India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నార్పలలోని సూర్య నగర్ కాలనీలో నివాసమున్న మల్లారెడ్డి కుమారుడు హేమేశ్ కుమార్ అదే కాలనీకి చెందిన యువతిని ప్రేమించమని వేధించేవాడు. ఇదే క్రమంలో శనివారం ఆ అమ్మాయి ఇంటికి వెళ్లగా తండ్రి అడ్డుకున్నాడు. దీంతో హేమేశ్ యువతి తండ్రిపై కొడవలితో దాడి చేశాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు నార్పల ఎస్ఐ సాగర్ తెలిపారు.

అనంతపురంలో ఆదివారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా చర్యలు చేపట్టామని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రజలు, ఉత్సవ కమిటీలు, యువత సహకరించాలని కోరారు. ఆనందంగా, సంతోషకర వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. శోభాయాత్ర, నిమజ్జనం నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేయమని ఎస్పీని కోరారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు వినియోగించాలన్నారు.

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో పెన్షన్లు, ఇతర అభివృద్ధి అంశాలపై కలెక్టర్ డా.వినోద్ కుమార్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ల పునఃపరిశీలన సమయంలో 9,601 అనర్హమైన పింఛన్లుగా గుర్తించామన్నారు. వాటిలో 7,399 మందిని అర్హులుగా గుర్తించి సెప్టెంబర్ 1న పెన్షన్ అందిస్తామన్నారు. ఇప్పటి వరకు అప్పీల్ చేసుకొని 2,202 మంది సంబంధిత ఎంపీడీఓ/మునిసిపల్ కార్యాలయంలో అప్పీల్ చేసుకోవచ్చన్నారు.

పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామంలో అనంతపురం జిల్లా మలేరియా అధికారి ఓబులు శనివారం పర్యటించారు. ఇటీవల ఓ విద్యార్థికి డెంగీ వ్యాధి లక్షణాలు నిర్ధారణ కావడంతో అతని గృహాన్ని సందర్శించి, వ్యాధిపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డెంగీ వ్యాధి ప్రబలకుండా ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీనివాసులు ఉన్నారు.

అవాంఛనీయ ఘటనలు జరగకుండా గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ పి.జగదీష్ సూచించారు. శుక్రవారం రాచానపల్లి, పంపనూరు సమీప నిమజ్జనం ప్రాంతాలను పరిశీలించారు. బారికేడ్లు, విద్యుద్దీపాలు ఏర్పాటు చేసి, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వృద్ధులు, పిల్లలు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

అనంతపురాన్ని నాటసారా రహిత జిల్లాగా ప్రకటించామని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పరిధిలో నవోదయం 2.0 పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 104 గ్రామాలను నాటుసారా రహిత గ్రామాలుగా ప్రకటించామని చెప్పారు. అనంతరం పోస్టర్ విడుదల చేశారు.

వచ్చే నెల నుంచి ప్రభుత్వ రేషన్ షాప్‌లలో లబ్ధిదారులకు రాగులు, జొన్నలు పంపిణీ చేయనున్నట్లు అనంతపురం జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ రమేశ్ రెడ్డి తెలిపారు. 6 నెలలకు సరిపడా సరుకును జిల్లాకు కేటాయించినట్లు పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 6,600 మెట్రిక్ టన్నుల జొన్నలు, 2,700 మెట్రిక్ టన్నుల రాగులను కేటాయించినట్లు పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సన్నద్ధం కావాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. అనంతపురంలోని కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో గురువారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్లు పంపిణీ, రేషన్ పంపిణీలో ఎలాంటి జాప్యం, అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇవాళ డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్థుల విద్యార్హత, ఇతర ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో నకిలీవని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలోని బాలాజీ పీజీ కళాశాల ఆవరణలో పత్రాల పరిశీలన ఉంటుందన్నారు.

పుట్లూరు మండలం కడవకల్లుకు చెందిన విష్ణునారాయణను అనంతపురం జిల్లా వైసీపీ కార్యదర్శి (ఆక్టివిటీ)గా నియమిస్తూ వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. సింగనమల నియోజవర్గ ఇన్‌ఛార్జ్ శైలజనాథ్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తనపై నమ్మకం ఉంచి పదవి కేటాయించినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.