Chittoor

News April 10, 2026

చిత్తూరు: ఫేక్ సర్టిఫికెట్లు… ముగ్గురు ఉద్యోగుల తొలగింపు

image

తప్పుడు విద్యార్హత సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందిన ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లను తొలగిస్తూ కర్నూలు ఉప లోకాయుక్త జస్టిస్ రజిని ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 2024లో ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు భర్తీ చేశారు. ఇందులో అక్రమాలు జరిగినట్లు తేలింది. దీంతో గంగవరం ప్రభుత్వాసుపత్రి ల్యాబ్ టెక్నీషియన్ వి.నాగవేణితో పాటు, నాగలాపురం, మదనపల్లెలో మరో ఇద్దరిని తొలగించారు.

News April 10, 2026

పోషకాహార లోపాన్ని నివారించాలి: చిత్తూరు కలెక్టర్

image

చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టరేట్‌లో పోషణ్ పక్వాడ అవగాహన పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. అంగన్వాడీ ప్రీ స్కూల్ కిట్‌ను పరిశీలించారు. ఆరోగ్యవంతమైన సమాజానికి పోషకాహారం ఎంతో కీలకమని తెలిపారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 10, 2026

పోషకాహార లోపాన్ని నివారించాలి: చిత్తూరు కలెక్టర్

image

చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టరేట్‌లో పోషణ్ పక్వాడ అవగాహన పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. అంగన్వాడీ ప్రీ స్కూల్ కిట్‌ను పరిశీలించారు. ఆరోగ్యవంతమైన సమాజానికి పోషకాహారం ఎంతో కీలకమని తెలిపారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 9, 2026

అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సమష్టి కృషితోపాటు.. అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ తుషార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News April 9, 2026

మీ పిల్లలను ఇంటర్‌లో జాయిన్ చేస్తున్నారా.?

image

చిత్తూరు జిల్లాలో విద్యార్థులను గుర్తింపు ఉన్న ఇంటర్మీడియట్ కాలేజీల్లోనే చేర్చాలని తల్లిదండ్రులకు డీఐఈఓ రఘుపతి సూచించారు. ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన వెల్లడించారు. కాలేజీలో లెక్చరర్లు, ల్యాబ్ తదితర సౌకర్యాలు పూర్తిస్థాయిలో ఉన్నాయో లేవో తెలుసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో పలు సౌకర్యాలను విద్యార్థుల కోసం కల్పిస్తున్నామన్నారు.

News April 9, 2026

కుప్పం మండలానికి రూ.1.5 కోట్ల నజరానా: DPO

image

జాతీయస్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో నానాజీ దేశ ముఖ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ (NDSPSVP)లో కుప్పం మండలం తృతీయ స్థానం సాధించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నజరానా రూ.1.50 కోట్లు జమ చేసినట్లు డీపీవో సుధాకర్ రావు బుధవారం తెలిపారు. కుప్పం మండలంలోని నాయనూరు పంచాయతీలో పర్యటించిన కేంద్ర బృందం వసతులు బాగుండడంతో మండలాన్ని జాతీయ అవార్డుకు ఎంపిక చేసిందని ఆయన చెప్పారు.

News April 9, 2026

చిత్తూరు: పునర్విభజన షెడ్యూల్‌లో మార్పులు

image

జిల్లాలో మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజన షెడ్యూల్ రివైజ్ చేస్తూ రాష్ట్ర పురపాలక కమిషనర్ సంపత్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. డివిజన్లు, వార్డుల డ్రాప్ట్ ప్రతిపాదనలను రూపొందించేందుకు ఈనెల 26 వరకు గడువిచ్చారు. 27 నుంచి మే 3వ తేదీ వరకు ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి సూచనలను తీసుకోవాలన్నారు. మే 30 న తుది పునర్విభజనపై ప్రభుత్వం గెజిట్ విడుదల చేస్తుందని అందులో పేర్కొన్నారు.

News April 9, 2026

చిత్తూరు: ఆరెంజ్ జోన్‌లో రెండు మండలాలు

image

బుధవారం అత్యధికంగా నగరిలో 42.1, గంగవరంలో 40.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రెండు మండలాలు ఆరెంజ్ జోన్‌లోకి వెళ్లాయి. పలమనేరులో 40.5, నిండ్రలో 39.7, శ్రీరంగరాజపురం, విజయపురంలో 39.8, వెదురుకుప్పం, పులిచెర్లలో 39.5, రొంపిచెర్లలో 39.3, చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్లో 39.1, గుడిపాలలో 38.9, పూతలపట్టులో 38.6, పాలసముద్రం, పెద్దపంజాణి, పెనుమూరు, యాదమరి(M)లో 38.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.

News April 8, 2026

చిత్తూరు జిల్లాలో అదనంగా కోర్టులు.. కొత్త ఉద్యోగాలు!

image

APలో కొత్తగా 96 కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా చిత్తూరు జిల్లాలో 6 కోర్టులు రానున్నాయి. చిత్తూరులో 7వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు, మదనపల్లెలో మూడో అదనపు సివిల్ కోర్టు, పలమనేరులో మొదటి అదనపు సివిల్ కోర్టు, రెండో అదనపు సివిల్ కోర్టు, పుంగనూరులో రెండో అదనపు సివిల్ జడ్జి కోర్టు, వాయల్పాడులో మొదటి అదనపు సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కానుంది. వీటితో కొత్త ఉద్యోగాలు వస్తాయి.

News April 8, 2026

చిత్తూరు: 18 మండలాల్లో 40 డిగ్రీలు

image

చిత్తూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 18 మండలాల్లో మంగళవారం నలభై డిగ్రీలకుపై ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎస్ఆర్ పురం 42.6, నగరి 42.4, విజయపురం 41.7, పలమనేరు 41.3, గంగవరం 40.9 డిగ్రీలు నమోదు అయింది. చిత్తూరు 41.8, గుడిపాల, తవణంపల్లె, బంగారు పాళ్యంలో 41.3, పూతలపట్టు, శాంతిపురం 41, గంగాధర నెల్లూరు 40.9, పెద్ద పంజాణి 40.6, పాలసముద్రం, పెనుమూరు, యాదమరిలో 40.2, ఐరాలలో 40 డిగ్రీల ఎండ కాసింది.