India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్‌ను ఎస్పీ రత్న గురువారం కలిశారు. పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు, శాంతిభద్రతల అంశాలు గురించి చర్చించారు.
అనంతపురం జిల్లాలో మందు బాబులు కిక్కుతో 2024కు వీడ్కోలు పలికి.. 2025 సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పారు. డిసెంబర్ 31న మద్యం ప్రియులు ఫూటుగా తాగడంతో జిల్లాలో రికార్డు స్థాయి మద్యం అమ్మకాలు జరిగాయి. 24 గంటల్లో ఏకంగా రూ.5.46 కోట్ల లిక్కర్ బిజినెస్ జరిగింది. అనంతపురం జిల్లాలో రూ.3.87 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.1.59 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.
అనంతపురంలోని ఓ కళాశాలలో <<15040374>>ఇంటర్<<>> విద్యార్థిని చిన్నతిప్పమ్మ (17) బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. అందిన వివరాల మేరకు.. బాలిక చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆర్డీటీ సహకారంతో చదువుకుంటోంది. తన జూనియర్ ఓ బాలికతో స్నేహం ఉండగా ఇటీవల వారి మధ్య దూరం పెరిగినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఒంటరితనంగా ఫీలై ఆత్మహత్యకు పాల్పడిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాలేజీ హాస్టల్లోనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో జరిగింది. విడపనకల్ మండలం పాల్తూరుకు చెందిన చిన్నతిప్పమ్మ అనంతపురంలోని ఓ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఇవాళ ఆమె తన కాలేజీ హాస్టల్లో ఉరేసుకుని చనిపోయింది. గమనించిన యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
అనంతపురంలో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న కిలో టమాటా రూ.9 పలికింది. సరాసరి ధర రూ.6, కనిష్ఠ ధర రూ.4తో విక్రయాలు జరిగాయి. టమాటా కోత కూలీలు, ఖర్చులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు.
➤ ఇక చీనీ ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. నిన్న టన్ను గరిష్ఠంగా రూ.27,420 తో అమ్ముడయ్యాయి.
ఎస్సీ కుల గణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు అనంతపురం ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31వ తేదీతో గడువు ముగియడంతో మరో వారం రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
సినీ నటి సాయి పల్లవి పుట్టపర్తికి వచ్చారు. శ్రీ సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహా సమాధి దర్శనంలో పాల్గొన్నారు. విద్యార్థులు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలను తిలకించారు. హారతి కార్యక్రమం అనంతరం మహా సమాధిని దర్శించుకున్నారు. పట్టుచీరలో సంప్రదాయంగా మెరిసి ఆకట్టుకున్నారు. గతేడాది కూడా ఇదే సమయంలో బాబాను దర్శించుకున్నారు.
న్యూ ఇయర్ అంటే ఒకప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ సందడి. అంగట్లో ఛార్ట్ కొని శుభాకాంక్షలు చెబుతూ ఫ్రెండ్స్‌కు పంచేటప్పుడు వచ్చే ఆనందమే వేరు. కార్డులు ఇవ్వకపోతే కొత్త ఏడాది రానట్టే అని ఫీలైన వారు ఎంతమందో. ఇంట్లో మారాం చేసయినా తమకు ఇష్టమైన నటీనటుల కార్డులు కొనేవారు. రాను రాను ఆ కార్డులు కనుమరుగైపోయాయి. టెక్నాలజీ యుగంలో కంప్యూటర్ గ్రీటింగ్సే దిక్కయ్యాయి. మరి ఆ కార్డుల అనుభూతి మీరు పొందారా? కామెంట్ చేయండి..
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌ను శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ సోమవారం తనిఖీ చేశారు. అనంతరం కాసేపు టీచర్‌గా మారి విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పాఠశాలలోని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణతో చదువుకోవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల సిబ్బందకి పలు సూచనలు చేశారు.
బుక్కరాయసముద్రంలోని ఆనంతసాగర్ కాలనీకి చెందిన రత్నమయ్యకు హత్య కేసులో ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ తీర్పు వెలువరించారు. అదే కాలనీకి చెందిన వినోద్ కుమార్‌ను ఛాతీపై పొడవడంతో మృతి చెందగా 2022లో కేసు నమోదైంది. పలుమార్లు సాక్షులను విచారించిన న్యాయస్థానం.. నేరం రుజువు కావడంతో శిక్ష విధించింది.
Sorry, no posts matched your criteria.