India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఊర్లో దేవర. కొత్త దుస్తుల కోసం ఆ దంపతులు అనంతపురం జిల్లా యాడికి వెళ్లారు. సంతోషంగా తిరుగుపయణం అవగా వారి బైక్‌ను బొలెరో ఢీకొంది. ఈ విషాద ఘటనలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లికి చెందిన రాజశేఖర్ (38), సుమలత (35) మరణించారు. కొత్త దుస్తుల కోసం పాఠశాల నుంచి హుషారుగా ఇంటికి వచ్చిన పిల్లలు పూజిత, మిథిల్ తల్లిదండ్రుల శవాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటనతో ఇద్దరు చిన్నారులూ అనాథలయ్యారు.
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చందశేఖర్ రెడ్డిపై టీడీపీ నేతలు పరశురామ్, విజయకుమార్ జిల్లా ఎస్పీ జగదీశ్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో చంద్రబాబు, నారా లోకేశ్‌ను దూషిస్తూ వ్యక్తిగతంగా దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆ రోజే అనుకొని ఉండుంటే మొద్దు శ్రీనుతో లోకేశ్‌ని చంపించేవాడని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలిపారు.
అర్హులందరికీ సదరం సర్టిఫికెట్లు అందించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో దీర్ఘకాలిక వ్యాధులతో మంచం పట్టి రూ.15,000 పింఛన్ పొందుతున్న వారి ధ్రువీకరణ పత్రాలను నిశితంగా పరిశీలించాలనే అంశంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సర్టిఫికెట్ల పరిశీలన కొరకు ప్రత్యేక వైద్యులతో బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
వన్ హాస్పిటల్ వన్ విలేజ్‌లో ఫ్రీ హెల్త్ చెకప్ అందించేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆరోగ్య యోజన కింద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి మైదానంలో శుక్రవారం సాయంత్రం మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఎస్పీ జగదీశ్ పర్యవేక్షణలో 4వ రోజున ఈవెంట్స్ పారదర్శకంగా కొనసాగాయి. ప్రత్యేకంగా మహిళా పోలీసు అధికారులు, సిబ్బందిని కేటాయించి, అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు పాటించారు.
పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్‌పై ఈ నెల 10 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం పుట్టపర్తిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమంలో భాగంగా ఈనెల 10 వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
తాడిపత్రిలో సినీ నటి మాధవీ లతపై రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, మహిళా కౌన్సిలర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎస్ఐ గౌస్ బాషాకు ఫిర్యాదు పత్రాన్ని అందించారు. గత నెల 31న జేసీ పార్క్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంపై మాధవీ లత తప్పుడు ఆరోపణలు చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ ఇంటర్, స్కూల్, స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో ధర్మవరం బాలికల జట్టు రాణించి రన్నర్స్‌గా (ద్వితీయ స్థానం) నిలించింది. ఈ మేరకు అనంతపురం ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రా రెడ్డి గురువారం తెలిపారు. గత నెల 28, 29, 30వ తేదీలలో చిత్తూరులో జరిగిన టోర్నమెంట్లో ధర్మవరం జట్టుపై బంగారుపాలెం జట్టు 2 పాయింట్లతో గెలిచి మొదటి స్థానం కైవసం చేసుకుందన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం కునుకుంట్లలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గు వేసి అందులో ఎనుము పుర్రెను పెట్టి పూజలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాడిమర్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
దీర్ఘకాలిక వ్యాధులతో మంచం పట్టి రూ.15 వేలు పింఛన్ పొందుతున్న వారి ధ్రువీకరణ పత్రాలను నిశితంగా పరిశీలించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు, సెర్ప్ సీఈవో వీర పాండ్యన్ తెలిపారు. రాజధాని నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.