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సూసైడ్‌కు ముందు ‘నాన్న, తమ్ముడిని బాగా చూసుకో అమ్మా..’ అని తల్లికి మెసేజ్ పెట్టాడు. దివ్యాంగుడైన రాహుల్ JEE మెయిన్స్‌లో ఆలిండియా 52వ ర్యాంక్ సాధించారు.

News March 31, 2025

GOOD NEWS: తగ్గిన టోల్ ఛార్జీలు

image

హైదరాబాద్-విజయవాడ NHపై టోల్ ఛార్జీలు తగ్గాయి. ఈ అర్ధరాత్రి (ఏప్రిల్ 1) నుంచి తగ్గిన రుసుములు అమల్లోకి రానున్నాయి. ఈ హైవేపై 3 టోల్ ప్లాజాలు (పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు) ఉన్నాయి. పంతంగి వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు రూ.15, రెండువైపులా కలిపి రూ.30, బస్సు, ట్రక్కులకు రూ.50, రెండువైపులా కలిపి రూ.75 వరకు తగ్గించారు. చిల్లకల్లు వద్ద అన్ని వాహనాలకు ఒక వైపుకు రూ.5, ఇరువైపులా కలిపి రూ.10కి కుదించారు.

News March 31, 2025

IPL: సీఎస్కే చెత్త రికార్డు

image

ఐపీఎల్‌లో సీఎస్కే చెత్త రికార్డులు మూటగట్టుకుంటోంది. 2019 నుంచి ఆ జట్టు 180పైగా టార్గెట్‌ను ఛేదించలేదు. ఇప్పటివరకు 9సార్లు ఛేజింగ్‌కు దిగగా అన్నిట్లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. మరే ఇతర జట్టు ఛేజింగ్‌లో వరుసగా ఇన్ని మ్యాచులు ఓడిపోలేదు. ఐపీఎల్ చరిత్రలో ఓవరాల్‌గా సీఎస్కే 180పైగా ఛేజింగ్ కోసం 27 సార్లు బరిలోకి దిగి 15 సార్లు గెలిచింది. ఇందులో సురేశ్ రైనా ఆడిన 13 మ్యాచుల్లో విజయం సాధించింది.

News March 31, 2025

SRH.. బౌలింగ్‌‌లో రైజ్ అవ్వరా?

image

గత సీజన్లో భారీ స్కోర్లతో అలరించిన SRH ఈ సారి రెట్టించి ఆడుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. తొలి మ్యాచులో అంచనాలను అందుకున్నా తర్వాతి రెండింట్లో విఫలమైంది. బ్యాటింగ్‌‌లో ఫర్వాలేదనిపించినా బౌలింగ్‌లో సత్తా చాటలేకపోతుంది. చివరి 2 మ్యాచుల్లోనూ ప్రత్యర్థి 4-5 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించడం ఆ బలహీనతను బయటపెడుతోంది. ఇలా అయితే 300 కొట్టినా లాభం లేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

News March 31, 2025

సరైన సమయంలోనే పద్మభూషణ్: బాలకృష్ణ

image

సరైన సమయంలో కేంద్రం తనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిందని హీరో బాలకృష్ణ అన్నారు. ఆలస్యంగా పురస్కారం వచ్చిందనే విషయమై ఆయన స్పందించారు. ఆదిత్య 369 వంటి సినిమాలు ఏ జనరేషన్‌కైనా నచ్చుతాయని చెప్పారు. ఇలాంటి సినిమాలు చేయాలని చాలా మంది ప్రయత్నించినా ఈ స్థాయిలో సక్సెస్ అవ్వలేదన్నారు. ఏప్రిల్ 4న ఈ మూవీ రీరిలీజ్ కానుంది.

News March 31, 2025

రాష్ట్రంలో నేటి నుంచి వర్షాలు

image

AP: నేటి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ మోస్తరు వర్షాలు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని అంచనా వేసింది. 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ వర్షాలతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు TGలో కూడా ఎల్లుండి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

News March 31, 2025

❤️ఇది కదా సక్సెస్ అంటే..!

image

నిన్న CSKపై RR ఘన విజయం సాధించింది. కెప్టెన్ రియాన్ పరాగ్ కెప్టెన్సీలో ఆ జట్టుకు ఇది తొలి గెలుపు. తన అభిమాన క్రికెటర్ ఎంఎస్ ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న CSKను పరాగ్ ఓడించడం విశేషం. ఈ క్రమంలో ధోనీతో కలిసి దిగిన చిన్నప్పటి పరాగ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఆరాధ్య క్రికెటర్‌తో పోటీపడి ఆ జట్టును ఓడించడం కంటే సక్సెస్ ఏముంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.