India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆర్థిక దోపిడీ చేయడానికి ప్రభుత్వం PAC ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వలేదని ఎర్రగొండపాలెం వైసీపీ MLA తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ‘జగన్ గారు భయపడి అసెంబ్లీకి రావడం లేదని కూటమి నాయకులు అంటున్నారు. మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చూస్తే ఎందుకంత భయం? పీఏసీ ఛైర్మన్ పదవికి ఆయన నామినేషన్ వేస్తే ఎందుకు కుట్ర చేశారు?’ అని ప్రశ్నించారు. కాగా PAC ఛైర్మన్‌గా జనసేన MLA రామాంజినేయులు ఎన్నికయ్యారు.
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆన్లైన్ టెండర్లు, సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలం ద్వారా రూ.4.44 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈఓ గురుప్రసాద్ తెలిపారు. లైసెన్సులు ద్వారా రూ. 2.03 కోట్లు సమకూరినట్లు చెప్పారు. ఆన్లైన్, సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలంతో రూ.2.40 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
జార్జియా దేశంలో ఎంబీబీఎస్ కోర్సు చేయడానికి వెళ్లిన 60 మంది తెలుగు విద్యార్థులు అక్కడి హాస్టల్ నిర్వాహకులు చేసిన మోసంతో రోడ్డుపై పడ్డారని, భారత ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కలుగజేసుకొని క్షేమంగా ఆ విద్యార్థులను స్వదేశానికి తీసుకురావాలని విద్యార్థిని తండ్రి వై.ఆనంద్ రెడ్డి ప్రభుత్వాల పెద్దలకు విజ్ఞప్తి చేశారు.
మధ్యాహ్న సమయంలో మాత్రమే <<14677511>>దొంగతనాలు<<>> చేసే వ్యక్తి తిరుపతి పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ప్రకాశం(D) సింగరాయకొండ(M) సోమరాజుపల్లికి చెందిన అప్పలనాయుడు(29), చెడు అలవాట్లకు బానిసై 16వ ఏట నుంచి దొంగతనాలు చేస్తున్నాడు. విమానాల్లో తిరుగుతూ..ఎంజాయ్ చేస్తుంటాడు. తిరుపతిలోని ఓ ఫైనాన్స్ ఆఫీసులో ఈనెల 15న రూ.8 లక్షలు దొంగలించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరాయకొండ, ఒంగోలు, విశాఖలో ఇతనిపై 18 కేసులు ఉన్నాయి.
మాజీ మంత్రి, పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ YCP అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్‌గా ఉన్న ఆయనకు తాజాగా ఉమ్మడి తిరుపతి, చిత్తూరు జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో M.A ఇంగ్లిష్ రెండో, నాల్గో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించింది.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC) ఛైర్మన్ పదవి ప్రతిపక్షాలకు ఇస్తుంటారు. ఈక్రమంలో వైసీపీ తరఫున మాజీ మంత్రి, పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. పీఏసీలో మొత్తం 9 మంది సభ్యులు ఉంటారు. కూటమి ప్రభుత్వం నుంచే 9 మంది నామినేషన్లు వేశారు. వీరికి తోడుగా పెద్దిరెడ్డి నామినేషన్ పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి పీఏసీ ఛైర్మన్‌కు ఇవాళ ఓటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు. గురువారం రాత్రి ఆయన ఆలయ మాడవీధులలో పర్యటించారు. భద్రతాపరమైన అంశాలపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. పంచమి తీర్థమనాడు పుష్కర స్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకునే బాధ్యత పోలీసు వారు తీసుకోవాలన్నారు. వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తిరుపతి జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్ ఛాంబర్ నందు బాలాజీ రిజర్వాయర్, మల్లెమడుగు రిజర్వాయర్ పెండింగ్ పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు.
డిగ్రీ విద్యార్థి మామండూరు వాటర్ ఫాల్స్ వద్ద మృతి చెందాడు. తిరుపతి SV ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్( సైకాలజీ) చదువుతున్న హేమాద్రి అనే విద్యార్థి గురువారం స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్‌కు వెళ్లాడు. అతని స్నేహితుడు వాటర్‌ఫాల్స్‌లో మునిగిపోతుండగా రక్షించే క్రమంలో మృతి చెందినట్లు సహచర స్నేహితులు తెలిపారు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తివివరాలు తెలియాల్సిఉంది.
Sorry, no posts matched your criteria.