India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఇవాళ మ.12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై ఆయనతో చర్చించే అవకాశం ఉంది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క్యాబినెట్‌లో నలుగురికి చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
TG: సింగరేణి గనుల నుంచి ఈ నెల 28న 3.25 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసినట్లు సంస్థ సీఎండీ బలరాం తెలిపారు. 136 ఏళ్ల చరిత్రలో ఇదొక రికార్డని పేర్కొన్నారు. అధికారులు, కార్మికుల కృషితోనే ఇది సాధ్యమైందని చెప్పారు. రానున్న రోజుల్లోనూ ఇలాగే బొగ్గు ఉత్పత్తి చేస్తామన్నారు.
ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రాంతంలో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైందని ఆ దేశ భూకంప పరిశీలన కేంద్రం తెలిపింది. భూ ఉపరితలానికి 18 కి.మీ లోతున భూకంప కేంద్రం నెలకొని ఉందని పేర్కొంది. థాయ్‌లాండ్, మయన్మార్ దేశాలను భారీ భూకంపం కుదిపేసిన రోజుల వ్యవధిలోనే తమ వద్దా భూకంపం రావడంతో ఇండోనేషియావాసులు నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
TG: ఇటీవల గ్రూప్-1 మెయిన్స్ ప్రొవిజనల్ మార్కులను విడుదల చేసిన టీజీపీఎస్సీ ఇవాళ జనరల్ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేసింది. https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో లిస్టును అప్‌లోడ్ చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
TG: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలోకి కొత్తగా 164 ప్రైవేటు ఆస్పత్రులను చేర్చేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో 1,042 ఆస్పత్రులుండగా, ఇందులో 409 ప్రైవేటు హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రభుత్వం చికిత్స ఖర్చును రూ.10 లక్షలకు పెంచడంతోపాటు మొత్తంగా 1,835 వ్యాధులను చేర్చింది. దీంతో 2024-25లో 3.53 లక్షల మంది చికిత్స చేయించుకున్నారు.
IPLలో నిన్న గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ ఆడటం ద్వారా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించారు. టీ20 క్రికెట్(IPL+దేశవాళీ+ఇంటర్నేషనల్)లో 450 మ్యాచ్‌లు ఆడిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో దినేశ్ కార్తీక్(412), విరాట్ కోహ్లీ(401), ధోనీ(393), సురేశ్ రైనా(336) ఉన్నారు. ఓవరాల్‌గా కీరన్ పొలార్డ్(695), బ్రావో(582), షోయబ్ మాలిక్(555), రస్సెల్(540), నరైన్(537) తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.
ఉగాది సందర్భంగా ప్రధాని మోదీ తెలుగు, కన్నడ భాషల్లో శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇది ఆశ, ఉత్సాహాలతో ముడిపడి ఉన్న ఒక ప్రత్యేక పండుగ, ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని, శ్రేయస్సును, విజయాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నా. సంతోష, సామరస్యాల స్ఫూర్తి వృద్ధి చెందుతూ మరింత వర్ధిల్లుతుందని ఆకాంక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
TG: భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలకు అర్చకులు ఇవాళ అంకురార్పణ చేయనున్నారు. ఏటా ఉగాది నాడు ఈ వేడుకలు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడంతోపాటు ఆస్థాన పురోహితులతో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. సీతారాములవారి రాశి ఫలాలను వివరిస్తారు. ఉత్సవాల సందర్భంగా ఏప్రిల్ 12 వరకు నిత్య కళ్యాణాలను నిలిపివేసినట్లు అర్చకులు తెలిపారు.
TG: ఉగాది పండుగ వేళ తీవ్ర విషాదం నెలకొంది. కామారెడ్డి (D) ఎల్లారెడ్డి (M) వెంకటాపూర్‌లో చెరువులో పడి తల్లి, ముగ్గురు పిల్లలు మృతిచెందారు. చెరువులో స్నానానికి దిగి మునిగిపోతున్న ముగ్గురు పిల్లలను కాపాడేందుకు యత్నించిన తల్లి వారితో పాటు మునిగి చనిపోయారు. మృతులను మౌనిక(26), మైథిలి(10), అక్షర (8), వినయ్(5)గా గుర్తించారు. పండుగ పూట నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ హైదరాబాద్, నల్గొండ, విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో కిలో చికెన్ రూ.230- రూ.260 వరకు విక్రయిస్తున్నారు. వరుస సెలవుల సందర్భంగా డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరను పెంచి అమ్మకాలు చేస్తున్నారు. గత వారం బర్డ్ ఫ్లూ వ్యాప్తి, భయంతో చికెన్ కొనుగోళ్లు పడిపోగా కిలో రూ.150కే అమ్మారు. మీ ప్రాంతంలో కిలో చికెన్ ధర ఎంత ఉందో COMMENT చేయండి.
Sorry, no posts matched your criteria.